BigTV English

OTT Movie : నడి సముద్రంలో బర్త్ డే పార్టీ… సడెన్ గా సముద్రంలో నీళ్ళు ఇంకిపోతే?

OTT Movie : నడి సముద్రంలో బర్త్ డే పార్టీ… సడెన్ గా సముద్రంలో నీళ్ళు ఇంకిపోతే?

OTT Movie : హాలీవుడ్ అడ్వెంచర్ మూవీస్ ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో చాలానే స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ అడ్వెంచర్ మూవీస్ లో అనుకోకుండా జరిగే కొన్ని సంఘటనలు మనల్ని ఎంతగానో టెన్షన్ పెడుతూ వుంటాయి. ఒక్కోసారి కొన్ని సీన్స్ చూస్తుంటే టెన్షన్ పుట్టాడమే కాదు వెన్నులో వణుకు పుడుతుంది. అలాగే నడి సముద్రంలో ఉండగా, ఒక్కసారిగా ప్రళయం వస్తే ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం ఊహించుకోలేం. కానీ అదే సముద్రం ఇంకిపోతే ? ఊహించుకోవడానికే భయంకరంగా ఉంది కదా. అటువంటి కంటెంట్ తో థియేటర్లలో ఒక మూవీని రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదివరకే ఇలాంటి కంటెంట్ తో వచ్చిన ‘2012 యుగాంతం’ మూవీ ఎంత విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇదే తరహాలో అడ్వెంచర్ సన్నివేశాలతో ఆసక్తికరంగా వుంటుంది ఈ మూవీ. ఈ మూవీ పేరేమిటి ? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.


సముద్రంలో పుట్టినరోజు వేడుకలు 

ఈ మూవీలో సముద్రంలోకి పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడానికి వెళ్లిన ఒక కుటుంబం ప్రళయంలో చిక్కుకోవడం తో స్టోరీ రన్ అవుతుంది. ఈ మూవీ పేరు “సర్వైవ్” (survive). ఈ మూవీ ప్రస్తుతం ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో(amazon prime video) స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీ లోకి వెళితే

జూలియా టామ్ అనే జంటకు బెన్, క్యాషీ అనే ఇద్దరు పిల్లలు ఉంటారు. ఒకరోజు హీరో హీరోయిన్ తమ కుమారుడైన బెన్ పుట్టినరోజు రావడంతో సముద్రంలో సెలబ్రేట్ చేయడానికి ప్లాన్ చేస్తారు. ఇదే క్రమంలో వీళ్ళు ఆ వేడుకని సెలబ్రేట్ చేయడానికి నడి సముద్రం వరకు బోటులో వెళ్తారు. అక్కడ బర్త్ డే వేడుకని చేయడానికి సిద్ధపడుతుండగా, కేషీ కి ఆమె లవర్ ఫోన్ చేసి సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి అని వీడియో కాల్ లో అడుగుతాడు. ఈలోగా తన బాయ్ ఫ్రెండ్ ఉన్నచోట ఆకాశంలో నుంచి మెరుపులు రావడంతో సిగ్నల్స్ ఆగిపోయి ఫోన్ కట్ అవుతుంది. అలాగే వీరు ఉన్నచోట హఠాత్తుగా సముద్రంలో నీళ్లు ఇంకిపోతాయి.

అనుకోని ఈ సంఘటనతో ఈ కుటుంబం భయభ్రాంతులకు గురి అవుతుంది. ఆ నీళ్లు లేని సముద్రంలో వీరు ఒక సైకో కిల్లర్ చేతికి దొరుకుతారు. ఆ తర్వాత ఈ కుటుంబం ఈ ప్రళయం నుంచి బయట పడగలుగుతుందా? ఆ సైకో కిల్లర్ బారి నుంచి ఈ ఫ్యామిలీ ఎలా తప్పించుకుంది? చివరికి ఆ సముద్రంలో నీళ్లు వస్తాయా? అసలు ఆ సైకో కిల్లర్ అక్కడికి ఎలా వచ్చాడు ? అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ ‘సర్వైవ్‘ (survive) మూవీని మిస్ అవ్వకుండా చూడండి. ముఖ్యంగా సై-ఫై, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారు ఇంకా ఈ సినిమాను చూడకపోతే ఈ వీకెండ్ డోంట్ మిస్. మంచి కిక్ ఇచ్చే థ్రిల్లర్ మూవీ ఇది.

Related News

OTT Movie : బాడీ బిల్డర్ తో ఆ పాడు పని… ఈ నలుగురు ఆడవాళ్ళూ అరాచకం మావా… సింగిల్ గా చూడాల్సిన మూవీ

OTT Movie : రియల్ కల్ట్ క్రైమ్‌… మతం పేరుతో మతిపోగోట్టే పనులు… మర్డర్ మిస్టరీతో ఊహించని టర్న్

OTT Movie : గ్యాంగ్ స్టర్ గా సిల్వెస్టర్ స్టాలోన్… అల్టిమేట్ యాక్షన్ సీన్స్… యాక్షన్ ప్రియులకు పంగడే

OTT Movie : సూపర్ హీరోల బిడ్డను బలికోరే బ్రహ్మ రాక్షసి… కడుపులో ఉండగానే బీభత్సం… క్లైమాక్స్ డోంట్ మిస్

Sundarakanda OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన నారా రోహిత్‌ ‘సుందరకాండ’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!

OTT Movie : పెంచిన పెదనాన్న ఇంటిని తగలబెట్టే లేడీ కిలాడీ… అమ్మాయి కాదు మావా ఆడపులి… పిచ్చెక్కించే ట్విస్టులు

OTT Movie : మరో వ్యక్తితో భర్త దగ్గర అడ్డంగా దొరికిపోయే భార్య… అతనిచ్చే ట్విస్టుకు దిమాక్ కరాబ్ మావా

OTT Movie : కంటికి కన్పించిన అమ్మాయిని వదలకుండా అదే పాడు పని… ఈ సైకో ఇంత కరువులో ఉన్నాడేంటి భయ్యా ?

Big Stories

×