OTT Movie : యూత్ ని బాగా ఎంటర్టైన్ చేయడంలో హాలీవుడ్ మూవీస్ ముందు వరుసలో ఉంటాయి. థియేటర్లలో మంచి విజయం సాధించిన ఒక యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో కొన్ని సీన్స్ మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించేవిధంగా ఉంటాయి. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.
నెట్ ఫ్లిక్స్ (Netflix)
ఒక యుద్ధంలో వెన్నెముకదెబ్బతిని, కుర్చీకే పరిమితమయ్యే తన భర్తతో భార్య ఎలా ముందుకు సాగిందనే స్టోరీ చుట్టూ ఈ మూవీ నడుస్తుంది. ఈ మూవీ పేరు “లేడీ చాటర్లీస్ లవర్“, (Lady Chatterley’s Lover). ఈ మూవీ ప్రస్తుతం ఓటిటి ప్లాట్ ఫామ్ “నెట్ ఫ్లిక్స్” (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
క్లిఫార్డ్, పొన్ని ఇద్దరూ భార్య భర్తలు గా ఉంటారు. క్లిఫార్డ్ ఆర్మీలో మేజర్ గా ఉంటూ ఒక యుద్ధంలో తన వెన్నెముకకు దెబ్బ తగలడంతో కుర్చీకే పరిమితం అవుతాడు. ఆ తర్వాత పొన్నీ అతనిని ఇంట్లో జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. అయితే క్లిఫార్డ్ స్టోరీలు రాసుకుంటూ తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. హీరోయిన్ వయసులో ఉండటంతో భర్త దగ్గరికి వెళ్తుంది. భర్త నేను ఇప్పుడు అందుకు పనికిరానని చెప్తాడు. దీంతో హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. భర్త నాకు వారసుడిగా ఎవరితోనైనా బిడ్డని కనమని చెప్తాడు. అది తప్పు కదా నీకు సమ్మతమేనా అని అడుగుతుంది. ఇది ఇలా ఉంటే ఆ ఇంట్లో ఒక వ్యక్తి పని చేయడానికి వస్తాడు. అతడు కూడా ఒకప్పుడు మిలటరీలో జాబ్ చేసి ఉంటాడు. అతనిని ఆమె భార్య వదిలేసి వేరొకరితో వెళ్లిపోయి ఉంటుంది. పొన్ని భర్తకు దూరంగా ఉండటంతో పనివాడు అందంగా ఉండటంవలన అతన్ని ఇస్ట పడుతుంది.
అలా వాళ్ళిద్దరూ ఒకరినొకరు మాట్లాడుకుంటూ, అతనితో రోజూ ఏకాంతంగా గడిపే వరకు వెళుతుంది. ఈ విషయం హీరోయిన్ చెల్లెలుకు తెలిసి, పని వాడితో ఎందుకు ప్రేమలో పడ్డావు అని అంటుంది. ఆ తరువాత ఆమె బాధను అర్థం చేసుకున్న చెల్లెలు సైలెంట్ గా ఉంటుంది. పని వాడితో సంబంధం ఆమె ప్రెగ్నెంట్ అయ్యే వరకు వెళ్తుంది. నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ అని తన చెల్లెలుకు చెప్తుంది. ఆ ఇంట్లో అందరూ భర్తకు పిల్లలు పుట్టరని తెలిసి ఎలా ప్రెగ్నెంట్ అయిందని అనుకుంటూ ఉంటారు. ఈ విషయం హీరోయిన్ తల్లిదండ్రులకు తెలుస్తుంది. ఆ తల్లిదండ్రులు వీరి ప్రేమను అంగీకరిస్తారా? చివరికి హీరోయిన్ ఆ బిడ్డకి జన్మనిస్తుంది? ఆ పని వాడిని పెళ్లి చేసుకుంటుందా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ “లేడీ చాటర్లీస్ లవర్”, (Lady Chatterley’s Lover) ని తప్పకుండా చూడండి. ఈ మూవీలో ఆ సన్నివేశాలు ఉండటంతో మూవీ లవర్స్ ఈ మూవీని ఒంటరిగా చూడటమే మంచిది.