E-Paper
Advertisement

ఫ్లాప్‌ను సెలబ్రేట్ చేసుకుంటున్న విఘ్నేష్ శివన్.. ఇదెక్కడి విడ్డూరం సామీ?

ఫ్లాప్‌ను సెలబ్రేట్ చేసుకుంటున్న విఘ్నేష్ శివన్.. ఇదెక్కడి విడ్డూరం సామీ?

LIC Disaster : ప్రదీప్ రంగనాథన్…కోలీవుడ్ జూనియర్ ధనుష్ అని ట్యాగ్ వేసుకున్న ఈ కుర్ర హీరో విఘ్నేష్ శివన్ సినిమా చేస్తున్నాడు అనగానే మనోడి ఖాతాలో మరో హిట్ ఫిక్స్ అనుకున్నారు అంతా. కానీ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా సాలిడ్ హిట్ ఇస్తాడనుకున్న ఈ తమిళ తంబీ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIC) అంటూ డిజాస్టర్ మూట గట్టాడు. అవును ప్రదీప్ రంగనాథన్, కృతిశెట్టి లాంటి క్రేజీ కాంబినేషన్‌ను పెట్టుకుని, అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ ఉన్నా కూడా ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIC) సినిమా ప్రేక్షకులకు మినిమం సాటిస్ ఫ్యాక్షన్ కూడా ఇవ్వలేకపోయింది.

చాలా ఈజీగా 100 కోట్ల క్లబ్‌లో చేరిపోయిన ప్రదీప్‌

ముఖ్యంగా ఈ సినిమాలో హీరోగా నటించిన ప్రదీప్ రంగనాథన్ ట్రాక్ రికార్డ్ చూస్తే అందరూ షాక్ అవుతున్నారు. ఎందుకంటే ‘లవ్ టుడే’ డ్రాగన్, డ్యూడ్ అంటూ చాలా ఈజీగా 100 కోట్ల క్లబ్‌లో చేరిపోయిన ప్రదీప్‌కు, విఘ్నేష్ శివన్ ఒక భారీ డిజాస్టర్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. 2022లో వచ్చిన ‘కాతువాకుల రెండు కాదల్’ సినిమాతోనే విఘ్నేష్ గ్రాఫ్ పడిపోవడం మొదలైందని చెప్పాలి. అజిత్ కుమార్‌తో చేయాల్సిన సినిమా చేజారిపోయిన తర్వాత, ఎలాగైనా హిట్ కొట్టాలని ఈ ‘LIC’ సినిమా తీశాడు. నయనతార సొంత బ్యానర్ రౌడీ పిక్చర్స్ డబ్బులు పెట్టినా, సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద పోస్టర్ ఖర్చులు కూడా తేలేకపోయింది.

also read :గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినా టికెట్ రేట్లు పెంచం.. ఎగ్జిబిటర్ల బంపర్ అనౌన్స్‌మెంట్!

అదంతా ఒకెత్తు అయితే గత నెలలో విడుదలైన ఈ సినిమాపై విఘ్నేష్ శివన్ తాజాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో మీమర్స్ కి మాంచి స్టఫ్ అవుతున్నాయ్. డిజాస్టర్ ని డిజాస్టర్ అనాల్సింది పోయి ఏదో పెద్ద త్యాగం చేసినట్లు మాట్లాడటం ఇపుడు నెటిజన్ల కోపానికి కారణం అవుతున్నాయ్.

ఏకి పారేస్తున్న నెటిజన్లు

విఘ్నేష్ మాట్లాడుతూ .. “నేను ఒక పెద్ద కలగన్నాను, థియేటర్లలో చప్పట్లు మారుమోగిపోతాయి అనుకున్నాను, 100 కోట్లు కాదు కదా దానికి రెట్టింపు వసూళ్లు వస్తాయని ఆశించాను” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక్కడే నెటిజన్లకి దొరికిపోయాడు.అసలే కంటెంట్ అంతంత మాత్రంగా ఉన్న సినిమాకి ఆ రేంజ్ రియాక్షన్స్ అండ్ కలెక్షన్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావంటూ చెడుగుడు ఆడేస్తున్నారు.ఎస్‌జే సూర్య లాంటి పవర్‌ఫుల్ యాక్టర్‌ను పెట్టుకుని కూడా ఆడియన్స్ ని ఆకట్టుకోలేదంటే ఇంతకన్నా ఘోరమైన ఫెయిల్యూర్ మరొకటి ఉండదంటూ ఏకి పారేస్తున్నారు నెటిజన్లు.

తాను చాలా సంతృప్తిగా ఉన్నానన్న విఘ్నేష్ శివన్

అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సినిమా ఫ్లాప్ అయినా కూడా విఘ్నేష్ మాత్రం తాను చాలా సంతృప్తిగా ఉన్నానని, ఈ సినిమా విడుదలవ్వడమే ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని కామెంట్స్ చేయడమే. నిజానికి గతంలో విఘ్నేష్ శివన్ తీసిన ‘పోడా పోడీ’ (2012), ‘నానుమ్ రౌడీ దాన్’ (2015) సినిమాల్లో ఉన్న ఫ్రెష్‌నెస్ ఇప్పుడు కనిపించట్లేదు. కేవలం భార్య నయనతార ఇమేజ్‌ను వాడుకోవడం తప్ప, దర్శకుడిగా ఆయనలో సత్తా తగ్గిపోయిందని తమిళ తంబీలు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు కూడా.చూడాలి మరి ఈ ప్లాప్ తో నైనా రియలైజ్ అయ్యి మరో హిట్ తీస్తాడా లేక ప్లాప్ సినిమానే తీసి హిట్ అని జబ్బలు చరుచుకుంటాడా !

also read :బతకనివ్వరా..? అంటూ తిరుపతిలో రషా తడానీతో ఘట్టమనేని వారసుడి రొమాన్స్!

Related News

సలార్ 2 నుండి పుష్ప 3 దాకా.. అంచనాలు పెంచి చేతులెత్తేస్తున్నారా?

‘ప్రతి ఒక్కడు దొంగే..’ అంటూ పూరీ జగన్నాథ్ సంచలన ట్వీట్.. నెట్టింట వైరల్

థియేటర్ డోర్ వెనుక బాలీవుడ్ లవ్ బర్డ్స్ సీక్రెట్ ప్లాన్.. కెమెరామెన్స్ దెబ్బకు స్కెచ్ రివర్స్!

వివాదాల్లో పెద్ది…రామ్ చరణ్ సినిమాపై ఈ రేంజ్ నెగెటివిటీనా?

నెట్టింట వైరల్ అవుతున్న మృణాల్ ‘ఐస్‌క్రీమ్ రైస్’.. అంతలా అడిక్ట్ అయిపోయిందా?

అర్ధరాత్రి ఆ వీడియో డిలీట్ చేయడానికి కారణం అదే….. నిజం చెప్పేసిన బాలీవుడ్ బ్యూటీ!

‘రైరై రారా’ సాంగ్‌కు థియేటర్లోనే పూనకాలు.. ‘పెద్ది’ లేడీ ఫ్యాన్ మాస్ అరాచకం!

సడన్‌గా కాంట్రవర్సీలో ఇరుక్కున్న అనుష్క శర్మ.. ఆ ఒక్క పోస్టే కారణమా?

Big Stories

×