OTT Movie : ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీలకు ఉన్న ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రేమ గుడ్డిది అనే పదం ఎలా వచ్చిందో ఈ మూవీని చూస్తే తెలుస్తుంది. ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? పేరు ఏమిటో? తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో
వయసుతో సంబంధం లేకుండా ఒక వ్యక్తిని ఒక అమ్మాయి ఇష్టపడటంతో ఈ మూవీ స్టోరీ నడుస్తుంది. ఇది ఒక యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ. ఈ మూవీ పేరు “వన్ వైల్డ్ మూమెంట్” (One wild moment). ప్రస్తుతం ఈ మూవీ ఓటిటి ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
ఏంటోని, లోరెంట్ ఇద్దరూ మంచి స్నేహితులు. ఏంటోనికి లూన అనే ఒక కూతురు ఉంటుంది. ఈ అమ్మాయిని అతని తండ్రి చాలా స్ట్రిక్ట్ గా పెంచుతాడు. లోరెంటికి మ్యారి అనే కూతురు ఉంటుంది. ఇతను ఆ అమ్మాయిని ఫ్రీడమ్ ఇస్తూ పెంచుతాడు. ఈ స్నేహితులిద్దరికీ భార్యలు ఉండరు. అయితే వీళ్లంతా వెకేషన్ కి ఒక చోటికి వెళ్తారు. అక్కడ ఒక కొండ ప్రాంతం ఎక్కుతూ ఉంటే లోరెంట్, లూన ను జాగ్రత్తగా ఎక్కిపిస్తాడు. ఆ కేరింగ్ కి లూన అతనిని ఇష్టపడుతుంది. ఒకరోజు లూన, మేరీ పార్టీకి వెళ్లి బాగా తాగి ఇంటికి వస్తారు. లూన, లోరెంట్ తో సరదాగా స్విమ్మింగ్ చేస్తూ అతనిని రెచ్చగొడుతూ ఉంటుంది. అక్కడినుంచి ఇంటికి వచ్చిన లోరెంట్ ని మళ్ళీ రెచ్చగొట్టి ఏకాంతంగా గడుపుతుంది. ఆ తర్వాత లూనతో లోరెంట్ మనం ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్తాడు. మీ నాన్న నాకు మంచి స్నేహితుడు, అతనికి ఈ విషయం తెలిస్తే చాలా బాధపడతాడని చెప్పి ఆమెను దూరం పెడతాడు. అందుకు లూన బాధపడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉండగా, ఈ విషయాన్ని అతని కూతురు మేరీ పసిగడుతుంది.
ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని గ్రహించి, అప్పటినుంచి తన తండ్రి మీద కోపం పెంచుకుంటుంది. ఆ రోజు లూన బాధపడుతూ ఉండగా ఆమె తండ్రి ఆంటోనీ ఎందుకు బాధపడుతున్నావని అడుగుతాడు. నేను ఒక అతనిని ప్రేమిస్తున్నాను అతడు నన్ను ప్రేమించట్లేదు అని చెప్తుంది. ఇంతకీ అతని వయసెంత ఉంటుంది అని అడగ్గా, దాదాపు 50 సంవత్సరాలు అని చెబుతుంది. అందుకు ఆమె మీద అంటోనీ కోపగించుకొని ఇక అతనితో మాట్లాడకు అని చెప్తాడు. చివరికి ఏంటోని తన కూతురు ఎవరిని ప్రేమిస్తుందో కనుక్కుంటాడా? వీరిద్దరి ప్రేమ ఏమవుతుంది? ఈ విషయం తెలిసిన లోరెంట్ కూతురు ఏం చేస్తుంది? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న “వన్ వైల్డ్ మూమెంట్” (One wild moment) మూవీని తప్పకుండా చూడండి.