Brahmamudi serial today Episode: చెప్పినా వినకుండా ఇన్ని పూలు ఆర్డర్ చేశారు ఇప్పుడు మిగిలిపోయిన పూలు ఏం చేస్తారు అని కావ్య అడుగుతుంది. దీంతో అమ్మాయి రూంలోకి నడిచి వచ్చే దారిలో పూలు వేద్దామని రాజ్ చెప్తాడు. అలా పీఠాధిపతులకు, రాజకీయ నాయకులకు చేస్తారు అంటుంది కావ్య. దీంతో రాజ్ వెటకారంగా కాస్త రొమాంటిక్ ఫీల్ ఉండాలండి అంటాడు రాజ్. ఇప్పుడంతా రొమాంటిక్‌గా ఆలోచించి ఏం చేయాలో అని అడుగుతుంది కావ్య. అంటే ఒకరి మనసులో ఫీలింగ్స్ ఒకరు చెప్పుకోవాలి అంటాడు. దీంతో నా మనసులో ఏమీ లేదని కావ్య చెప్తుంది. దీంతో రాజ్ అబద్దం నా కళ్లలోకి సూటిగా చూసి చెప్పండి అంటాడు. కావ్య రాజ్ కళ్లల్లోకి చూస్తూ.. చూసే చెప్తున్నా.. ఏం లేదు.. అంటుంది. దీంత రాజ్ నా గురించి కూడా ఏమీ ఆలోచించడం లేదా మీరు అని అడుగుతాడు.
ఏం ఆలోచించాలి అని కావ్య అడగ్గానే.. నా మీద ఉన్న మీ ఒపీనియన్ ఏంటి అని అడుగుతాడు. ఏం లేదని కావ్య చెప్తుంది. అబద్దం మీ కళ్లు నాకేదో చెప్తున్నాయి అన అడగ్గానే. ఏం చెప్తున్నాయి అంటుంది కావ్య. మన మధ్య ఉన్న బంధాన్ని చెప్తున్నాయి. అంటూ రాజ్ ఫీల్ అవుతూ మాట్లాడుతుంటే.. కావ్య ఇబ్బంది పడుతుంది. ఇంతలో కావ్య, అప్పు పోలీస్ స్టేషన్ అంటూ వస్తారు. రాజ్ కోపంగా రేయ్ మీరు ఎప్పుడు వచ్చారురా అని అడుగుతాడు. మీరు కళ్లల్లోకి కళ్లు పెట్టి చూసుకుంటుంటే వచ్చాము అని చెప్తాడు. రాజ్ మరింత కోపంగా ఎందుకొచ్చారు. ముహూర్తానికి ఇంకా చాలా టైం ఉంది కదా..? అయినా ప్రైవసీ అనేది ఒకటుంది. అది గమనించుకోరా..? ఎంత సేపు మీ ఎమోషన్సే కానీ మా ఎమోషన్స్‌ను గుర్తించరా..? అంటూ తిడుతుంటే.. కళ్యాన్ అన్నయ్యా.. మీ ప్రస్టేషన్ గురించి తర్వాతైనా ఆలోచించుకోవచ్చు. ముందు మా పరిస్తితి ఏంటో తెలుసుకో అంటాడు.
దీంతో రాజ్ అసలే చిరాకులో ఉన్నాను చిటికెలో చెప్పు అంటాడు. దీంతో చార్లెస్ గాడు తప్పించుకున్న విషయం సీఐ ఇచ్చిన వార్నింగ్ గురించి చెప్తారు అప్పు, కళ్యాణ్. దీంతో రాజ్ బాగా ఆలోచించి మిమ్మల్ని బ్యాక్ డోర్ నుంచి బయటకు పంపిస్తాను. మీ ప్లేస్‌లో నేను కళావతి గారు ఇక్కడ రూంలో ఉంటాము అని చెప్తాడు. దీంతో మనం ఇక్కడ ఎందుకుండాలి అని కావ్య అడుగుతుంది. వాళ్లు రూంలో లేకపోతే ఎవరో ఒకరు వాళ్ల ప్లేస్‌లో ఉండాలి కదా అని చెప్తాడు రాజ్. లేదు చిన్నత్తయ్యను మోసం చేయలేము.. నేను అత్తయ్యను కన్వీన్స్ చేస్తాను అంటుంది. ఆవిడ కాకపోతే ఎలా అంటూ రాజ్ ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆలోచిద్దామని కావ్య చెప్తుండగానే.. ధాన్యలక్ష్మీ వచ్చి కళ్యాణ్‌ను పిలుస్తుంది. అప్పు, కళ్యాణ్ బయటకు వెళ్లిపోతారు.
తర్వాత అప్పు, కళ్యాణ్‌లను అందరూ కలిసి రూంలోకి పంపిస్తారు. రూంలోకి వెళ్లిన అప్పు సారీ కూచి అంటుంది. దీంతో ఏమైంది పొట్టి ఇప్పుడెందుకు సారీ చెప్తున్నావు అని అడుగుతాడు. సారీ కూచి ఈ రోజు సంతోషంగా మన ఫస్ట్ నైట్ జరగాలి కానీ నా వల్ల నీకు ఆ సంతోషమే లేకుండా పోయింది. అనవసరంగా నిన్ను టెన్షన్ పెడుతున్నాను అనగానే కళ్యాణ్ కోపంగా ఎప్పటి నుంచి నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు. నా ప్రాబ్లమ్ నీ ప్రాబ్లమ్ అంటూ వేరు వేరుగా ఆలోచించడం ఎప్పటి నుంచి మొదలుపెట్టావు అంటున్నాను. అది కాదు కూచి అత్తయ్య గారు చేప్పినట్టు నేను ఈ జాబ్ చేయకుండా ఉంటే ఇప్పుడు ఈ టెన్షన్ వచ్చేది కాదు కదా..? ఆవిడ మాట వినకుండా తప్పు చేశానా అనిపిస్తుంది అని అప్పు అనగానే..
అవును తప్పు చేస్తున్నావు.. ఇప్పుడు ఇలా ఆలోచిస్తూ తప్పు చేస్తున్నావు.. పోలీస్ అవడం నీ కల దానికోసం నువ్వు నేను ఎంత కష్టపడ్డామో మర్చిపోయాయా? ఈ ఫస్ట్ నైట్ ఇప్పుడు కాకపోతే రేపు పెట్టుకుంటాం. కానీ జాబ్ అనేది పోతే లైఫ్‌లాంగ్ బాధపడతాం. అప్పుడు నువ్వు ఇంట్లో కూర్చోవాలి. అది నీకు ఇష్టమేనా..? అంటూ కళ్యాన్ ప్రశ్నిస్తాడు. దీంతో అప్పు థాంక్స్ కూచి మా అమ్మ కూడా నన్ను ఇంతలా అర్థం చేసుకోలేదు అంటూ హగ్ చేసుకుంటుంది. ఇంతలో రాజ్, కావ్య వస్తారు. మేమేం చూడలేదు అంటారు.
మీరు అనుకున్నంతగా ఇక్కడేం జరగలేదు కానీ రండి అంటాడు కళ్యాణ్. రాజ్, కావ్య లోపలికి రాగానే.. అప్పు, కళ్యాణ్ వెనక డోర్ నుంచి బయటకు వెళ్తారు. తర్వాత బట్టలు మార్చుకోవాలని కావ్య రూంలోకి వెళ్లి నగలు, బట్టలు అక్కడ పెట్టి వెళ్లిపోదాం అని చెప్తుంది అప్పు. సరేనని ఇద్దరూ కావ్య రూంలోకి వెళ్తారు. వెనకే ఫాలో అయిన రాహుల్ వెతకబోయిన తీగ కాళ్లకు తగిలినట్టు ఇప్పుడు నగలు ఇక్కడ కొట్టేస్తే అప్పు ఎవ్వరికీ చెప్పుకోలేదు అనుకుంటాడు. మరోవైపు కళ్యాణ్, అప్పు డ్రెస్ చేంజ్ చేసుకుని బయటకు వెళ్లి కారు ఎక్కుతుంటే.. ధాన్యలక్ష్మీ చూస్తుంది. కళ్యాణ్ లా ఉన్నాడేంటి..? అనుకుంటుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?