Nindu Noorella Saavasam Serial Today Episode : మనోహరి కోపంగా తిడుతుంది ఆరు. మిస్సమ్మను తీసుకురాకుండా మనోహరే ప్రతి సారి అడ్డుపడుతుందని అసలు అలాంటి దాన్ని ఆ దేవుడు ఎందుకు శిక్షించడం లేదని బాధపడుతుంది. అయినా దేవుడే తప్పు చేస్తే ఇంకెవరికి చెప్పుకోవాలి. అంటూ యముణ్ని తిడుతుంది. నువ్వు పైన హ్యాపీగా ఉన్నావు. మమ్మల్ని మాత్రం ఇక్కడ కష్టాల పాలు చేస్తున్నావు అంటుంది. దీంతో గుప్త, ఆరును తిడతాడు. ఎందుకు ప్రభువుల వారిని తిడుతున్నావు అంటాడు. అయినా నువ్వు పిలిస్తే ఆయన వస్తారా? అంటుంటే.. మీరు ఉండండి గుప్త గారు అంటూ యముణ్ని పిలుస్తుంది.
ఇంతలో ఉరుములు మెరుపులతో యమధర్మరాజు వస్తాడు. ఏంటి విచిత్ర గుప్త ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతాడు. యముణ్ని చూసిన ఆరు చెట్టు చాటుకు వెళ్లి దాక్కుంటుంది. అయ్యో అనవసరంగా పిలిచాను. అయినా నేను పిలవగానే ఆయన అత్తారింటికి వచ్చినట్టు వచ్చేశాడు. నేను అన్న మాటలకు ఇప్పుడు నన్ను ఆయన పైకి తీసుకెళ్లరు కదా.? అంటూ తిరిగి చూస్తుంది యముడు, గుప్త కనిపించరు. అసలు ఎక్కడున్నారు.. కనిపించడం లేదు. అసలు ఆయన రాలేదా ఏంటి..? నేనే ఊహించుకున్నానా… ఏంటి..? అంటూ అటూ ఇటూ చూడగానే పక్కనే యముడు, గుప్త కనిపిస్తారు. దీతో షాక్ అయిన ఆరు.. కంగారులో రాజు గారు బాగున్నారా..? ఆరోగ్యం అంతా బాగుందా..? ఇంట్లో అందరూ బాగున్నారా..? అంటూ ఏదేదో మాట్లాడుతుంది.
అసలు నా మాటలు వింటున్నారా..? అని గుప్తను చిన్నగా అడుగుతుంది. మొత్తం విన్నారని గుప్త చెప్పగానే మరి ఏం మాట్లాడటం లేదు మీరే ఏదైనా మాట్లాడండి గుప్త గారు అంటుంది ఆరు. అరచి పిలిచినది నువ్వే కదా..? నువ్వే మాట్లాడు అని గుప్త చెప్పగానే నేనేదో సరదాగా పిలిచాను అలా పిక్నిక్ వచ్చినట్టు వచ్చేస్తే ఎలా..? అంటుంది ఆరు. దీంతో గుప్త కూడా ప్రభు ఆ బాలిక ఏదో మాట వరసకు పిలిచింది. ఒకవేళ మీరు అందులకే వచ్చితిరా.. అని అడగ్గానే నేను అందుకోసం రాలేదని నీ కర్తవ్యం నేను పూర్తి చేయడానికి వచ్చాను అని యముడు చెప్తాడు. దీంతో ఆరు జోక్ చేస్తున్నారు కదా..? నాకు సమ్మతం లేకుండా మీరు నన్ను పైకి తీసుకెళ్లలేరు అని నాకు గుప్తగారు చెప్పారు అనగానే అది గుప్తకు.. నాకు లేదు. అంటూ పైకి రమ్మని అడుగుతాడు. దీంతో ఆరు ఏడుస్తూ ఎమోషన్ అవుతుంది. యముణ్ని పొగడుతుంది. దీంతో యముడు, ఆరు మాటలకు ఉబ్బిపోయి ఆరు చెప్పినట్లే వింటాడు.
మిస్సమ్మను తీసుకురావడానికి వెళ్తున్న అమర్‌కు పిల్లలు ఎదురొస్తారు. అప్పుడే వచ్చారేంటని అడుగుతాడు అమర్. రోజు ఇదే టైం సార్ అని రాథోడ్ చెప్తాడు. దీంతో అమర్ పిల్లలను బయటకు వెళ్దాం రెడీ అయి రండి అని చెప్తాడు. బయటకు అంటే ఎక్కడికి డాడ్ అని పిల్లలు అడుగుతారు. పైనుంచి గమనిస్తున్న మనోహరి మాత్రం ఇరిటేటింగ్ గా అమర్ దాన్ని చాలా కష్టపడి ఇంట్లోంచి పంపిచాను. మళ్లీ నువ్వు తీసుకొస్తే ఎలా..? అని మనసులో అనుకుంటుంది. అమర్ మాత్రం పిల్లలకు మిస్సమ్మ వాళ్ల ఇంటికి వెళ్దామని నాన్నమ్మ తాతయ్య బాగా బాధపడుతున్నారు అని చెప్పగానే అమ్ము హ్యాపీగా ఫీలవుతుంది. అంజు, అనంద్, ఆకాష్ మాత్రం వద్దని మారాం చేస్తారు. అమ్ము మీరు చెప్పింది కరెక్టు డాడ్ మిస్సమ్మను తీసుకొద్దాం అంటుంది. ఇప్పుడే మేము ప్రెషప్ అయి వస్తాము అని లోపలికి వెళ్తారు.
గార్డెన్ లో ఉండి అంతా వింటున్న ఆరు హ్యాపీగా ఫీలవుతుంది. ఆనందంతో డాన్స్ చేస్తుంది. గుప్త వచ్చి ఆరును ఆపి ప్రభువు ఉన్నారు అని చెప్పగానే ఆరు హ్యాపీగా యముణ్ని చూసి రాజు గారు మీరు వచ్చారు మా ఆయన మనసు మారిపోయింది. నిజంగా మీది గోల్డెన్ లెగ్ అంటుంది. గుప్తను వెటకారంగా తిడుతుంది. మళ్లీ యముడు ఆరు మాటలకు పొంగిపోతాడు.
రూంలోకి వెళ్లిన పిల్లలు మీటింగ్ పెట్టుకుంటారు. అమ్ము మనమంతా ఒకే మాట మీద ఉందమనుకున్నాం కదా..? అంటుంది అంజు. అవును అక్కా మనం మిస్సమ్మను తీసుకురావడానిక వెళ్లడం ఏంటి..? అంటాడు ఆనంద్. ఆకాష్ కూడా అమ్మ ఫోటోను తొక్కింది. అమ్మ చీరను పాడు చేసింది అలాంటి మనిషితో మనకు పనేంటి..? అని అడుగుతాడు. దీంతో అమ్ము ఎందుకు మిస్సమ్మను తీసుకురాకూడదు. మిస్సమ్మ అమ్మ ఫోటో తొక్కడం మనం చూశామా..? చీరను మిస్సమ్మ పాడు చేసిందని మనకు తెలుసా…? అంటూ నిలదీస్తుంది.
దీంతో అంజు అమ్మ చీర కరెక్టునుగా కుట్టింది అని తనే చెప్పింది కదా.. అమ్ము అనగానే అది మిస్టేక్ అయ్యుండొచ్చు కదా అంజు. నువ్వు మిస్టేక్ చేస్తావు. నేను మిస్టేక్ చేస్తాను. కానీ మిస్సమ్మ మిస్టేక్ చేయకూడదా..? అంటూ కన్వీన్స్ చేయాలని చూస్తుంది. ఎవ్వరూ కూడా కన్వీన్స్ కాకపోయేసరికి అమ్ము నేను వెళ్తున్నాను. మీకు రావాలని ఉంటే రండి అని వెళ్లిపోతుంది. ఆనంద్, ఆకాష్ కూడా ఆలోచించి వెళ్దామని డిసైడ్ అవుతారు. అంజు మాత్రం నేను రాను అంటూ అలిగి వెళ్లిపోతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.