E-Paper
Advertisement

ఫ్లాప్ సినిమా షూటింగ్‌ కోసం వెళ్తే పుచ్చ పేలిపోయే ట్విస్ట్… ఈ యాక్షన్ కామెడీ అదుర్స్

ఫ్లాప్ సినిమా షూటింగ్‌ కోసం వెళ్తే పుచ్చ పేలిపోయే ట్విస్ట్… ఈ యాక్షన్ కామెడీ అదుర్స్
Advertisement

Welcome To The Jungle OTT:  ఒక సినిమా షూటింగ్ కోసం అడవిలోకి వెళ్లిన ఫిల్మ్ టీమ్‌కు అక్కడ ఊహించని పరిస్థితులు ఎదురైతే ? సినిమా కోసం వేసుకున్న కాస్ట్యూమ్స్, చేతిలో ఉన్న గన్స్ చూసి గ్రామస్థులు వాళ్లను నిజమైన సైనికులుగా భావిస్తే ? పైగా కావాలనే ఫ్లాప్ చేయాలనుకున్న ఆ సినిమాకు ఖర్చు చేస్తున్న డబ్బు వెనుకే ఓ భారీ స్కెచ్ ఉంటే ? షూటింగ్ కోసం వెళ్లిన వాళ్లు నిజమైన క్రిమినల్స్ మధ్య చిక్కుకుంటే ? కామెడీగా మొదలైన ఈ గందరగోళం చివరికి ప్రాణాల కోసం చేసే పోరాటంగా మారితే ? ఇదే అక్షయ్ కుమార్ మల్టీస్టారర్ ‘వెల్‌కమ్ టు ది జంగిల్’ (Welcome to the Jungle) స్టోరీ. మరి ఫ్లాప్ సినిమా తీయాలనుకోవడం వెనుక అసలు కారణం ఏంటి ? షూటింగ్ కాస్తా నిజమైన యాక్షన్‌గా ఎలా మారింది ? ఈ సినిమా తెలుగులో స్ట్రీమింగ్ అవుతుందా ? తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

రాజీవ్ కోహ్లీ దగ్గర భారీ మొత్తంలో బ్లాక్ మనీ ఉంటుంది. ఆ డబ్బును నేరుగా ఉపయోగిస్తే సమస్యలు వస్తాయని భావించిన అతను… దాన్ని చట్టబద్ధంగా మార్చేందుకు ఓ వింత ప్లాన్ వేస్తాడు. కావాలనే ఓ సినిమా తీసి, అందులో పెట్టిన డబ్బంతా నష్టపోయినట్లు చూపిస్తే బ్లాక్ మనీని లెక్కల్లోకి తీసుకురావచ్చని భావిస్తాడు. దీంతో ఫ్లాప్ కావాలనే ఉద్దేశంతో సినిమా నిర్మాణం మొదలవుతుంది. హీరోలు, నటీనటులు, ఫిల్మ్ టీమ్ అంతా షూటింగ్‌లో పాల్గొంటారు. కానీ సినిమా షూటింగ్ అనుకున్నంత సులభంగా సాగదు. టీమ్ అడవి ప్రాంతంలోని ఓ గ్రామానికి చేరుకోవడంతో అసలు గందరగోళం మొదలవుతుంది.

Advertisement

సినిమా కోసం వేసుకున్న సైనికుల కాస్ట్యూమ్స్, చేతిలో ఉన్న ఆయుధాలు, యాక్షన్ సీన్లు చూసిన గ్రామస్థులు వీళ్లను నిజమైన సైనికులుగా భావిస్తారు. తమ ముందే ఏదో ఆర్మీ ఆపరేషన్ జరుగుతోందని అనుకుని భయపడిపోతారు. అసలు సమస్య మాత్రం ఆ తర్వాత తెలుస్తుంది. వాళ్లు ఉన్న ప్రాంతంలో నిజంగానే ప్రమాదకరమైన క్రిమినల్ కార్యకలాపాలు జరుగుతుంటాయి. దీంతో కెమెరా ముందు నటించాల్సిన యాక్షన్… క్రమంగా నిజమైన ప్రమాదంగా మారుతుంది. ఫేక్ గన్స్‌తో నటించిన వాళ్లకు నిజమైన గ్యాంగ్ ఎదురుపడటంతో పరిస్థితి మారిపోతుంది.

ఒకవైపు ఫ్లాప్ సినిమా తీయాలనుకున్న నిర్మాత ప్లాన్, మరోవైపు తమను సైనికులుగా భావిస్తున్న గ్రామస్థులు, ఇంకోవైపు నిజమైన క్రిమినల్ గ్యాంగ్… ఈ మూడు గందరగోళాలు కలవడంతో ఫిల్మ్ టీమ్ ప్రాణాల కోసం పరుగులు పెట్టాల్సి వస్తుంది. తాము చేస్తున్నది సినిమా షూటింగా? లేక నిజమైన వార్‌లో చిక్కుకున్నామా? అనే అయోమయం మొదలవుతుంది.

Advertisement

అక్షయ్ కుమార్‌తో పాటు సునీల్ శెట్టి, అర్షద్ వార్సీ, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, దిశా పటాని, పరేష్ రావల్, రాజ్‌పాల్ యాదవ్, జానీ లీవర్ తదితరులు ఈ గందరగోళంలో చిక్కుకున్న పాత్రల్లో కనిపిస్తారు. చివరకు ఈ ఫిల్మ్ టీమ్ నిజమైన క్రిమినల్స్ నుంచి ఎలా బయటపడింది? ఫ్లాప్ సినిమా వెనుక ఉన్న డబ్బు స్కెచ్ ఏమైంది? అనేదే మిగిలిన కథ.

తెలుగులో స్ట్రీమింగ్ ?

‘వెల్‌కమ్ టు ది జంగిల్’ ఆగస్టు 21 నుంచి JioHotstarలో స్ట్రీమింగ్ అవుతోంది. అక్షయ్ కుమార్ మార్క్ కామెడీ, భారీ స్టార్ కాస్ట్, అడవి నేపథ్యంలోని యాక్షన్, సిట్యుయేషనల్ హ్యూమర్ తో నడిచే ఈ సినిమా టైమ్‌పాస్ ఆప్షన్. ముఖ్యంగా సినిమా షూటింగ్ కాస్తా నిజమైన యాక్షన్‌గా మారితే వచ్చే గందరగోళం ఆకట్టుకుంటుంది. అయితే ఈ సినిమా హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది.

Read Also: గాల్లోనే ప్రాణాంతక వైరస్ దాడి.. ప్రపంచం మొత్తం భయపడిన ఏవియేషన్ డిజాస్టర్ థ్రిల్లర్ తెలుగులో

Tags

Related News

కొట్టేసిన 300 కోట్ల బంగారాన్ని తన్నుకుపోయే ఖిలాడి… ఓన్ ఫ్రెండే మోసం చేస్తే రివేంజ్ ఇలాగే ఉంటది… ఓటీటీలో తెలుగులోనే

చనిపోయిన ప్రతిసారీ మళ్లీ బతుకుతాడు… ఏలియన్స్‌తో యుద్ధం గెలిచే వరకు ఆగని టైమ్ లూప్… మైండ్ బ్లాక్ సై-ఫై మూవీ

అమెజాన్ అడవుల్లో సీక్రెట్ సిటీ… వెతుక్కుంటూ వెళ్లి రాత్రికి రాత్రే గల్లంతైన సైంటిస్ట్… క్లైమాక్స్ ఊహించలేరు

ఫ్యూచరిస్టిక్ కాలనీలో ఫేక్ బతుకులు… కట్ చేస్తే కిరాక్ ట్విస్ట్… స్ట్రీమింగ్ తెలుగులోనే

చెత్త కుప్పలో దొరికే అమ్మాయి… కళ్లు తెరిచాక మెమొరీ లాస్… ఫైటింగ్ మాత్రం పూనకాలే

అమ్మబాబోయ్ అపార్ట్మెంట్ మొత్తం క్రిమినల్సే… ఒక్కో ఫ్లోర్ లో పిచ్చెక్కించే ట్విస్టులు… తోపు సినిమా మావా

ప్రైవేట్ వీడియో లీక్… బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య భయంకరమైన బ్లాక్‌మెయిల్ గేమ్

ప్రతి క్రైమ్ కళ్లముందే రీప్లే… అరుదైన కథ… అదిరిపోయే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సిరీస్

Big Stories

Advertisement
×