E-Paper
Advertisement

సినిమా తీస్తే జైలుకే… హీటెక్కించే ఇరానియన్ పొలిటికల్ థ్రిల్లర్

సినిమా తీస్తే జైలుకే… హీటెక్కించే ఇరానియన్ పొలిటికల్ థ్రిల్లర్
Advertisement

Political Thriller on OTT : ఓటీటీలో ఒక ఇరానియన్ మూవీ ఆసక్తికరమైన కధానంతో ఆకట్టుకుంటోంది. ఇది ఇరాన్ లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఇరాన్‌లోని ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఒక పక్క గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చే జీతం, హోదా.. ఇంకో పక్క సొంత బిడ్డల మధ్య నలిగిపోయే ఒక తండ్రి కథ ఇది. ఇది ఒక రియలిస్టిక్ పొలిటికల్ థ్రిల్లర్. ఇందులో చూపించే నిరసనలు, గొడవలు అన్నీ నిజంగా జరిగినవే. ఇరాన్‌లో మహిళల హక్కుల కోసం జరుగుతున్న పోరాటాలను, అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను ఈ సినిమా కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. సినిమా చూస్తున్నంత సేపు మన కళ్ల ముందే జరుగుతున్న ఒక ఘోరంలా అనిపిస్తుంది. ఈ సినిమా పేరు ‘ది సీడ్ ఆఫ్ ద సేక్రెడ్ ఫిగ్’ (The Seed of the Sacred Fig). దీనిని తీసినందుకు దర్శకుడు ప్రణాల మీదకు కూడా తెచ్చుకున్నాడు.

ఎక్కడ చూడచ్చు అంటే

ప్రముఖ ఇరానియన్ దర్శకుడు మహమ్మద్ రసూలోఫ్ రూపొందించిన ఈ పవర్ ఫుల్ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో అందుబాటులో ఉంది. 2024లో వచ్చిన ఈ సినిమాను దర్శకుడు ప్రభుత్వానికి తెలియకుండా రహస్యంగా చిత్రీకరించారు. ఈ సినిమా తీసినందుకు ఆయనకు జైలు శిక్ష పడటంతో, ఆయన దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. సినిమా పూర్తయ్యాక, దీనిని కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు పంపినందుకు దర్శకుడికి ఎనిమిదేళ్ల జైలు శిక్ష, కొరడా దెబ్బల శిక్ష విధించారు. అయితే ఆయన లొంగిపోకుండా రహస్యంగా కొండల గుండా సరిహద్దులు దాటి జర్మనీకి పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు. ఇది 2022లో ఇరాన్‌లో జరిగిన ‘వుమన్, లైఫ్, ఫ్రీడం’ నిరసనలకు సంబంధించిన రియల్ స్టోరీ. ఇరాన్ లో మనుషుల స్వేచ్ఛను ఎలా హరిస్తుందో దర్శకుడు అద్భుతంగా చూపించారు. ఈ చిత్రం 2024 కాన్స్ వేదికపై 12 నిమిషాల పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా, ఆస్కార్ రేసులో కూడా నిలిచింది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఇమాన్ అనే ఒక నిజాయితీ గల న్యాయవాదికి టెహ్రాన్ కోర్టులో ఇన్వెస్టిగేటింగ్ జడ్జిగా ప్రమోషన్ వస్తుంది. అయితే ఆ పదవితో పాటే పెద్ద బాధ్యత, అంతకంటే పెద్ద భయం అతడిని చుట్టుముడతాయి. ఆ సమయంలోనే ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు మొదలవుతాయి. పై అధికారుల ఒత్తిడి వల్ల, ఎలాంటి ఆధారాలు లేకపోయినా నిరసనకారులకు మరణశిక్షలు వేసే కాగితాల మీద ఇమాన్ సంతకాలు చేయాల్సి వస్తుంది. దీనివల్ల అతను తీవ్రమైన మానసిక వేదనకు గురవుతాడు. పైగా తన కుటుంబానికి ఎక్కడ ముప్పు వస్తుందో అని భయపడుతూ ఉంటాడు.

ఇదే సమయంలో ఇమాన్ కూతుళ్లు ఇద్దరూ సోషల్ మీడియా ద్వారా ఆ పోరాటాలకు ఆకర్షితులవుతారు. ఒకరోజు ఇమాన్‌కు ప్రభుత్వం ఇచ్చిన సర్వీస్ రివాల్వర్ ఇంట్లో కనిపించకుండా పోతుంది. బయట ఉన్న ఉద్రిక్తత, ఆఫీసు ఒత్తిడి వెరసి.. ఇమాన్ తన సొంత భార్యను, కూతుళ్లనే అనుమానించడం మొదలుపెడతాడు. తుపాకీ ఎక్కడ ఉందో చెప్పమని వాళ్ళని వేధించడం, గదిలో పెట్టి బంధించడం వంటివి చేస్తాడు. దీనివల్ల అప్పటివరకు ఎంతో ప్రేమగా ఉన్న ఆ కుటుంబం ముక్కలైపోతుంది. చివరకి ఇమాన్ ఈ పరిస్థితి నుంచి ఎలా బయట పడ్డాడు ? అసలు ఆ తుపాకి ఎలా మిస్ అయింది ? దాని వల్ల ఇంకెలాంటి సమస్యలు వచ్చాయి ? అనే ప్రశ్నలకు సమాధానాలు కావాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Advertisement

Read Also : మెదడు మొద్దుబారేలా చేసే తెలుగు హార్రర్ థ్రిల్లర్.. సింగిల్ గా చూశారో ఫసక్

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×