BigTV English

OTT Movie : ఒకే అమ్మాయిని ప్రేమించే ఇద్దరు స్నేహితులు… ఆ అమ్మాయి ఇచ్చే ట్విస్ట్ కి ఫ్యూజులు అవుట్

OTT Movie : ఒకే అమ్మాయిని ప్రేమించే ఇద్దరు స్నేహితులు… ఆ అమ్మాయి ఇచ్చే ట్విస్ట్ కి ఫ్యూజులు అవుట్

OTT Movie : ట్రయాంగిల్ లవ్ స్టోరీలతో ఓటిటి లో చాలా సినిమాలే వచ్చాయి. ఈ సినిమాలను చూడడానికి ప్రేక్షకులు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో ఇద్దరు ఫ్రెండ్స్ అమ్మాయి విషయంలో శత్రువులుగా మారతారు. ఆ తర్వాత స్టొరీ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…


జియో సినిమా (Jio Cinema) లో

ఈ రొమాంటిక్ కామెడీ మూవీ పేరు ‘పొన్ ఒండ్రు కండెన్’ (Pon Ondru Kanden). 2024లో విడుదలైన ఈ మూవీకి వి. ప్రియా దర్శకత్వం వహించారు. ఇందులో అశోక్ సెల్వన్, వసంత్ రవి, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రల్లో నటించారు. దీనికి యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చారు. జియో స్టూడియోస్, YSR ఫిల్మ్స్ బ్యానర్‌లో జ్యోతి దేశ్‌పాండే, యువన్ శంకర్ రాజా ఈ మూవీని నిర్మించారు. ఈ మూవీ స్టోరీ శివ, సాయి అనే ఇద్దరు బ్యాచిలర్‌ల చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ జియో సినిమా (Jio Cinema) ఓటీటీలో 2024 ఏప్రిల్ 14న తమిళ నూతన సంవత్సరం సందర్భంగా నేరుగా విడుదలైంది.


స్టోరీలోకి వెళితే

శివ, సాయి తమ స్కూల్ రీయూనియన్‌లో ఒకరినొకరు కలుసుకుంటారు. బాల్యంలో వీరిద్దరూ ఎక్కువగా గొడవ పడుతూ ఉండేవాళ్లు. త్రిపురసుందరి అనే ఒక అమ్మాయి కోసం పోటీపడేవారు. శివ తల్లి స్కూల్ హెడ్‌మాస్టర్‌గా ఉంటుంది. ఆ ధైర్యంతో త్రిపురసుందరికి స్వీట్స్, గులాబీలను ఇస్తూ ఆమెను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు శివ. ఈ పోటీ ఫ్రెండ్స్ ఇద్దరి మధ్య దూరం పెంచుతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత శివ ఒక గైనకాలజిస్ట్‌గా పని చేస్తూ ఉంటాడు. లైఫ్ లో సెటిల్ అయినప్పటికీ పెళ్ళి సంబంధాల పట్ల అంతగా ఆసక్తి చూపించడు. చెన్నైలో ఆధునిక జీవనశైలిని ఆస్వాదిస్తూ, తరచూ డేటింగ్‌లో పాల్గొంటాడు. మరోవైపు సాయి సామాజికంగా కొంత అమాయకంగా ఉంటాడు. మహిళలతో ఎలా మాట్లాడాలో తెలియదు.

ఇప్పుడు రీయూనియన్‌లో వీళ్ళిద్దరూ కలిసిన తర్వాత, తమ పాత శత్రుత్వాన్ని పక్కనపెట్టి స్నేహితులుగా మారతారు. శివ, సాయికి మనుషులతో ఎలా ఉండాలో సలహాలు ఇస్తూ, అతన్ని తనలా మార్చడానికి ప్రయత్నిస్తాడు. ఆ తరువాత స్టోరీ ఒక రోజు అనూహ్య మలుపు తీసుకుంటుంది.  ఇద్దరూ సుందరి అలియాస్ సాండీ అనే చెఫ్‌ను కలుస్తారు. శివ, సాయి ఇద్దరూ సాండీ పట్ల ఆకర్షితులవుతారు. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీతో వారి పాత శతృత్వం మళ్లీ మొదటికి వస్తుంది. ఇంతలోనే సాండీ గతం గురించి ఒక ట్విస్ట్ బయటికి వస్తుంది. ఆ ట్విస్ట్ కి వీళ్ళిద్దరూ షాక్ అవుతారు. చివరికి వీళ్ళ లవ్ స్టోరీ ఎటు వెళ్తుంది ? తను ఎవర్ని ప్రేమిస్తుంది ? వీళ్ళు మంచి ఫ్రెండ్స్ గా ఉంటారా ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ రొమాంటిక్ కామెడీ మూవీని మిస్ కాకుండా చూడండి.

Read Also :  కొరియన్ సినిమా చరిత్రలోనే బెస్ట్ క్లైమాక్స్ మూవీ … ఏ ఓటీటీలో ఉందంటే ?

Related News

OTT Movie : బాడీ బిల్డర్ తో ఆ పాడు పని… ఈ నలుగురు ఆడవాళ్ళూ అరాచకం మావా… సింగిల్ గా చూడాల్సిన మూవీ

OTT Movie : రియల్ కల్ట్ క్రైమ్‌… మతం పేరుతో మతిపోగోట్టే పనులు… మర్డర్ మిస్టరీతో ఊహించని టర్న్

OTT Movie : గ్యాంగ్ స్టర్ గా సిల్వెస్టర్ స్టాలోన్… అల్టిమేట్ యాక్షన్ సీన్స్… యాక్షన్ ప్రియులకు పంగడే

OTT Movie : సూపర్ హీరోల బిడ్డను బలికోరే బ్రహ్మ రాక్షసి… కడుపులో ఉండగానే బీభత్సం… క్లైమాక్స్ డోంట్ మిస్

Sundarakanda OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన నారా రోహిత్‌ ‘సుందరకాండ’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!

OTT Movie : పెంచిన పెదనాన్న ఇంటిని తగలబెట్టే లేడీ కిలాడీ… అమ్మాయి కాదు మావా ఆడపులి… పిచ్చెక్కించే ట్విస్టులు

OTT Movie : మరో వ్యక్తితో భర్త దగ్గర అడ్డంగా దొరికిపోయే భార్య… అతనిచ్చే ట్విస్టుకు దిమాక్ కరాబ్ మావా

OTT Movie : కంటికి కన్పించిన అమ్మాయిని వదలకుండా అదే పాడు పని… ఈ సైకో ఇంత కరువులో ఉన్నాడేంటి భయ్యా ?

Big Stories

×