E-Paper
Advertisement

అమ్మాయి మిస్సింగ్ కేసులో పిచ్చెక్కించే ట్విస్టులు… ఉత్కంఠ రేకెత్తించే సరికొత్త క్రైమ్ మిస్టరీ

అమ్మాయి మిస్సింగ్ కేసులో పిచ్చెక్కించే ట్విస్టులు… ఉత్కంఠ రేకెత్తించే సరికొత్త క్రైమ్ మిస్టరీ
Advertisement

Crime Thriller Series on OTT : గత ఏడాది ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఏదో ఫైట్లు, పాటలు ఉండే స్టోరీ టైపు కాకుండా, చాలా సీరియస్‌గా సాగే సిరీస్ ఇది. కథ మొత్తం మంచు పర్వతాల మధ్య మర్డర్ మిస్టరీ చుట్టూ జరుగుతుంది. ఆ వాతావరణమే ఒకలాంటి భయాన్ని, ఉత్కంఠను కలిగిస్తుంది. ప్రతి సీన్ చాలా గ్రిప్పింగ్‌గా ఉంటూ.. అసలు ఆ హత్యలు ఎవరు చేస్తున్నారో చివరి దాకా అంచనా వేయలేనంత సస్పెన్స్‌గా సాగుతుంది. ఈ సిరీస్ లో పోలీస్ వాళ్ళకి కూడా ఇంట్లో గొడవలు, ఆఫీసులో టెన్షన్లు ఉంటాయి. ఆ కష్టాలన్నీ పడుతూనే, చలిలో గడ్డకట్టే మంచులో హంతకుడి వేట ఎలా సాగించారనేది చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. క్రైమ్ థ్రిల్లర్లు ఇష్టపడే వాళ్ళకి ఇది పక్కాగా నచ్చే సిరీస్.

నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్

ఈ స్వీడిష్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ పేరు ‘ది ఆరే మర్డర్స్’ (The Åre Murders). ఈ సిరీస్‌ని స్వీడన్‌లోని అత్యంత అందమైన స్కీ రిసార్ట్ పట్టణమైన ‘ఆరే’ (Åre) లో చిత్రీకరించారు. మంచుతో నిండిన కొండలు, అందమైన లోయలు ఒకవైపు కనిపిస్తుంటే, మరోవైపు అక్కడ జరిగే దారుణమైన హత్యలు ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తాయి. దీనిని వివేకా స్టెన్ అనే ఫేమస్ రైటర్ రాసిన ‘హిడెన్ ఇన్ స్నో’ వంటి నవల ఆధారంగా తీశారు. పుస్తకాల్లోని గ్రిప్పింగ్ సస్పెన్స్‌ను ఏమాత్రం తగ్గకుండా స్క్రీన్ మీద చూపించడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. ఇందులో హన్నా అహ్లాండర్ అనే డిటెక్టివ్ పాత్రలో కార్లా సెహ్న్, డేనియల్ లిండ్‌స్కోగ్ పాత్రలో కార్డో రజాజీ నటించారు. కేవలం 5 ఎపిసోడ్లు మాత్రమే ఉండటంతో కథ కూడా చాలా వేగంగా సాగిపోతుంది. బోర్ కొట్టకుండా రెండు వేర్వేరు క్రైమ్ కేసులను ఇందులో డీల్ చేశారు.ఇది 2025 ఫిబ్రవరి 6 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ సక్సెస్ అవ్వడంతో నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికే రెండవ సీజన్‌ను కూడా ప్రకటించింది, ఇది ఈ ఏడాది వచ్చే ఛాన్స్ ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

కథ మెయిన్ క్యారెక్టర్ హన్నా అనే అమ్మాయి. ఈమె స్టాక్‌హోమ్‌లో పోలీస్ ఆఫీసర్‌గా పనిచేస్తుంటుంది. అయితే ఏదో గొడవ వల్ల తన ఉద్యోగం ఊడిపోతుంది. దాంతో ఏం చేయాలో తెలియక, రిలాక్స్ అవ్వడానికి ‘ఆరే’ అనే మంచు పర్వతాల దగ్గర ఉన్న ఊరికి వస్తుంది. అక్కడ తన చెల్లెలు ఇంట్లో ఉంటూ టైమ్ పాస్ చేస్తుంటే, సడన్‌గా ఒక చిన్న పిల్ల కనిపించకుండా పోతుంది. ఊరంతా గాలిస్తున్నా దొరకదు, దాంతో హన్నా ఊరికే ఉండలేక తన పోలీస్ బుర్ర ఉపయోగించి ఎంక్వయిరీ మొదలుపెడుతుంది.

ఆమె అక్కడ పని చేసే డేనియల్ అనే లోకల్ పోలీసుతో కలిసి హన్నా ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఆ పిల్ల ఏమైంది? ఆ మంచు కొండల్లో ఆమెను ఎవరైనా ఎత్తుకెళ్లారా లేక చంపేశారా? అని ఆరా తీస్తుంటే, సస్పెన్స్ కూడా పీక్స్ లో ఉంటుంది. ఇక్కడే కథ ఇంకో మలుపు తిరుగుతుంది. మంచు కొండల్లో దారుణంగా నరికేసిన ఒక శవం బయటపడుతుంది. ఆ శవం ఎవరిది? అంత పగతో ఎవరు చంపారు? అని వెతుకుతున్నప్పుడు హన్నాకు మరిన్ని భయంకరమైన విషయాలు తెలుస్తాయి. తన పర్సనల్ లైఫ్‌ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, ప్రాణాలకు తెగించి ఆ హంతకుడిని ఎలా పట్టుకుంది అనేదే ఈ సిరీస్ క్లైమాక్స్.

Advertisement

Read Also : టైమ్ లూప్ లో చిక్కుకునే పోలీసులు… మైండ్‌ను బ్లాస్ట్ సస్పెన్స్‌తో అబ్బురపరుస్తున్న మలయాళం మూవీ

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×