E-Paper
Advertisement

పోలీస్ స్టేషన్లో లేడీ ఆఫీసర్ ను ఓ ఆట ఆడుకునే దెయ్యాలు… ఒళ్లు గగుర్పొడిచే క్లైమాక్స్

పోలీస్ స్టేషన్లో లేడీ ఆఫీసర్ ను ఓ ఆట ఆడుకునే దెయ్యాలు… ఒళ్లు గగుర్పొడిచే క్లైమాక్స్
Advertisement

Horror Thriller Movie : సీట్ ఎడ్జ్ సైకలాజికల్ హారర్ సినిమా ‘లాస్ట్ షిఫ్ట్’ (Last Shift 2014). టైటిల్ కు తగ్గట్టుగానే ఈ సినిమా కథ ఒకే ఒక్క రాత్రిలో, ఒక పాత పోలీస్ స్టేషన్ లోపల జరుగుతుంది. ఒక్కొక్క ట్విస్ట్ కు వెన్నులో వణుకు పుడుతుంది. స్టోరీ మొత్తం ఒకే పాత్ర చుట్టూ తిరుగుతుంది. అందులో ప్రధాన పాత్ర అయిన యువ పోలీస్ అధికారిణి ‘జెసికా లోరెన్’గా జూలియానా హర్కవీ (Juliana Harkavy)నే ఆ పాత్రను పోషించింది. అలాగే ఈ కథకు మూలకారణమైన సైకో కిల్లర్, కల్ట్ లీడర్ ‘జాన్ మైఖేల్ పేమన్’ పాత్రలో జాషువా మైకెల్ (Joshua Mikel) ఎంతో భయంకరంగా కనిపిస్తాడు.

ఇండియాలో ఎక్కడ చూడొచ్చంటే ?

ప్రధాన నటులతో పాటు జె. లారోస్ (J. LaRose) ఒక ముఖ్యమైన పాత్రలో నటించగా, పోలీసులకు ఫోన్ చేసి సహాయం కోరే మోనికా (మారిగోల్డ్) పాత్రలో నటాలీ విక్టోరియా (Natalie Victoria) నటించింది. పరిమితమైన నటీనటులు ఉన్నప్పటికీ, అందరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసి సినిమాకు మంచి హారర్ అనుభూతిని తీసొచ్చారు. దర్శకుడు ఆంథోనీ డిబ్లాసి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, ప్రస్తుతానికి భారతదేశంలో ఏ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనూ స్ట్రీమింగ్ కావడం లేదు. ఈ సినిమాను Amazon Prime Video USA లేదా Tubi TV లలో చూడవచ్చు.

కథలోకి వెళ్తే…

Advertisement

మన హీరోయిన్ జెసికా లోరెన్. ఆమె కొత్తగా పోలీస్ ఉద్యోగంలో చేరుతుంది. ఆమె తండ్రి కూడా పోలీస్ ఆఫీసరే. ఆయన కొంతకాలం క్రితం డ్యూటీలోనే చనిపోయారు. ఇక జెసికాకు మొదటి రోజే ఒక పాత పోలీస్ స్టేషన్‌ లో రాత్రి 10 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు నైట్ షిఫ్ట్ డ్యూటీ వేస్తారు. ఆ స్టేషన్‌ ను మూసివేసి, కొత్త బిల్డింగ్‌ కు మారుస్తూ ఉంటారు. ఈ క్రమంలో అక్కడ కేవలం కొన్ని ఫైళ్లు, వేస్ట్ సామాగ్రి మాత్రమే మిగిలి ఉంటాయి. వాటిని తీసుకెళ్లడానికి ఒక టీమ్ వస్తుంది, కానీ వారు వచ్చే వరకు స్టేషన్ ను చూసుకోవాల్సిన బాధ్యతను జెసికాకు అప్పజెప్తారు.

సరిగ్గా అర్దరాత్రి 12 గంటలు దాటిన తర్వాత జెసికాకు ఆ పోలీస్ స్టేషన్ లో వింత అనుభవాలు ఎదురవుతాయి. లైట్లు వాటంతట అవే ఆరిపోవడం, వెలుగుతూ ఉండటం మొదలవుతుంది. అలాగే వింత శబ్దాలు విన్పిస్తాయి. లాకప్ గదుల నుండి ఎవరో గట్టిగా అరుస్తున్నట్లు, తలుపులు బాదుతున్నట్లు శబ్దాలు వస్తాయి. అలాంటి సమయంలోనే ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి, తనను ఓ ముఠా చంపడానికి చూస్తోంది కాపాడండి అని ఏడుస్తూ హెల్ప్ అడుగుతుంది. కానీ ఆ అమ్మాయి చెప్పిన ముఠా ఏడాది క్రితమే చనిపోయింది.

Advertisement

ఈ నేపథ్యంలోనే ఒక ముసలివాడు స్టేషన్ లోపలికి వచ్చి వాంతులు చేసుకుని మాయమవుతాడు. ప్రైస్ అనే మరో పోలీస్ ఆఫీసర్ వచ్చి జెసికాతో మాట్లాడతాడు. అతను గతంలో అక్కడ ఏం జరిగిందో రివీల్ చేస్తాడు. కానీ అతను కూడా గతంలోనే చనిపోయిన వ్యక్తి అని జెసికాకు తర్వాత తెలుస్తుంది. క్లైమాక్స్ ఊహించని విధంగా ఉంటుంది. మరి చనిపోయిన పోలీస్ రివీల్ చేసిన గతం ఏంటి ? అసలు ఆ పోలీస్ స్టేషన్ లో ఏం జరిగింది ? చివరికి జెస్సికా అక్కడి నుంచి బయట పడిందా లేదా ? అన్నది తెలియాలంటే మూవీని చూడాల్సిందే.

Read Also : 44కు పైగా ఇంటర్నేషనల్ అవార్డులు అందుకున్న మూవీ… రన్ టైమ్ 20 నిమిషాలే

Related News

స్కూల్ పిల్లాడి దారుణ హత్య… ప్రాణం పణంగా పెట్టి నిజం తేల్చే తండ్రి… ఊపిరి బిగబట్టించే సైకలాజికల్ మిస్టరీ

పగ, ప్రతీకారంతో క్రిటిక్ ప్రాణాంతక కుట్రలు… ఈ డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ ను డోంట్ మిస్

​ఏలియన్స్ దాడి నుండి భూమిని కాపాడే ఏజెంట్లు… మైండ్ బ్లోయింగ్ సై-ఫై హై-టెక్ యాక్షన్ అడ్వెంచర్

వైట్ హౌస్ పై ఉగ్రవాదుల అటాక్… ప్రెసిడెంట్ ను కాపాడేందుకు సీక్రెట్ ఏజెంట్ మైండ్ బ్లాక్ ప్లాన్… డెడ్లీ యాక్షన్ థ్రిల్లర్ తెలుగులో

సమస్యలతో అల్లాడుతున్న ఐదుగురి జీవితాల్లోకి బాబా ఎంట్రీ… ఎమోషనల్ స్పిరిచువల్ డ్రామా

రాక్షస శక్తుల వలలోపడి రాజ్యాన్ని సర్వనాశనం చేసే చక్రవర్తి… దేవతల ఎంట్రీతో దిమ్మతిరిగే ట్విస్ట్…

మంచు తుఫానుతో గడ్డకట్టిపోయే భూగోళం… స్పైన్ చిల్లింగ్ సైన్స్ ఫిక్షన్ సర్వైవల్ థ్రిల్లర్

రిజర్వాయర్ నీళ్లలో నక్కిన భయంకరమైన శక్తులు… వణికించే కొరియన్ ఫోక్ హారర్ మిస్టరీ థ్రిల్లర్

Big Stories

Advertisement
×