OTT Movie : ఓటిటిలో ఎన్నో సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. అందులో కొన్ని సినిమాలు మాత్రమే మనసుకు హత్తుకుంటాయి. ఒక పేద కుటుంబం చిన్న చిన్న కోరికలను తీర్చుకోలేకపోతే ఎలా ఉంటుందో మనసుకు హత్తుకునేవిధంగా చూపించాడు దర్శకుడు. రైతు పడే కష్టాలు,ఫ్యామిలీ ఎదుర్కొనే సమస్యలతో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)
ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ పేరు “ఎరంబు” (Erumbu). ఇది ఒక తమిళ్ మూవీ. ఈ మూవీలో ఒక నిరుపేద కుటుంబం వ్యవసాయం చేసుకుంటూ తన పిల్లలకు కనీస అవసరాలు కూడా తీర్చలేని విధంగా ఉంటుంది. ఆ పిల్లలు ఈ మూవీలో పడ్డ కష్టాలతో మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ ప్రస్తుతం ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
ఒక ఊరిలో ఒక కుటుంబం వ్యవసాయం చేస్తూ ఉంటుంది. అయితే ఆ కుటుంబం ఒక పెద్ద మనిషి దగ్గర డబ్బులు అప్పుగా తీసుకొని ఉంటారు. అతడు వీళ్ళని అప్పు చెల్లించమని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఆ కుటుంబంలో అమృత ,సాత్విక్ అనే ఇద్దరు పిల్లలు ఉంటారు. తండ్రికి అన్ని కష్టాలు ఉన్నా సాత్విక్ కు ఒక ఉంగరం కొనిస్తాడు. అయితే ఒక రోజు సాత్విక్ ఆ ఉంగరం పోగొట్టుకుంటాడు. తండ్రి తిడతాడేమోనని ఏడుస్తున్న సాత్విక్ ను చూసి అక్క ఓదారుస్తుంది. తల్లిదండ్రులు పొలం కోయడానికి కొన్ని రోజులు పొలం వద్దే ఉంటారు. పిల్లలు మాత్రం ఉంగరం కొనడానికి డబ్బులు లేకపోవటంతో, బయట పనికి వెళ్తూ ఉంటారు. డబ్బులు జమాచేసిన తరువాత, ఒకరోజు బంగారం షాప్ కి వెళ్లి ఒక ఉంగరం కొనడానికి చూస్తారు. వయసు చిన్నదిగా ఉండటంతో వీళ్లకు ఆ షాప్ యజమాని ఉంగరం అమ్మడు. అయితే ఇంటికి వచ్చిన వీళ్ళకు బంగారం ధర మరింత పెరిగిందని రేడియోలో ఒక వార్త వింటారు.
ఆ తరువాత పిల్లలు మళ్లీ పనికి పోయి కొంత డబ్బులు సంపాదిస్తారు. వీళ్లు చిన్నపిల్లలు కావడంతో ఒక పెద్ద మనిషిని తోడుగా తీసుకోవాలని అనుకుంటారు. ఆ ఊరిలో మతిస్థిమితం లేని ఒక మనిషిని బంగారం షాప్ కి తీసుకువెళ్తారు. అక్కడ అతను పిచ్చిపిచ్చిగా చేయడంతో మళ్లీ వెనక్కి పంపిస్తారు. ఈ లోగా అప్పు తీర్చాలని ఆ పెద్ద మనిషి వీళ్ళతో గొడవ పెట్టుకుంటాడు. చివరికి వీళ్లు ఆ ఉంగరం కొనుక్కోగలిగారా? ఇంట్లో ఉంగరం పోయిన విషయం తల్లి, దండ్రులకు తెలుస్తుందా? తండ్రి చేసిన అప్పు తీర్చగలుగుతాడా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న “ఎరంబు” (Erumbu) అనే ఈ ఫ్యామిలీ డ్రామా మూవీని తప్పకుండా చూడండి. ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూడాలనుకొనే మూవీ లవర్స్ కి ఈ మూవీ ఒక బెస్ట్ ఆప్షన్.