BigTV English

Train Ticket Booking: జస్ట్ 25% పేమెంట్ తో ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు! ఎలాగో తెలుసా?

Train Ticket Booking: జస్ట్ 25% పేమెంట్ తో ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు! ఎలాగో తెలుసా?

Indian Railways: సాధారణంగా రైలు ప్రయాణం చేయాలనుకునే వాళ్లు ముందుస్తుగా టికెట్లు బుక్ చేసుకుంటారు. రకరకాల యాప్స్ ద్వారా టికెట్లు తీసుకుంటారు. అయితే, టికెట్ కొనుగోలు కోసం పూర్తి అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ టికెట్ కన్ఫార్మ్ కాకపోతే, మీ అమౌంట్ తిరిగి రీఫండ్ అవుతుంది. కానీ, ఇకపై జస్ట్ 25 శాతం డబ్బులు పే చేసి టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉంది. అంత తక్కువ అమౌంట్ తో టికెట్ బుకింగ్ ఎలా? అనుకుంటున్నారా? అయితే, మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే..


25 శాతం పేమెంట్ తో రైలు టికెట్ బుకింగ్

చాలా మంది నిత్యం రైలు ప్రయాణం చేసినా, రైల్వే సంస్థతో పాటు ఇతర ట్రావెల్ యాప్స్ అందిస్తున్న ఆఫర్ల గురించి పెద్దగా తెలియదు. అలాంటి వారికి ఇప్పుడు మేం ఓ సూపర్ ఫీచర్ గురించి చెప్పబోతున్నాం. ఈ ఫీచర్ ఉపయోగించి.. కేవలం 25 శాతం డబ్బులు పే చేసి రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు. మిగతా 75 శాతం టికెట్ ఛార్జీ రైలు ప్రయాణానికి 24 గంటల ముందు చెల్లించాల్సి ఉంటుంది. దానికి కూడా ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవు. ఈ ఫీచర్ పేరు ‘సీట్ లాక్ ఫీచర్’. ఇది కేవలం మేక్ మై ట్రిప్ యాప్ లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ ను ఉపయోగించి టికెట్ ఎలా బుక్ చేసుసుకోవాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం..


‘సీట్ లాక్ ఫీచర్’ను ఇలా ఉపయోగించుకోండి!

⦿ ‘సీట్ లాక్ ఫీచర్’ను ఉపయోగించుకోవాలనుకునే వాళ్లు ముందుగా మేక్ మై ట్రిప్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి.

⦿ ఆ తర్వాత యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలి.

⦿ మేక్ మై ట్రిప్ యాప్ ను ఓపెన్ చేయాలి.

⦿ ఆ తర్వాత ‘సెర్చ్ ఫర్ ఏ ట్రైన్’ ఆప్షన్ లోకి వెళ్లాలి.

⦿ మీరు ఎక్కాల్సిన, దిగాల్సిన స్టేషన్ల వివరాలను ఎంటర్ చేయాలి.

⦿ మీరు వెళ్లాల్సిన రూట్ లో అందుబాటులో ఉన్న రైళ్ల వివరాలు కనిపిస్తాయి.

⦿ మీకు నచ్చిన రైలును సెలెక్ట్ చేసుకోవాలి. ట్రావెలర్ వివరాలను ఎంటర్ చేయాలి.

⦿ కిందికి స్క్రోల్ చేయాలి. పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంది.

⦿ డబ్బులు ఎలా పే చేస్తారు? అని అడుగుతుంది. రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి.

⦿ ‘పే ఫుల్ అమౌంట్’ అనే ఆప్షన్ తో పాటు ‘అవైల్ సీట్ లాక్ అండ్ పే 25 పర్సెంటేజ్ నౌ’ అనే ఆప్షన్ ఉంటుంది.

⦿ ‘అవైల్ సీట్ లాక్ అండ్ పే 25 పర్సెంటేజ్ నౌ’ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి. ఆ తర్వాత పేమెంట్ చేయాలి.

⦿  మీ సీటు కన్ఫార్మ్ అవుతుంది. రైలు ప్రయాణానికి ముందుకు మిగతా 75 శాతం అమౌంట్ ను చెల్లించాల్సి ఉంటుంది.

ఈ చక్కటి ఫీచర్ గురించి మీ ఫ్రెండ్స్ తో పాటు తెలిసిన వారికి షేర్ చేసి, ట్రైన్ టికెట్లను ఈజీగా బుక్ చేసుకునేలా సాయపడండి!

Read Also: ఇకపై మీ ట్రైన్ టికెట్ 100% కన్ఫార్మ్.. లేదంటే 3 రెట్లు డబ్బు వెనక్కి!

Related News

Vande Bharat Trains: హైదరాబాద్ కు 2 కొత్త వందే భారత్ రైళ్లు.. శతాబ్ది ఎక్స్‌ ప్రెస్ స్థానంలో రీ ప్లేస్!

Water on Coal: రైల్వే వ్యాగన్లలో బొగ్గు తరలించేటప్పుడు నీళ్లు చల్లుతారు, ఎందుకో తెలుసా?

Moscow – Indian Tourists: భారత పర్యాటకులకు మాస్కో సాదర స్వాగతం, కారణం ఏంటో తెలుసా?

Benefits of Train Ticket: రైల్వే టికెట్ తో ఇన్ని ఫ్రీ సదుపాయాలా? అస్సలు ఊహించి ఉండరు!

Vande Bharat: వందేభారత్ లో తాగి రచ్చ చేసిన జంట, RPF సిబ్బంది ఏం చేశారంటే?

Goa history: ఏంటీ.. గోవాలో ఉన్నది రెండే జిల్లాలా? వీటిలో ఏది బెస్ట్?

Tourist Footfall: ఎక్కువ మంది టూరిస్టులు వచ్చే ఇండియన్ స్టేట్ ఇదే, వామ్మో.. ఏడాదిలో అంత మందా?

Islands In India: స్వర్గాన్ని తలపించే 10 రహస్య దీవులు, ఎక్కడో కాదు.. ఇండియాలోనే!

Big Stories

×