Johnny Movie: ఖుషీ ..పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని ఒక్కసారిగా ఆకాశంలో పెట్టేసింది. 80 సెంటర్లలో 100రోజులంటే మాటలా. ముఖ్యంగా ఆ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ అంటే ఒక ట్రెండ్ సెట్టర్ అయిపోయాడు. వేసుకునే పాంట్లు, నడిచే స్టైల్, మాట్లాడే తీరు అంతా యూత్ కి పిచ్చి పిచ్చిగా నచ్చేశాయ్. ఇంకేం ఎప్పటిలాగే ఖుషి తర్వాత వచ్చే సినిమాపై హోప్స్ స్కై లెవెల్ లో పెట్టేసుకున్నారంతా.. దీనికి తోడు ఆ సినిమాకి తనే డైరెక్ట్ చేస్తున్నాడు అన్న టాక్ టోటల్ ఇండస్ట్రీనే షేక్ చేసేసింది. ఇక ఈ సినిమా కేవలం ఫైట్లు మాత్రమే కాదు, సినిమా అంతా రియలిస్టిక్ మార్షల్ ఆర్ట్స్‌తో ఉంటుందని జపాన్, లాస్ ఏంజిల్స్ వెళ్లి పవన్ ట్రైనింగ్ తీసుకున్నాడనే వార్తలు అంచనాలని డబల్ చేసేసింది.
2003 ఏప్రిల్ 25న రిలీజ్
ఇక రమణ గోగుల అందించిన మ్యూజిక్ ఒక ఊపు ఊపేసింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ స్వయంగా పాడిన ‘నారింజ పండు’, ‘తారమ్మా తారమ్మా’ పాటలు అప్పట్లో సెన్సేషన్. ఆ పాటలు వింటే ఫ్యాన్స్‌కు ఇప్పటికీ పూనకాలు గ్యారంటీ. అలా ఆల్బమ్‌లోని ప్రతి పాట ఒక చార్ట్‌బస్టర్ ప్లేస్ కొట్టేసింది.మొత్తానికి భారీ అంచనాల మధ్య సినిమా 2003 ఏప్రిల్ 25న రానే వచ్చేసింది. ఆ రోజు తెల్లవారుజాము నుంచే థియేటర్ల వద్ద ఆడియన్స్ వెయిటింగ్. సినిమాని 250కి పైగా ప్రింట్లతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు మేకర్స్.
అభిమానులకి పెద్ద షాక్
కానీ, సినిమా చూసి బయటకు వచ్చిన అభిమానులకి పెద్ద షాక్. ఎనర్జిటిక్ పవన్‌ను చూడాలనుకున్న ఫ్యాన్స్, జబ్బు పడిన జానీని చూసి తట్టుకోలేకపోయారు. కమర్షియల్ ఎలిమెంట్స్ కంటే ఎమోషనల్ డ్రామాకే పవన్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం మాస్ ఆడియన్స్‌కు నచ్చలేదు. సినిమాలో డైలాగ్స్ చాలా తక్కువగా ఉండటం, రియలిస్టిక్ టేకింగ్ ఉండటంతో అప్పట్లో ఇది చాలా మందికి అర్థం కాలేదు. ఓవరాల్ గా సినిమా అట్టర్ ప్లాప్ అని తేల్చేశారు. కానీ సినిమా అలా వచిందో లేదో మార్కెట్ మొత్తం ‘జానీ’ వస్తువులతో నిండిపోయింది. ఇక తలకు కట్టుకునే ఆ స్పెషల్ కర్చీఫ్ అయితే అప్పట్లో ఒక ఐకాన్. ఇక డబుల్ షర్ట్స్ & బనియన్స్ తో పవన్ మేకోవర్ నెక్స్ట్ లెవల్.
సింక్ సౌండ్ మొదటిగా ఈ సినిమాలోనే
అయితే సినిమా పోయినప్పటికీ ఈ సినిమా టెక్నికల్ ఎంత స్ట్రాంగ్ అనేది ఇప్పటికీ మాట్లాడుకుంటారంటే ఆశ్చర్యం లేదు. అవును… ఇప్పుడు గొప్పగా మాట్లాడుకుంటున్న సింక్ సౌండ్ మొదటిగా వాడింది ఈ సినిమాలోనే.ఇక చోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి అతిపెద్ద బలం అని చెప్పాలి.అప్పట్లో టాలీవుడ్ సినిమాలు చాలా కలర్ ఫుల్ గా ఉండేవి. కానీ ‘జానీ’ కోసం పవన్ ‘డీ-శాచురేటెడ్’ (De-saturated) లుక్ ఎంచుకున్నారు. సినిమా అంతా కాస్త గోధుమ రంగు (Sepia/Brown tint) షేడ్ లో కనిపిస్తుంది. యాక్షన్ సన్నివేశాల్లో ‘హ్యాండ్ హెల్డ్’ కెమెరా మూమెంట్స్ వాడి, ప్రేక్షకుడికి ఆ ఫైట్ మధ్యలో ఉన్న అనుభూతిని కలిగించారు. ఇప్పటికీ ఫిలిం స్కూల్ విద్యార్థులు ‘జానీ’లోని షాట్ మేకింగ్, కలర్ ప్యాలెట్ గురించి చర్చించుకుంటారంటే ఆశ్చర్యం లేదు.
also read: జాన్వీ కపూర్ గ్లామర్ డోస్.. హద్దులు దాటుతున్న శ్రీదేవి తనయ! ఆ డ్రెస్ ఏంటి బాబోయ్?
సినిమా మొత్తం ఒక సీరియస్ డ్రామా
ఈ సినిమాలో ఎక్కడా రోప్స్ కట్టి గాల్లో ఎగిరే ఫైట్లు ఉండవు. పవన్ కళ్యాణ్ స్వయంగా మార్షల్ ఆర్ట్స్ లో ఎక్స్పర్ట్ కావడంతో ప్రతి మూమెంట్ చాలా రియలిస్టిక్ గా ఉండేలా ప్లాన్ చేశారు. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్ లో ఎటువంటి సినిమాటిక్ ఎలిమెంట్స్ లేకుండా, కేవలం బాడీ లాంగ్వేజ్ మరియు టెక్నిక్ తోనే ఫైట్ కంపోజ్ చేశారు. ఇందుకోసం జపాన్ నుంచి ప్రత్యేక నిపుణులను కూడా రప్పించడం విశేషం.’జానీ’ స్క్రీన్ ప్లేని ఇప్పటికీ చాలా మంది ఒక గైడ్ లా ఫాలో అవుతారు. అప్పటి వరకూ వచ్చిన కమర్షియల్ సినిమాల్లో ఉండే ఫార్ములాను పవన్ పక్కన పెట్టేసి పవన్ ఈ సినిమాని తెరకెక్కించాడు మరి. ఇక పాటలు కథలో భాగంగానే వస్తాయి తప్ప, విదేశాలకు వెళ్లి డ్యాన్స్ చేసే సాంగ్స్ ఇందులో ఉండవు. సినిమా మొత్తం ఒక సీరియస్ డ్రామా లాగా సాగుతుంది. ఒక స్టార్ హీరో అయి ఉండి కూడా తన ఇమేజ్ కి భిన్నంగా ‘లీనియర్ నెరేషన్’ లో కథను చెప్పడం అప్పట్లో ఒక పెద్ద సాహసం అనే చెప్పాలి.
ఎడిటింగ్ స్టైల్ కూడా అప్పట్లో ఒక సెన్సేషన్
ఇక సినిమాలో కనిపించే మురికివాడలు, పాత ఇళ్ల సెట్స్ చాలా సహజంగా ఉంటాయి. ఎక్కడా ఇది ఒక ‘సినిమా సెట్’ అని అనిపించదు. ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్షన్ లో ప్రతి చిన్న డీటెయిల్ (గోడల మీద పోస్టర్లు, పాత వస్తువులు) చాలా జాగ్రత్తగా డిజైన్ చేశారు. పవన్ కళ్యాణ్ విజన్ కి తగ్గట్టుగా ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్ లా ఉండేలా జాగ్రత్త పడ్డారు.ఈ సినిమా ఎడిటింగ్ స్టైల్ కూడా అప్పట్లో ఒక సెన్సేషన్. ఒక సీన్ నుంచి మరో సీన్ కి వెళ్లేటప్పుడు వాడిన ట్రాన్సిషన్స్ హాలీవుడ్ సినిమాలను గుర్తు చేస్తాయ్. పవన్ కళ్యాణ్ స్వయంగా ఎడిటింగ్ టేబుల్ వద్ద కూర్చుని ప్రతి ఫ్రేమ్ ను చెక్కుకున్నారని ఇన్ సైడ్ టాక్.
సంస్కృతికి ఆయనే పునాది వేసింది ఆయనే
ఏది ఏమైనా టెక్నికల్ గా ‘జానీ’ చాలా ముందుగా తీసిన సినిమా. అప్పట్లో వాడిన టెక్నాలజీ, స్క్రీన్ ప్లే ఆడియన్స్ టేస్ట్ కి డిఫరెంట్ గా ఉండటం వల్ల సినిమా సినిమా కమర్షియల్ గా డబ్బులు రాబట్టలేకపోయింది. ఇక సినిమా ఫ్లాప్ అవ్వగానే, తనను నమ్మి నష్టపోయిన బయ్యర్లకు పవన్ తన పారితోషికాన్ని వెనక్కి ఇచ్చేశారు. టాలీవుడ్‌లో ఇలాంటి సంస్కృతికి ఆయనే పునాది వేసింది పవన్ అనే చెప్పాలి.
అయితే సినిమా తాలుకూ విశేషాలని మెల్లి మెల్లిగా తెలుసుకున్న ఆడియన్స్ ఇపుడు ఒక కల్ట్ స్టేటస్ ఇచ్చేశారు. అందుకే సినిమా వచ్చి ఈరోజుకి 23 ఏళ్ళు గడిచినా మనమింకా మాట్లాడుకుంటున్నాం. మాట్లాడుకుంటూనే ఉంటాం. దటీజ్ జానీ !
also read :తెలంగాణ ‘ఐస్ ఆపిల్స్’: నోరూరించే తాటిముంజలతో ఇన్ని లాభాలా? తెలిస్తే రోజూ తింటారు!