OTT Movie : మలయాళం సినిమాల కోసం ఇప్పుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్. స్టోరీని తెరమీద సింపుల్ గా ప్రెజెంట్ చేయడంలో ఒక అడుగు ముందే ఉన్నారు. అయితే రీసెంట్ గా వచ్చిన ఒక మూవీ ఓటీటీలో దూసుకుపోతోంది. కామెడీ జనర్ లో తెరకెక్కిన ఈ సినిమాకి ఐఎండీబీలో 8.0 రేటింగ్ కూడా ఉంది. ఈ సినిమా ఓ తండ్రి, కొడుకుల మధ్య తిరుగుతుంది. ఈ సినిమా కామెడీ, ఎమోషన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో
ఈ మలయాళ కామెడీ-డ్రామా మూవీ పేరు ‘పరివార్’ (Pariwar). 2025 లో వచ్చిన ఈ సినిమాకు ఉల్సవ్ రాజీవ్, ఫహద్ నందు దర్శకత్వం వహించారు. ఇందులో జగదీష్, ఇంద్రన్స్, ప్రశాంత్ అలెగ్జాండర్, రిషికేష్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ ఫ్రాగ్రెంట్ నేచర్ ఫిల్మ్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించారు. 2025మార్చి 7న థియేటర్లలో విడుదలైంది. తర్వాత జూన్ 24 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా 99 ఏళ్ల వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. అతని నలుగురు కొడుకులు ఒక విలువైన డైమండ్ రింగ్ కోసం పోటీ పడతారు. 1 గంట 57 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకి, ఐఎండీబీలో 8.0 రేటింగ్ ఉంది.
స్టోరీలోకి వెళితే
భాస్కర పిళ్లై అనే 99 ఏళ్ల వృద్ధుడు, తన చివరి రోజుల్లో బెడ్‌రిడ్డన్‌గా ఉంటాడు. అతని నలుగురు కొడుకులు బీమన్ (ఇంద్రన్స్), సహదేవన్ (జగదీష్), నకులన్ (ప్రశాంత్ అలెగ్జాండర్), అర్జున్ (రిషికేష్) ఆర్థికంగా స్థిరపడినప్పటికీ, తమ తండ్రి వేలుకి ఉన్న ఒక అమూల్యమైన డైమండ్ రింగ్‌పై దృష్టి పెడతారు. ఇది అతనికి ఒక బ్రిటిష్ అధికారి బహుమతిగా ఇచ్చిన యాంటీక్ వస్తువు. ఈ రింగ్ కోసం వీళ్ళు ఆడే దాగుడు మూతలు, మొదట కెమెడీగా అనిపించినా, తరువాత కుటుంబ వివాదంగా మారుతాయి. భాస్కర పిళ్లై ఆరోగ్యం క్షీణిస్తున్నప్పుడు, అతని కొడుకులు, ఇతర బంధువులు అతని ఇంటిలో ఈ రింగ్ కోసం గుమిగూడతారు.
ప్రతి ఒక్కరూ రింగ్‌ను సొంతం చేసుకోవాలనే దురాశలో ఉంటారు. పెద్ద కొడుకు బీమన్, చిన్న కొడుకు అర్జున్, తమ తండ్రి ఆరోగ్యం పట్ల నిజమైన శ్రద్ధ చూపిస్తారు. అయితే సహదేవన్, నకులన్ ఎక్కువగా స్వార్థపరమైన మనస్తత్వంతో ఉంటారు. సహదేవన్ తన తండ్రి ఆరోగ్యం కంటే రింగ్‌పై ఎక్కువ దృష్టి పెడతాడు. అయితే నకులన్ తన భార్య నీషా ఒత్తిడితో రింగ్‌ను సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ గొడవలు కుటుంబంలోని ఉద్రిక్తతలకు దారి తీస్తాయి. చివరికి భాస్కర పిళ్లై చనిపోతాడా ? ఆ డైమండ్ రింగ్ ఎవరికి దక్కుతుంది ? సహదేవన్, నకులన్ తమ తప్పును తెలుసుకుంటారా ? అనే ప్రశ్నలకు సమాధానం కావాలనుకుంటే, ఈ మలయాళం సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : యాక్షన్ ప్రియుల్ని శాటిస్ఫై చేసే మూవీ… వన్ మ్యాన్ షో… ఈ కొరియన్ సినిమాలో ఒక్కో సీన్ విందు భోజనమే