BigTV English
Advertisement

OTT Movie : కజిన్ పై మనసు పడే అమ్మాయి… తప్పని తెలిసినా అదే పని

OTT Movie : కజిన్ పై మనసు పడే అమ్మాయి… తప్పని తెలిసినా అదే పని

OTT Movie : థియేటర్లలో రిలీజ్ అయిన మూవీస్ కొంతకాలానికి ఓటిటి ప్లాట్ ఫామ్ లోకి వస్తున్నాయి. అలాగే డైరెక్ట్ గా కూడా ఓటిటి లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్.. ఏ భాషలోనైనా మూవీస్ చూసుకునే వెసులుబాటును ఓటిటి ప్లాట్ ఫామ్స్ కల్పిస్తున్నాయి. అందులోనూ హాలీవుడ్ మూవీస్ ను ప్రేక్షకులు ఎక్కువగా వీక్షిస్తున్నారు. బో*ల్డ్ రొమాంటిక్ మూవీస్ కు మంచి ఆదరణ ఉంటోంది. ప్రస్తుతం ఒక విచిత్రమైన లవ్ స్టోరీ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ కథ ఏమిటో, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.


ప్రైమ్ వీడియోలో.. 

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న ఈ మూవీ పేరు ‘మై ఫాల్ట్’ (My Fault). ఈ మూవీ 2023లో రిలీజ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకుంది. హీరో తన కజిన్ తో ప్రేమలో పడే విచిత్రమైన లవ్ స్టోరీ కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు హాలీవుడ్ మేకర్స్. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే.. 

ఈ చిత్రంలో హీరోయిన్ నోహా తన తల్లి రాటెల్లా తో కలసి ఆమె రెండవ భర్త అయిన విలియమ్స్ దగ్గరికి వెళుతుంది. ఆ ఇంట్లో విలియమ్స్ కి నిక్ అనే ఒక కొడుకు ఉంటాడు. నోహా చాలా అందంగా ఉండటంతో మొదటి చూపులోనే నోహాకి తన కజిన్ నిక్ పడిపోతాడు. ఈ విషయం బయటపడకుండా మేనేజ్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు నిక్ బయటికి వెళ్తుండగా నోహాని కూడా తీసుకొని వెళ్ళమని తన తండ్రి విలియమ్స్ చెప్తాడు. వీరిద్దరూ కలసి బయటికి వెళ్తారు. రోని అనే ఒక గ్యాంగ్ స్టర్ ఇచ్చే పార్టీకి వీరిద్దరూ వెళ్తారు. అక్కడ జరిగే కార్ రేస్ లో గ్యాంగ్ స్టర్ ని హీరో ఓడిస్తాడు. ఆ తరువాత తనతో రేసులో పాల్గొనాలని నోహాని రెచ్చగొడతాడు ఆ గ్యాంగ్ స్టర్. నోహా చేతిలో కూడా గ్యాంగ్ స్టార్ ఓడిపోవటమే కాకుండా గ్యాంగ్ స్టార్ కి హీరోకి గొడవ కూడా జరుగుతుంది. హీరోయిన్ మీద కక్ష పెంచుకుంటాడు గ్యాంగ్ స్టర్.

నోహా మాజీ బాయ్ ఫ్రెండ్ ని నిక్ ఇంటికి తీసుకొని వస్తుందినోహా తల్లి. నిక్ కి ఈ విషయం అసలు నచ్చదు. మరోవైపు తప్పని తెలిసినా ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడుతూ ఉంటారు. వీరు వెకేషన్ కి బయటకి వెళ్లి ఒకరికితో ఒకరు ఇంటిమేట్ అవుతారు. ఆ తర్వాత నోహ అసలు తండ్రి జైలు నుండి రిలీజ్ అయ్యి బయటకి వస్తాడు. అతనిని జైల్లో పెట్టించింది ఎవరో కాదు నోహ తల్లి. అతడు వీరిని ఫాలో అవుతూ వుంటాడు. చివరికి నోహా, నిక్ ల ప్రేమ ఏమవుతుంది? గ్యాంగ్స్టర్ తన ప్రతీకారాన్ని తీర్చుకున్నాడా? జైలు నుంచి బయటకు వచ్చిన నోహా తండ్రి వీరిని ఏమి చేశాడు? అనే విషయాలు తెలియాలంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ‘మై ఫాల్ట్‘ (My Fault) మూవీని చూడండి. ఈ లవ్ స్టోరీ విచిత్రంగా ఉన్నా స్టోరీ సాగే తీరు చాలా సరదాగా ఉంటుంది. బెస్ట్ రొమాంటిక్ మూవీగా హీరో హీరోయిన్ల నటనకు మంచి మార్కులు పడ్డాయి. మరైతే ఆలస్యం ఎందుకు హాలీవుడ్ మూవీ లవర్స్ ఈ సినిమాపై ఓ లుక్కు వేయండి.

Related News

OTT Movie : అమ్మాయిల డర్టీ స్కామ్… ఆటగాళ్లే వీళ్ళ టార్గెట్… అన్నీ అవే సీన్లు మావా

OTT Movie : పక్షవాతం వచ్చినోడితో ప్రేమాయణం… గుండెను పిండేసే ప్రేమకథ… లవర్స్ డోంట్ మిస్

OTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథOTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథ

OTT Movie : పనోడి కొడుకుతో ఆ పాడు పని… అక్క లైఫ్ లో అగ్గిరాజేసే చెల్లి… క్లైమాక్స్ లో ఫ్యూజులు ఎగిరిపోయే ట్విస్ట్

OTT Movie : 100 డాలర్స్ తో అన్నోన్ సిటీలో వదిలేస్తే… బుర్రబద్దలయ్యే షాక్… రిచ్ అవ్వాలనుకునే ప్రతి ఒక్కరూ చూడాల్సిన సిరీస్

OTT Movie : అన్న కోసం అరణ్యంలో వేట… కట్ చేస్తే వెన్నులో వణుకు పుట్టించే ట్విస్ట్… కల్లోనూ వెంటాడే హారర్ సీన్స్

OTT Movie : ఒకరిని లవ్ చేసి మరొకరితో రాసలీలలు… క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్… ప్యూర్ గా పెద్దలకు మాత్రమే

OTT Movie : వరుస హత్యలు…మిస్సైన అమ్మాయిని చంపడానికి జైలు నుంచి ఎస్కేపయ్యే సైకో… ఈమె డెడికేషన్ కో దండం సామీ

Big Stories

×