OTT Movie : అడ్వెంచర్ మూవీస్, మూవీ లవర్స్ ను ఏ విధంగా ఎంటర్టైన్ చేస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ హాలీవుడ్ అడ్వెంచర్ మూవీస్ అంటే చెవి కోసుకొని మూవీ లవర్స్ చాలామంది ఉన్నారు. ఒక డిఫరెంట్ కథ తో వచ్చిన హాలీవుడ్ అడ్వెంచర్ మూవీ ప్రస్తుతం డిజిటల్ ప్లాట్ ఫామ్ లో హల్చల్ చేస్తోంది. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో
ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ పేరు “ది లాబ్స్టర్ ” (The Lobster). ఆ ఊరిలో ఎవరైనా సింగల్ గా ఉంటే వాళ్లను జంతువులుగా మార్చేస్తారు. సింగిల్ గా ఉన్న వాళ్లకి 45 రోజులు గడువు ఇస్తారు. ఈలోగా వాళ్ళ పార్టనర్ ని వెతుక్కోవాలి. వెతుక్కోకపోతే అంతే సంగతులు. ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు మూవీ లవర్స్ ను బాగా ఎంటర్టైన్ చేస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
మానవ సమాజానికి దూరంగా ఉండే ఒక ఊరిలో సింగిల్ గా ఎవరైనా ఉంటే వాళ్లను జంతువులుగా మార్చేస్తుంటారు. ఈ క్రమంలో డేవిడ్ అనే వ్యక్తి నుంచి ఆమె భార్య విడిపోయి ఉంటుంది. అతను పార్ట్నర్ ను వెతుక్కునే పనిలో ఉంటాడు. ఈ క్రమంలో సింగిల్ గా ఉన్న చాలామంది ఊరి పెద్ద దగ్గరికి వస్తారు. వీళ్ళకు 45 రోజులు గడువు ఇస్తూ ఆ ఊరి పెద్ద వెళ్ళిపోతాడు. ఎవరిని పడితే వాళ్లని పార్టనర్ గా ఎంచుకునేకి వీలుండదు. ఎదుటి వాళ్లలో కూడా తనకు ఉండే లక్షణాలు ఉండాలి. అలా పార్ట్నర్ ని ఎంచుకునే క్రమంలో ఇద్దరమ్మాయిలు ఇతనిని రిజెక్ట్ చేస్తారు. రోజులు దగ్గర పడుతుండటంతో డేవిడ్ భయపడుతుంటాడు. ఎందుకంటే అలా పెళ్లి చేసుకోనుందుకే తన అన్నని కుక్కగా మార్చేసి ఉంటారు. ఈ క్రమంలో ఏంజలీనా అనే అమ్మాయి డేవిడ్ కి ఎదురు పడుతుంది.
ఆమెకు ఏ ఫీలింగ్స్ ఉండవు. నాకు కూడా ఏం ఫీలింగ్స్ ఉండవు అని అబద్దం చెప్పి, ఆమెను పెళ్లి చేసుకుంటాడు. అతని మీద అనుమానం వచ్చి ఏంజలీనా ఒక పరీక్ష పెడుతుంది. కుక్క రూపంలో ఉన్న డేవిడ్ అన్నని చంపేస్తుంది. అప్పుడు డేవిడ్ తన అన్న చనిపోయినందుకు ఏడుస్తాడు. నీకు ఫీలింగ్స్ ఉన్నాయని, ఈ విషయం ఊరి పెద్దకి చెప్తానని బయలుదేరుతుంది. ఈలోగా డేవిడ్ ఆ ఊరి నుంచి పారిపోయి అడవిలో దాక్కుంటాడు. అక్కడ ఇతనిలాగే పారిపోయిన వ్యక్తులు చాలా మంది ఉంటారు. వాళ్లు దొరికితే ఆ ఊరి పెద్ద చంపేస్తూ ఉంటాడు. చివరికి డేవిడ్ పెళ్లి చేసుకుంటాడా సింగిల్ గానే తన జీవితాన్ని అడవిలో గడిపేస్తాడా? ఆ ఊరి పెద్ద చేతిలో జంతువుగా మారిపోతాడా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ హాలీవుడ్ అడ్వెంచర్ మూవీని తప్పకుండా చూడండి.