OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లో వచ్చే సినిమాలలో రొమాంటిక్ సినిమాలకు ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. ఈ సినిమాలలో లవ్ తో పాటు, రొమాన్స్ సీన్స్ ఎక్కువగా ఉండటంతో యూత్ని బాగా ఎంటర్టైన్ చేస్తాయి. అందులోనూ హాలీవుడ్ సినిమాలలో మసాలా కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది. యూత్ ని ఎంటర్టైన్ చేసే అటువంటి మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో
ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ పేరు ‘మ్యాచ్ పాయింట్‘ (Match point). ఈ మూవీలో హీరో పెళ్లి తర్వాత మరొక అమ్మాయితో రిలేషన్ లో ఉంటాడు. హీరో ఆ అమ్మాయిని మెయింటైన్ చేయడంలో అనేక సమస్యలన ఎదుర్కోవాల్సి వస్తుంది. చివరికి అతను ఈ సమస్య నుంచి ఎలా బయటపడ్డాడనే స్టోరీ నుంచి మూవీ నడుస్తుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
క్రిష్ ఒక టెన్నిస్ ప్లేయర్ గా లైఫ్ ని ప్రారంభిస్తాడు. అతనికి పెద్దగా అవకాశాలు రాకపోవడంతో కోచ్ గా మారుతాడు. ఇతని దగ్గర టామ్ అనే వ్యక్తి ట్రైనింగ్ తీసుకుంటాడు. టామ్ ఒక రిచ్ పర్సన్. ఇతనికి లూయి అనే చెల్లెలు కూడా ఉంటుంది. ఒకసారి టామ్ తన ఇంటి దగ్గర జరిగే ఫంక్షన్ కి క్రిష్ ను ఆహ్వానిస్తాడు. ఆ పార్టీకి వచ్చిన క్రిష్ ను చూసి లూయి అట్రాక్ట్ అవుతుంది. అక్కడే టామ్ గర్ల్ ఫ్రెండ్ నోలా క్రిష్ కి పరిచయం అవుతుంది. ఆమె అందానికి క్రిష్ మైమర్చిపోతాడు. క్రిష్ కి ఫైనాన్స్ ప్రాబ్లం ఉండటంతో, లూయి వీళ్ళ కంపెనీలో ఒక ఉద్యోగం ఇప్పిస్తుంది. ఒకసారి అనుకోకుండా నోలాతో ఏకాంతంగా గడుపుతాడు. చేసిన పనికి గిల్టీగా ఫీల్ అవుతుంది నోలా. ఇంకెప్పుడు ఇలా చేయొద్దని అతనితో అంటుంది. ఆ తర్వాత క్రిష్, టామ్ సిస్టర్ లూయిని పెళ్లి చేసుకుంటాడు. కొన్ని కారణాలవల్ల టామ్, నోలా విడిపోతారు. వీరి లైఫ్ ఇలా సాగుతున్న క్రమంలో కొద్దిరోజుల తర్వాత నోలా, క్రిష్ కి కనపడుతుంది. క్రిష్ ఆమె నెంబర్ తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అలా నోలాతో ప్రతిరోజు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. లూయికి విడాకులు ఇచ్చి, నిన్ను పెళ్లి చేసుకుంటానంటూ చెప్పి ఆమెతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు క్రిష్.
లూయికి విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా ఉండడు క్రిష్. ఈ క్రమంలో నోలాని దూరం పెడుతూ వస్తాడు. ఈసారి నోలా ప్రెగ్నెంట్ అవుతుంది. క్రిష్ భార్యకు కోవిడాకులు ఇవ్వకుండా మోసం చేస్తున్నాడని గ్రహిస్తుంది. అందరి ముందు ఈ విషయం చెప్పి పరువు తీస్తానని బెదిరిస్తుంది. క్రిష్ ఒక నిర్ణయానికి వచ్చి, తన దగ్గర ఉన్న గన్ తీసుకొని మొదట నాలా పక్కింట్లో ఉన్న ఒక ముసలామెను చంపేస్తాడు. ఆ తర్వాత నోలాని కూడా గన్ తో షూట్ చేసి చంపేస్తాడు. దోపిడీ దొంగలు ఈ హత్యలు చేసినట్టు క్రియేట్ చేస్తాడు. ఆ ఇంట్లో ఉన్న నగలను తీసుకొని ఒక చెరువులో పడేస్తాడు. ఈ క్రమంలో ఒక రింగ్ అక్కడ పడిపోతుంది. చివరికి పోలీసులు క్రిష్ ని పట్టుకుంటారా? ఈ విషయం లూయీ కి తెలుస్తుందా? కింద పడిపోయిన రింగ్ వల్ల ఏమైనా సమస్యలు వస్తాయా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని చూడాల్సిందే.