EPAPER

OTT Movie : ట్రిప్ కు వెళ్దాం అనుకుంటున్నారా? ఈ మూవీని చూస్తే ఆ ఆలోచనకే వణికిపోతారు

OTT Movie : ట్రిప్ కు వెళ్దాం అనుకుంటున్నారా? ఈ మూవీని చూస్తే ఆ ఆలోచనకే వణికిపోతారు

OTT Movie : ఓటిటిలో హారర్ బో*ల్డ్ సినిమాలతో పాటు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు కూడా మంచి ఆదరణ దక్కుతోంది. ఈ నేపథ్యంలోనే తమకు నచ్చిన జానర్ లో సినిమాను చూడడానికి ప్రేక్షకులు ఏ మాత్రం వెనకాడట్లేదు భాష అనే బారియర్ ని ఎప్పుడో తీసిపారేశారు. తెలుగులో ఉంటే సరేసరి. లేదంటే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉన్నా చాలు సినిమాలను చూస్తున్నారు. ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ పక్కా సస్పెన్స్ థ్రిల్లర్. సాధారణంగా ట్రిప్ వెళ్లాలి అనుకునే వాళ్లు ఈ మూవీ చూశాక ఆ ఆలోచన వచ్చినా సరే వణికిపోతారు. మరి ఇంతటి భయంకరమైన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? స్టోరీ ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


థియేటర్లో రిలీజ్ అయిన మూడేళ్ల తర్వాత ఓటీటీ లోకి

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ మూవీ ఒక మలయాళం సూపర్ హిట్ మూవీ. అయితే ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన మూడేళ్ల తర్వాత ఓటిటిలోకి వచ్చేసింది. అది కూడా తమిళంలో మాత్రమే ఈ సినిమాను డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇందులో ‘పుష్ప’ విలన్ హీరోగా నటించగా, హీరోయిన్ దర్శనా రాజేంద్రన్ ఆయనతో పాటు స్క్రీన్ షేర్ చేసుకుంది. నసీఫ్ యూసఫ్ నవాజుద్దీన్ ఈ మూవీకి డైరెక్టర్ గా వ్యవహరించగా, పాపులర్ ఓటిటి ఆహా తమిళ్లోకి వచ్చేసింది. ‘ఇరుల్’ అనే టైటిల్ తో ఓటీటిలోకి అడుగు పెట్టిన ఈ మలయాళ మూవీ సెప్టెంబర్ 6 నుంచి తమిళంలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి తెలుగు వర్షన్ ను ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు.


కథలోకి వెళ్తే…

ఇందులో హీరో పేరు అలెక్స్. అతను ఒక రైటర్. ఈ అలెక్స్ తన గర్ల్ ఫ్రెండ్ అర్చనతో కలిసి ట్రిప్ ప్లాన్ చేస్తాడు. ఇద్దరు కలిసి ప్రయాణం మొదలు పెట్టగా కొంత దూరం ప్రయాణం చేశాక సినిమా లో ట్విస్ట్ మొదలవుతుంది. సడన్ గా అడవి మధ్యలో నడి రోడ్డుపై కారు ఆగిపోతుంది. చుట్టూ జనావాసాలు లేకపోవడంతో ఏం చేయాలో తోచక ఆలోచిస్తూ ఉంటారు. ఎవరైనా కన్పిస్తారేమో సహాయం కోరదాం అని వెతుకుతూ ఉండగా, ఆ కారు ఆగిపోయిన ప్లేస్ కి దగ్గర్లోనే ఓ ఇల్లు కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళగానే ఫహాద్ ఫాజిల్ తనను ఆ ఇంటి ఓనర్ గా చెప్పి పరిచయం చేసుకుంటాడు. ఆ తర్వాత ఈ కపుల్ కి ఊహించని భయంకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. అసలు ఫహాద్ ఫాజిల్ అక్కడ ఏం చేస్తున్నాడు? ఆ ఇంటికి అసలైన ఓనర్ ఎవరు? అక్కడి నుంచి ఈ కపుల్ తప్పించుకోగలిగారా లేదా? వాళ్ళకు అక్కడ ఎదురైన భయంకరమైన పరిస్థితులు ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఆహా తమిళ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ఇరుల్’ అనే ఈ సినిమాపై ఒక లుక్ వెయ్యండి. ముఖ్యంగా ఫహాద్ ఫాజిల్ అభిమానులు డోంట్ మిస్ .

Tags

Related News

OTT Movie : క్రేజీ మలయాళ మర్డర్ మిస్టరీ… ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో మైండ్ బ్లాక్ చేసే మూవీ

OTT Movie : ప్రేమ పేరుతో వల విసిరి అమ్మాయిల గొంతు కోసే సైకో కిల్లర్… పీడకల లాంటి సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : పాయల్ అసభ్యకర ఫోటోలు ఆ సైట్లో… ఈ క్రేజీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఏ ఓటిటిలో ఉందో తెలుసా?

OTT Movie : హెబ్బా పటేల్ రొమాంటిక్ మూవీ… Imdbలో అదిరిపోయే రేటింగ్

OTT Movie : లోన్ పేరుతో మోసం… మాఫియాకే చెమటలు పట్టించే ఒంటరి అమ్మాయి క్రేజీ కొరియన్ కథ

OTT Movie : ప్రేమించుకుంటున్నాం అని ఇంటికి వెళ్తే ఇంత అరాచకమా? సీను సీనుకో ట్విస్ట్ తో పిచ్చెక్కించే సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : బొమ్మలంటే ఇష్టమా? ఈ చెమటలు పట్టించే హర్రర్ మూవీని చూస్తే జన్మలో బొమ్మలు ముట్టుకోరు

Big Stories

×