OTT Movie : యాక్షన్, లీగల్ డ్రామాతో ఆసక్తికరంగా ఉండే ఒక మూవీ ఓటీటీలో అదరగొడుతోంది. ఈ సినిమాలో ‘ఇప్ మ్యాన్’ హీరో డానీ యెన్ ప్రధాన పాత్రలో నటించాడు. పోలీస్ ఆఫీసర్ నుంచి లాయర్ గా మారి, నెరస్థులను ఎదుర్కునే క్రమంలో ఈ స్టోరీ నడుస్తుంది. 2024లో హాంగ్ కాంగ్‌లో ఐదవ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఇది నిలిచింది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాల్లోకి వెళితే ..
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
హాంగ్ కాంగ్ యాక్షన్-థ్రిల్లర్ మూవీ పేరు ‘ది ప్రాసెక్యూటర్’ (The Prosecutor). 2024 లో వచ్చిన ఈ సినిమాకి డానీ యెన్ దర్శకత్వం వహించారు. ఇది 2016లో హాంగ్ కాంగ్‌లో జరిగిన నిజమైన డ్రగ్ ట్రాఫికింగ్ కేసును స్ఫూర్తిగా తీసుకుంది. ఎడ్మండ్ వాంగ్ రచించిన స్క్రీన్‌ప్లే ఆధారంగా రూపొందింది. ఈ మూవీలో డానీ యెన్‌తో పాటు జూలియన్ చియుంగ్, ఫ్రాన్సిస్ ఎన్‌జి, మైఖేల్ హుయ్, కెంట్ చెంగ్, మేసన్ ఫంగ్ నటించారు. ఇది హాంగ్ కాంగ్‌లో 2024డిసెంబర్ 21, చైనాలో 2024 డిసెంబర్ 27న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం 43వ హాంగ్ కాంగ్ ఫిల్మ్ అవార్డ్స్‌లో మూడు నామినేషన్లను సాధించింది. 1 గంట 58 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాకి IMDB లో 6.6/10 రేటింగ్ ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
ఈ సినిమా స్టోరీ ఫోక్ చి-హో (డానీ యెన్) అనే అనుభవజ్ఞుడైన పోలీసు డిటెక్టివ్ చుట్టూ తిరుగుతుంది. అతను 2017లో ఒక హింసాత్మక ఆయుధ దోపిడీ గ్యాంగ్‌ను అరెస్టు చేసే ఆపరేషన్‌లో పాల్గొంటాడు. ఈ ఆపరేషన్‌లో ఫోక్ తన సహోద్యోగిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టి, గాయాలతో బయటపడతాడు. కానీ న్యాయవ్యవస్థలోని లోపాల కారణంగా నేరస్తులు జైలు శిక్ష నుంచి తప్పించుకుంటారు. ఈ ఘటన ఫోక్‌ను హాంగ్ కాంగ్ పోలీసు ఫోర్స్‌ను విడిచిపెట్టి, న్యాయవాది అవ్వాలని నిర్ణయించుకునేలా చేస్తుంది. ఏడు సంవత్సరాల తర్వాత, ఫోక్ న్యాయశాస్త్ర డిగ్రీ సంపాదించి, హాంగ్ కాంగ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్‌లో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా చేరతాడు. ఫోక్‌కు మొదటి కేసుగా, మా కా-కిట్ అనే పేద యువకుడిని డ్రగ్ ట్రాఫికింగ్ ఆరోపణలపై ప్రాసిక్యూట్ చేయడం లభిస్తుంది.
మా కా-కిట్ డ్రగ్-అడిక్టెడ్ తల్లిదండ్రుల నుండి బయటికి వచ్చి తన తాత యూన్ మా దగ్గర ఉంటాడు. ఒక డ్రగ్ కేసులో అతన్ని లాయర్లు, తక్కువ శిక్ష కోసం నేరం ఒప్పుకోమని ఒత్తిడి చేస్తారు. కానీ అనూహ్యంగా అతనికి 27 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. మా కా-కిట్ ఒక పెద్ద డ్రగ్ ట్రాఫికింగ్ ఆపరేషన్‌లో పావుగా ఉపయోగించబడ్డాడని ఫోక్ నమ్ముతాడు. ఫోక్ ఈ కేసును మళ్లీ తెరవడానికి నిర్ణయించుకుంటాడు. ఫోక్ తన దర్యాప్తును ప్రారంభిస్తాడు. ఇది అతన్ని హాంగ్ కాంగ్ క్రిమినల్ అండర్‌వరల్డ్, అవినీతిపరమైన లీగల్ నెట్‌వర్క్‌లోకి తీసుకెళ్తుంది. ఫోక్ దర్యాప్తు మరింత లోతుగా వెళ్లేకొద్దీ, అతను, అతని సాక్షులు హత్యాయత్నాలను ఎదుర్కొంటారు. ఆతరువాత స్టోరీ ఊహించని మలుపు తిరుగుతుంది. చివరికి ఫోక్ న్యాయ పోరాటం విజయవంతమవుతుందా ? మా కా-కిట్ కి ఈ కేసులో న్యాయం జరుగుతుందా ? నెరస్థులకు శిక్ష పడుతుందా ?అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : ఈగకు దొంగతనం నేర్పి కోటీశ్వరులయ్యే ప్లాన్… చివరకు బుర్రపాడు ట్విస్ట్