Bollywood Heroine : బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. బాలీవుడ్ లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఉన్న ఈ అమ్మడు తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చింది. పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన సాహో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ సినిమా భారీ యాక్షన్ మూవీగా వచ్చింది. భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. కానీ పాపకు మంచి మార్కులు పడ్డాయి. ఇక తెలుగులో తర్వాత సినిమాలు చెయ్యలేదు. కానీ బాలీవుడ్ లో బిజీ అయ్యింది. ఇక స్త్రీ 2 సినిమాతో రీసెంట్ గా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ బ్యూటీని అల్లు అర్జున్ సినిమాలో కనిపిస్తుందని గత కొద్ది రోజుల క్రితం వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ ఆమె అల్లు అర్జున్ తో నటించడానికి నో చెప్పింది. ఆమె నిర్ణయంతో అల్లు అర్జున్ పరువు పోయిందని బన్నీ ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. తాజాగా ఈమె చేసిన పనికి బన్నీ ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.
‘పుష్ప 2’ మూవీలో బాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ శ్రద్ధా కపూర్‌తో ఐటెం సాంగ్ చేయించాలని అనుకున్నారు సుకుమార్ అండ్ కో.. అయితే ‘పుష్ప 2’ మూవీలో 4 నిమిషాల ఐటెం సాంగ్ చేసేందుకు శ్రద్ధా కపూర్ రూ.10 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందని టాక్. అదీకాకుండా డేట్స్ అడ్జెస్ట్ చేయడం కూడా కష్టం కావడంతో శ్రద్ధా కపూర్‌ని సైడ్ చేసి, టాలీవుడ్ డ్యాన్సింగ్ సెన్సేషన్ శ్రీలీలను ఫిక్స్ చేసినట్లు తెలిసిందే.. అయితే అల్లు అర్జున్ సినిమాకు నో చెప్పిన ఈ అమ్మడు కొద్ది రోజుల్లోనే తెలుగులోని మరో హీరోకు ఒకే చెప్పిందని తెలుస్తుంది. ఈ విషయం విన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆమె పై సీరియస్ అవుతున్నారు. మా హీరో పరువును తీసేసావు అని కామెంట్స్ చేస్తున్నారు.
అసలు ఏమైందంటే.. ‘స్త్రీ 2’ సినిమాతో రూ.650 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టి, బాలీవుడ్ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన శ్రద్ధా కపూర్, ఎన్టీఆర్‌తో ఐటెం సాంగ్ చేసేందుకు సైన్ చేసిందని టాక్. ‘దేవర’ మూవీతో సూపర్ హిట్ కొట్టిన ఎన్టీఆర్, ప్రస్తుతం ఆయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లో ‘వార్ 2’ మూవీలో నటిస్తున్నాడు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ‘వార్ 2’ మూవీలో శ్రద్ధా కపూర్ ఓ స్పెషల్ సాంగ్ చేయబోతుందట. ఇదే వార్త పై బన్నీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మరి దీనిపై శ్రద్దా కపూర్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి..
ఇక వార్ 2 విషయానికొస్తే.. రూ.250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘వార్ 2’ మూవీని 2025, ఆగస్టు 14న రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు చిత్ర యూనిట్. నవంబర్‌లో ఈ మూవీ షూటింగ్‌ని పూర్తి చేసే ఎన్టీఆర్, డిసెంబర్ నుంచి దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో చేయబోయే సినిమా షూటింగ్‌లో పాల్గొంటాడు. ఈ మూవీని 2026 జనవరి 9న రిలీజ్ చేస్తామంటూ ప్రకటించిన విషయం తెలిసిందే.. ఈ సినిమాలో కన్నడ ముద్దుగుమ్మ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలోనే ఈ మూవీ పై అధికారక ప్రకటన రాబోతుంది.