BigTV English
Advertisement

Vinod Kambli’s Health: క్రిటికల్ గా టీమిండియా క్రికెటర్.. లేటెస్ట్ హెల్త్ బులిటెన్!

Vinod Kambli’s Health: క్రిటికల్ గా టీమిండియా క్రికెటర్.. లేటెస్ట్ హెల్త్ బులిటెన్!

Vinod Kambli’s Health: గత కొద్ది వారాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్యం మరింత క్షీణించడంతో శనివారం కుటుంబ సభ్యులు ఆయనని ఆసుపత్రిలో చేర్చారు. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న కాంబ్లీని {Vinod Kambli’s Health} శనివారం రాత్రి థానేలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు సోమవారం షాకింగ్ రిపోర్ట్ ఇచ్చారు. కాంబ్లీ మెదడులో రక్తం గడ్డకట్టినట్లు వైద్యులు నిర్ధారించారు.


Also Read: Virat Kohli: కోహ్లీకి వాళ్లతో పోలికా..? పాక్ మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు!

కాంబ్లీకి చికిత్స అందిస్తున్న డాక్టర్ వివేక్ త్రివేది మాట్లాడుతూ.. “మొదట కాంబ్లీ మూత్రణాల ఇన్ఫెక్షన్ మరియు తిమ్మిరితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరాడు. శనివారం బివాండి పట్టణంలోని కల్హేర్ ప్రాంతంలోని ఆసుపత్రిలో చేరారు. ఆ ఆసుపత్రిలో ఆయనను {Vinod Kambli’s Health} పర్యవేక్షిస్తున్న వైద్య బృందం వరుసగా నిర్వహించిన టెస్టుల్లో అతడి మెదడులో రక్తం గడ్డ కట్టినట్లు నిర్ధారించారు. అతని ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. మంగళవారం రోజు కూడా మరికొన్ని పరీక్షలు నిర్వహించాం.


కాంబ్లీకి {Vinod Kambli’s Health} జీవితాంతం ఉచిత చికిత్స అందించాలని ఆసుపత్రి ఇన్చార్జి ఎస్ సింగ్ నిర్ణయించుకున్నారు” అని కంబ్లీకి చికిత్స చేస్తున్న డాక్టర్ వివేక్ త్రివేది తెలిపారు. 52 ఏళ్ల కాంబ్లీ చాలాకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఇటీవల రమాకాంత్ ఆచ్రేకర్ స్మారక కార్యక్రమంలో తన చిన్ననాటి మిత్రుడు, లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ని కలుసుకున్నాడు కాంబ్లీ. ఈ ఈవెంట్ లో వీల్ చైర్ లో కూర్చుని కనిపించాడు. అయితే అతను నిలబడేందుకు కూడా ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే.

అప్పటినుండి క్రికెట్ అభిమానులు ఆయన {Vinod Kambli’s Health} ఆరోగ్యం పై ఆందోళన చెందుతున్నారు. వినోద్ కాంబ్లీ అనారోగ్యంపాలు కావడం ఇది మొదటిసారి కాదు. 1996 ప్రపంచ కప్ జట్టులో సభ్యుడైన వినోద్ కాంబ్లీ క్రికెట్ కెరీర్ కి రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత అనేక ఆరోగ్యపరమైన సమస్యలు, ఆర్థిక ఒడిదుడుకులతో బాధపడ్డాడు. దీంతో కపిల్ దేవ్ సారధ్యంలోని 1983 వరల్డ్ కప్ విజేత జట్టులోని సభ్యులు కాంబ్లీకి ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. కానీ కపిల్ దేవ్ ఓ షరతు విధించాడు.

Also Read: Champions Trophy 2025: టీమిండియా జట్టు ప్రకటన.. రంగంలోకి కొత్త ప్లేయర్లు?

కాంబ్లీ రిహబిలిటేషన్ సెంటర్ కి వెళితేనే సాయం చేస్తామన్నారు. దానికి అతడు {Vinod Kambli’s Health} కూడా అంగీకరించాడు. కానీ ఇంతలోనే మరోసారి తీవ్ర అనారోగ్యం బారిన పడి ఆసుపత్రిలో చేరికయ్యాడు. దీంతో అతను త్వరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రార్థిస్తున్నారు. వినోద్ కాంబ్లీ భారత్ తరపున అంతర్జాతీయ స్థాయిలో 17 టెస్టులు, 14 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 1084, వన్డేల్లో 2477 పరుగులు చేశాడు. భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ఒ ప్రత్యేక ముద్రను వేసుకున్న ఈ మాజీ ఆటగాడు త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.

Related News

RCB For Sale: RCB పేరు మార్పు, ఇక‌పై ZCB…బెంగ‌ళూరు జ‌ట్టుకు కొత్త ఓన‌ర్ ఎవ‌రంటే ?

IND VS SA: ద‌క్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్, షెడ్యూల్‌, బ‌లాబ‌లాలు ఇవే..ఉచితంగా ఎలా చూడాలంటే

Hong Kong Sixes 2025 : హార్దిక్ పాండ్యాను కాపీ కొట్టిన పాకిస్తాన్..ఛీ.. ఛీ ఎంతకు తెగించార్రా

IPL 2026: SRH జ‌ట్టులో ఫిక్సింగ్..అంబానీతో చేతులు క‌లిపి ద‌గా, కావ్యపాప స్కెచ్ చూడండి !

T20 World Cup 2026: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 షెడ్యూల్‌, వేదిక‌లు ఇవే…హైద‌రాబాద్, విశాఖ‌కు అన్యాయం ?

Cricket players : ఇప్ప‌టి క్రికెట‌ర్లు ఆ వైట్ క్రీమ్ ను ఎందుకు వాడ‌టం లేదో తెలుసా..?

IPL 2026-SSMB 29 : ఐపీఎల్ ఫ్యాన్స్ కు చిచ్చులు పెడుతున్న మహేష్-జక్కన్న, వేలం ఎప్పుడంటే?

Hong Kong Sixes 2025 Final: హాంకాంగ్‌ సిక్సెస్ 2025 విజేత‌గా పాకిస్తాన్..6వ సారి ట్రోఫీ, ప్రైజ్ మ‌నీ ఎంతంటే

Big Stories

×