Best Marathi Films : మరాఠీ సినిమా ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకర్షిస్తోంది. భావోద్వేగాలు, బలమైన కథలు, ఆకట్టుకునే నటన… వంటి అంశాలతో మరాఠీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కూడా రికార్డులు సృష్టిస్తున్నాయి. 2026 వరకు అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 5 మరాఠీ సినిమాల గురించి, అవి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
రితేష్ దేశ్‌ముఖ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ బయోపిక్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కింది. సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్, విద్యా బాలన్, జెనీలియా దేశ్‌ముఖ్, ఫర్దీన్ ఖాన్ వంటి స్టార్స్ నటించిన ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ స్పెషల్ అతిథి పాత్రలో కనిపించి మెప్పించారు. పీరియాడిక్ డ్రామా, యాక్షన్, ఎమోషన్ అన్నీ బ్యాలెన్స్‌గా ఉండటం వల్ల ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఆదరించారు. బాక్సాఫీస్ దగ్గర రూ.117.79 కోట్లు సాధించిన ఈ సినిమా త్వరలో JioHotstarలో విడుదల కానుంది.
మరాఠీ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఇది ఒకటి. రింకు రాజ్‌గురు, ఆకాష్ తోసర్ నటించిన ఈ లవ్ స్టోరీలో కులాల మధ్య ఉన్న ప్రేమ, సమాజపు వైరుధ్యాలను ధైర్యంగా చూపించారు. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాక కరణ్ జోహార్ దీన్ని ‘ధడక్’ అనే పేరుతో హిందీలో రీమేక్ చేశాడు. ZEE5, Amazon Prime Videoలో ఇప్పటికీ ఈ మూవీ అందుబాటులో ఉంది. ఈ మూవీ అప్పట్లోనే ఏకంగా రూ. 110 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టింది.
రోహిణి హట్టంగడి, వందనా గుప్తే, సుకన్య కులకర్ణి, సుచిత్రా బండేకర్ వంటి సీనియర్ నటీమణులు నటించిన ఫ్యామిలీ డ్రామా ఇది. ఇందులో మహిళల మధ్య స్నేహం, కుటుంబ బంధాలు, జీవిత సమస్యలను హార్ట్ టచింగ్ గా చూపించారు. మహిళా ప్రేక్షకుల నుంచి భారీ ఆదరణ పొందిన ఈ చిత్రం JioHotstarలో స్ట్రీమింగ్ అవుతోంది. మరాఠీ బాక్స్ ఆఫీసు వద్ద ఈ మూవీ రూ. 90.50 కోట్లు కొల్లగొట్టడం విశేషం.
రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా దేశ్‌ముఖ్ జంటగా నటించిన ఈ రొమాంటిక్ డ్రామాలో సల్మాన్ ఖాన్ స్పెషల్ అతిథి పాత్రలో కనిపించాడు. పెళ్లి తర్వాత జీవితంలో వచ్చే సవాళ్లు, ప్రేమ, బాధ్యతలను సంతోషంగా చూపించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. జియో హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది. ఈ మూవీ కలెక్షన్లు రూ. 73 కోట్లు
స్నేహల్ తార్డే, మోహన్ జోషి నటించిన ఈ ఫ్యామిలీ డ్రామాలో కుటుంబం, సంబంధాలు, జీవిత సత్యాలను సరదాగా చూపించారు. చిన్న బడ్జెట్ తో వచ్చినా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.