BigTV English

WATCH : ఒరేయ్ ఇదెక్కడి ఫీల్డింగ్ రా.. స్లిప్ లో 8 మందిని పెడతారా!

WATCH : ఒరేయ్ ఇదెక్కడి ఫీల్డింగ్ రా.. స్లిప్ లో 8 మందిని పెడతారా!

WATCH : సాధారణంగా క్రికెట్ (Cricket)  లో ఎప్పుడూ ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ఎప్పుడూ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా కొందరూ గల్లీ క్రికెట్ రకరకాల చిత్ర విచిత్రంగా క్రికెట్ ఆడుతుంటారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో అవి తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా బౌలర్ స్పీడుగా ఉరుకొచ్చి రెండు చేతులతో తిప్పి ఏ చేత్తో బంతి వేస్తున్నాడో అర్థం కాకుండా.. మరోవైపు బ్యాటర్ బంతిని కొడితే అది వికెట్లు తాకుతుందో లేక ఎక్కడికి వెళ్తుందో గుర్తు పట్టడం కష్టంగా మారుతుంది. మరోవైపు కొందరూ బంతిని పట్టుకునేందుకు బకెట్ ఉపయోగించడం.. ఇలా మనం నిత్యం సోషల్ మీడియా (Social Media) లో చూస్తూనే ఉన్నాం. అవి క్షణాల్లోనే వైరల్ గా మారుతున్నాయి. తాజాగా గల్లీ క్రికెట్ కాకుండా యూరోపియన్ ఛాంపియన్ షిప్ లో గతంలో చోటు చేసుకున్న ఓ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Also Read : RCB: ఐపీఎల్ 2026 కోసం RCB భారీ ప్లాన్….జట్టులోకి తెలుగోడు… ఆ ఇద్దరు ఔట్ !

బ్యాటర్లకు ఈజీ.. ఎక్కడంటే.. అక్కడ..!


గతంలో యూరోపియన్ క్రికెట్ ఛాంపియన్ షిప్ లో ఫిన్ లాండ్ (Fin Land)  వర్సెస్ ఇంగ్లాండ్ XI  జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఏకంగా ఫిన్ లాండ్ జట్లు 8 మందిని స్లిప్ లో ఉంచి ఫీల్డింగ్ చేసింది. అప్పట్లో ఆ వార్త సంచలనంగా మారింది. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఉన్న 11 మందిలో 8 మంది స్లిప్ లో ఉంటే  బ్యాటర్ కొట్టడానికి చాలా ఈజీ కదా.. ఎక్కడంటే.. అక్కడ.. ఎలా అంటే అలా కొట్టుకోవచ్చు కదరా..? అంటూ సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరూ ఇదెక్కడి ఫీల్డింగ్ రా బాబు ఫీల్డర్లను ఇలా కూడా సెట్ చేస్తారా..? అని పేర్కొనడం గమనార్హం.  వాస్తవానికి టెస్ట్ క్రికెట్‌లో ఒకే మ్యాచ్‌లో అత్యధికంగా స్లిప్ ఫీల్డర్లను తీసుకున్న రికార్డు వెస్టిండీస్ పేరిట ఉంది. 1993లో భారత్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో వెస్టిండీస్(WI) జట్టు ఒకేసారి ఏడుగురు స్లిప్ ఫీల్డర్లను కలిగి ఉంది. 1999లో మొత్తం 9 మంది ఫీల్డర్లను స్లిప్ పొజిషన్‌లో ఉంచారు.

వన్డేలో 9 మంది స్లిప్ ఫీల్డర్లు.. 

1999 అక్టోబర్ 23న హరారేలో ఆస్ట్రేలియా(AUS) వర్సెస్ జింబాబ్వె  మధ్య జరిగిన ODI సిరీస్‌లో, సిరీస్‌లోని 2వ మ్యాచ్‌లో డామియన్ ఫ్లెమింగ్ 11వ నంబర్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ ముతేంద్రకు బౌలింగ్ చేయడంతో ఇది జరిగింది. అప్పుడు స్టీవ్ వా కెప్టెన్‌గా ఉన్నాడు. స్లిప్ రీజియన్‌లో 9 మంది ఫీల్డర్లను ఉంచడంలో స్టీవ్ వా చూపిన ధైర్యానికి హ్యాట్సాఫ్ అనే చెప్పాలి. వాస్తవానికి అది టెస్ట్ మ్యాచ్ కూడా కాదు. కానీ 9 మంది ఫీల్డర్లను ఉంచడం విశేషం. ఇక టెస్ట్ మ్యాచ్ లో మాత్రం  ఫిన్ లాండ్ జట్టు  ఏడుగురు ఫీల్డర్లను ఉంచిన వెస్టిండీస్ జట్టు రికార్డును బ్రేక్ చేసింది. వాస్తవానికి మ్యాచ్ పరిస్థితిని బట్టి స్లిప్ ఫీల్డర్ల సంఖ్య మార్చవచ్చు.  జట్లు తరచుగా బ్యాట్స్‌మన్ శైలి, ఆట పరిస్థితులకు అనుగుణంగా వారి ఫీల్డ్ ప్లేస్‌మెంట్‌లను సర్దుబాటు చేసుకుంటాయి. ఈ విషయాన్ని అందరూ గమనించాలి. ఈ జట్టు ఎంత మంది ఫీల్డర్ల ఎక్కడ సెట్ చేసినా ఆ జట్టు విజయం కోసమే అనే విషయాన్ని గమనంలో ఉంచుకోవాలి.

?igsh=bWEwMmF3OXNlN3lj

Related News

ODI WORLD CUP 2027 : కొంపముంచిన ఆఫ్ఘనిస్తాన్.. 2027 ప్రపంచ కప్ నుంచి ఇంగ్లాండ్ ఎలిమినేట్?

Team India Jersey : భారీగా పెరిగిన టీమిండియా జెర్సీ వ్యాల్యూ… ఒక్కో మ్యాచ్ కు ఎంత అంటే

Ashwin-Babar : పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ జట్టులోకి రవిచంద్రన్ అశ్విన్?

Yuvi – Msd : Ms ధోనికి యువరాజ్ అంటే వణుకు… అందుకే తొక్కేశాడు!

Hardik – Krunal : పాండ్యా బ్రదర్స్ గొప్ప మనసు.. చిన్ననాటి కోచ్ కోసం భారీ సాయం.. ఎన్ని లక్షలు అంటే

Chinnaswamy Stadium : బెంగళూరు అభిమానులకు బిగ్ షాక్.. చిన్న స్వామి స్టేడియం పై షాకింగ్ నిర్ణయం

Big Stories

×