E-Paper
Advertisement

నాస్తికుడికి దెయ్యం కనిపిస్తే ? కొత్తింట్లో జరిగే క్రైమ్‌తో మైండ్ బ్లోయింగ్ హారర్ థ్రిల్లర్

నాస్తికుడికి దెయ్యం కనిపిస్తే ? కొత్తింట్లో జరిగే క్రైమ్‌తో మైండ్ బ్లోయింగ్ హారర్ థ్రిల్లర్
Advertisement

Horror Thriller on OTT: ఒక వ్యక్తి అసలు దేవుడినే నమ్మడు. దెయ్యాలు, ఆత్మలు ఉన్నాయంటే అసలు నమ్మడు. అలాంటి వ్యక్తి ఒక కొత్త ఇంట్లోకి వెళ్లిన తర్వాత అక్కడ ఏదో వింతగా జరుగుతుందని గుర్తిస్తే ? మొదట దాన్ని తన భ్రమ అనుకుంటాడు. కానీ అదే ఇంట్లో ఒక షాకింగ్ క్రైమ్ జరిగితే ? ఆ క్రైమ్‌కు, ఆ ఇంటి గతానికి, తనకు కనిపిస్తున్న వింత సంఘటనలకు సంబంధం ఉందని తెలిస్తే ? తాను జీవితాంతం నమ్మిన సిద్ధాంతాలనే ప్రశ్నించుకోవాల్సి వస్తే ? ఇదే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన తమిళ హారర్ థ్రిల్లర్ ‘డార్క్’ (Dark). మరి ఆ ఇంట్లో అసలు ఏం జరిగింది ? ఆ క్రైమ్‌కు దెయ్యానికి ఉన్న సంబంధం ఏంటి ? ఈ సినిమాని తెలుగులో ఏ ఓటీటీలో చూడొచ్చు ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

విగ్నేష్ మధ్యతరగతికి చెందిన వ్యక్తి. గ్రాఫిక్ డిజైనర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. అతని ఆలోచనా విధానం మాత్రం చాలా భిన్నంగా ఉంటుంది. అతను నాస్తికుడు. దేవుడిని నమ్మడు. ఆత్మలు, దెయ్యాలు లాంటి విషయాలను అసలు పట్టించుకోడు. ఇలాంటి వ్యక్తి ఒక రహస్యమైన గతం ఉన్న ఇంట్లోకి కొత్తగా షిఫ్ట్ అవుతాడు. మొదట్లో ఆ ఇల్లు అతనికి మామూలుగానే అనిపిస్తుంది. కానీ అక్కడి గతం గురించి కొన్ని విషయాలు బయటపడే కొద్దీ పరిస్థితులు మారిపోతాయి.

Advertisement

ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత విగ్నేష్‌కు కొన్ని అసాధారణమైన అనుభవాలు ఎదురవుతాయి. మొదట వాటిని పెద్దగా పట్టించుకోడు. ఏదో మానసిక భ్రమ కావచ్చు, ఇంటి వాతావరణం వల్ల కలుగుతున్న భయమేమో అనుకుంటాడు. కానీ ఒక షాకింగ్ క్రైమ్ అతని జీవితాన్ని ఒక్కసారిగా తలకిందులు చేస్తుంది. ఆ సంఘటన తర్వాత ఇంట్లో జరుగుతున్న వింతలకు ఏదో సంబంధం ఉందని అతనికి అర్థమవుతుంది.

ఇక్కడి నుంచే సినిమాలో అసలు సస్పెన్స్ మొదలవుతుంది. తాను నమ్మని అతీంద్రియ శక్తులు నిజంగానే ఉన్నాయా? లేక ఈ ఇంటి చీకటి గతం వెనుక మరేదైనా మానవ కుట్ర ఉందా? అసలు ఆ ఇంట్లో గతంలో ఏం జరిగింది? అక్కడ జరిగిన క్రైమ్‌కు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు సంబంధం ఏంటి? అనే ప్రశ్నలు ఒక్కొక్కటిగా అతని నమ్మకాలనే పరీక్షించడం మొదలుపెడతాయి. ఒకవైపు కొత్త ఇంటి చీకటి గతం, మరోవైపు జరిగిన నేరంపై పోలీసుల దర్యాప్తు, ఇంకోవైపు తన కళ్ల ముందే జరుగుతున్నట్లు అనిపించే అతీంద్రియ సంఘటనలు… ఈ మూడు అంశాలు కలిసినప్పుడు కథ మరింత ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది.

Advertisement

అసలు ఈ ఇంట్లో ఉన్న రహస్యం ఏంటి ? విగ్నేష్‌కు కనిపిస్తున్నది నిజంగానే దెయ్యమా ? లేక ఆ భయాన్ని ఉపయోగించుకుని ఎవరో చేస్తున్న క్రైమా ? ఇంటి గతంలో దాగి ఉన్న నిజం బయట పడినప్పుడు ఈ మిస్టరీకి ఎలాంటి సమాధానం వస్తుంది ? అనేదే సినిమాలో చూసి థ్రిల్ అవ్వాల్సిన అసలు విషయం.

స్ట్రీమింగ్ ఎక్కడ ?

ఈ సినిమాలో అజయ్ కార్తి, అంచనా నేత్రున్, నటరాజన్ సుబ్రమణ్యం, కె. భాగ్యరాజ్, సిబి చక్రవర్తి, వి.టి.వి. గణేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కల్యాణ్ కె. జెగన్ దర్శకత్వం వహించగా, మను రమేశన్ సంగీతం అందించారు. సుమారు 1 గంట 50 నిమిషాలు ఉండే ‘డార్క్’ మూవీ ఆగస్టు 21 నుంచి Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే Simply Southలో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. కానీ ఈ తమిళ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ తెలుగులో మాత్రం లేదు.

Read Also: పుస్తకంలో రాసిన పాత్రలు నిజంగా బయటకొస్తే ? తర్వాత జరిగింది చూస్తే నవ్వాపుకోలేరు

Related News

అవుట్‌వర్ల్డ్ క్రూర చక్రవర్తిపై తిరుగుబాటు… హాలీవుడ్ హీరో ఎంట్రీతో నెక్స్ట్ లెవెల్ వార్… తెలుగులోనే స్ట్రీమింగ్

విలన్ గా సుహాస్ 150 కోట్ల మాస్ ర్యాంపేజ్… తెలుగులో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘మందాడి’

కొట్టేసిన 300 కోట్ల బంగారాన్ని తన్నుకుపోయే ఖిలాడి… ఓన్ ఫ్రెండే మోసం చేస్తే రివేంజ్ ఇలాగే ఉంటది… ఓటీటీలో తెలుగులోనే

చనిపోయిన ప్రతిసారీ మళ్లీ బతుకుతాడు… ఏలియన్స్‌తో యుద్ధం గెలిచే వరకు ఆగని టైమ్ లూప్… మైండ్ బ్లాక్ సై-ఫై మూవీ

అమెజాన్ అడవుల్లో సీక్రెట్ సిటీ… వెతుక్కుంటూ వెళ్లి రాత్రికి రాత్రే గల్లంతైన సైంటిస్ట్… క్లైమాక్స్ ఊహించలేరు

ఫ్యూచరిస్టిక్ కాలనీలో ఫేక్ బతుకులు… కట్ చేస్తే కిరాక్ ట్విస్ట్… స్ట్రీమింగ్ తెలుగులోనే

చెత్త కుప్పలో దొరికే అమ్మాయి… కళ్లు తెరిచాక మెమొరీ లాస్… ఫైటింగ్ మాత్రం పూనకాలే

అమ్మబాబోయ్ అపార్ట్మెంట్ మొత్తం క్రిమినల్సే… ఒక్కో ఫ్లోర్ లో పిచ్చెక్కించే ట్విస్టులు… తోపు సినిమా మావా

Big Stories

Advertisement
×