BigTV English

OTT Movie : డేటింగ్ యాప్ లో పాపను గుడ్డిగా నమ్మితే ఇదే గతి… ఫహద్ ఫాజిల్ క్రేజీ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : డేటింగ్ యాప్ లో పాపను గుడ్డిగా నమ్మితే ఇదే గతి… ఫహద్ ఫాజిల్ క్రేజీ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : మలయాళ ఇండస్ట్రీలో మమ్ముట్టి, మోహన్ లాల్ తర్వాత బాగా వినపడుతున్నపేరు ఫహాద్ ఫాజిల్. తన అద్భుతమైన నటనతో హావభావాలు పలికించడంలో వైవిధ్యమైన నటనతో పాన్ ఇండియా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పాన్ ఇండియా సూపర్ హిట్ ‘పుష్ప’ మూవీలో బన్వర్ లాల్ షెకావత్ పాత్రలో తన వైవిధ్యమైన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అవడంతో పాటు పాన్ ఇండియా స్టార్ గా కూడా బిజీ అయ్యాడు. తాజాగా ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించిన క్రైమ్ సస్పెన్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదొక డేటింగ్ యాప్ నేపథ్యంలో సాగే కథ. మరి ఈ ఇంట్రెస్టింగ్ మూవీ ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది ? స్టోరీ ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…


కథ విషయానికొస్తే..
యుక్త వయసు రాగానే అబ్బాయిలు తనకు నచ్చిన అమ్మాయి కోసం వెతకడం మొదలు పెడతారు. అలాగే అమ్మాయిలు కూడా అబ్బాయిలకు అట్రాక్ట్ అవుతారు. ఇక ఈ రోజుల్లో సోషల్ మీడియాలో అందులోనూ డేటింగ్ యాప్ ల ద్వారా అబ్బాయిలు అమ్మాయిలతో ఎక్కువ పరిచయాలు పెంచుకుంటున్నారు. అలా కొంతకాలం తరువాత ఆ పరిచయం స్నేహంగాను, ఇద్దరికీ నచ్చితే ప్రేమికులుగా కూడా మారుతున్నారు. అలాంటి ఒక డేటింగ్ యాప్ లో హీరో ఒక అమ్మాయితో పరిచయం పెంచుకుంటాడు. వీరు ప్రత్యక్షంగా ఒకరినొకరు చూసుకోరు. కానీ ప్రతిరోజూ వీడియో కాల్స్ లో మాట్లాడుకుంటూ ఉంటారు. హీరోకి ఆ అమ్మాయి గురించి వీడియో కాల్స్ లో మాట్లాడం తప్ప అసలేమీ తెలియదు. ఒకసారి తన తల్లికి హీరోయిన్ ను వీడియో కాల్ ద్వారా పరిచయం చేస్తాడు. హీరో తల్లికి తన మీద అనుమానం వచ్చి, హీరో కజిన్ తో తన గురించి తెలుసుకోమ్మని చెప్తుంది. ఆ కజిన్ పేరు కెవిన్. ఇతను సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్. ఒకరోజు సడన్ గా హీరోకి ఆ అమ్మాయి ఫోన్ చేసి తాను ప్రమాదంలో ఉన్నానని చెప్తుంది. దీంతో ఆమెను తీసుకొచ్చి హీరో తన దగ్గర ఉంచుకొని, రిలేషన్షిప్ కొనసాగిస్తాడు. ఒకరోజు హఠాత్తుగా ఆ అమ్మాయి కనిపించకుండా పోతుంది. అంతకంటే ముందు నేను చనిపోతున్నా అంటూ మెసేజ్ చేస్తుంది. ఈ పరిస్థితుల నుంచి హీరో ఎలా బయటపడ్డాడు? కెవిన్ వీరికి ఎలా సహాయం చేశాడు? చివరికి ఆ అమ్మాయి దొరికిందా? అనే విషయాలు తెలుసుకోవడానికి ఈ మూవీని తప్పకుండా చూడండి. ఈ మూవీ పేరు మరేమిటో కాదు ‘సి యు సూన్’.

మలయాళ ఇండస్ట్రీలో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ చాలానే వచ్చాయి. అయితే ఫహాద్ ఫాజిల్ నటించిన ఈ మూవీ కూడా మంచి థ్రిల్లర్ సినిమాల లిస్ట్ లో టాప్ ప్లేస్ లో ఉంటుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. సోషల్ మీడియా ద్వారా ఏర్పడిన ప్రేమ కథాంశంతో ఈ మూవీని తెరకెక్కించారు. ఇప్పుడున్న యూత్ ని బాగా ఆకట్టుకునే ఈ మూవీకి ఫహాద్ ఫాజిల్ నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఈ మూవీ ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.


Related News

Madharaasi OTT: మదరాసి ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది… ఎప్పుడంటే?

OTT Movie : ఊరికి దూరంగా విల్లా… యవ్వనాన్ని కాపాడుకోవడానికి మంత్రగత్తె అరాచకం… గుండె ధైర్యం ఉంటేనే చూడండి

OTT Movie : అమ్మాయంటే పడి చచ్చే సోఫా… అబ్బాయిలు చెయ్యేస్తే చావే… ఇదెక్కడి దిక్కుమాలిన చేతబడి భయ్యా ?

OTT Movie : అమ్మాయిని వదలకుండా… సొంత తండ్రి నుంచి అద్దెకిచ్చిన ఓనర్ దాకా… క్లైమాక్స్ కి పిచ్చోళ్ళయిపోతారు మావా

OTT Movie : భార్య ఉండగా పెళ్ళైన మాజీ గర్ల్ ఫ్రెండ్ తో సీక్రెట్ గా… పక్క అపార్ట్మెంట్లోకి మారి ఆమె చేసే పనికి దిమాక్ ఖరాబ్

OTT Movie : నవ్వుతూ చంపే మిస్టీరియస్ వ్యక్తి… డబ్బు కోసం వెళ్లి అడ్డంగా బుక్కయ్యే అమాయకుడు… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్

OTT Movie : HIV ఎక్కించి అమ్మాయిల్ని చంపే సైకో… ఇదెక్కడి దిక్కుమాలిన ఆలోచన సామీ ?

OTT Movie : ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో భార్య… మెంటల్ మాస్ షాక్ ఇచ్చే భర్త… వీడు మగాడ్రా బుజ్జి

Big Stories

×