BigTV English
Advertisement

OTT Movie : సెక్యూరిటీ గార్డ్ కి సూపర్ నేచురల్ పవర్ వస్తే … అడ్డొచ్చిన అందరినీ దుమ్ము దులిపేశాడు

OTT Movie : సెక్యూరిటీ గార్డ్ కి సూపర్ నేచురల్ పవర్ వస్తే … అడ్డొచ్చిన అందరినీ దుమ్ము దులిపేశాడు

OTT Movie : సినిమాలకు, వెబ్ సిరీస్ లకు ఓటిటి ప్లాట్ ఫామ్ అడ్డాగా మారింది. వీటిలో ఫాంటసీ సినిమాలను ప్రేక్షకులు బాగా ఇష్టపడతారు. అందులోనూ కొరియన్ సినిమాలకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో హీరోకి సూపర్ పవర్ వస్తాయి. ఆ పవర్స్ తో హీరో చేసే విన్యాసాలతో స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో

ఈ కొరియన్ ఫాంటసీ మూవీ పేరు ‘సైకోకినిసిస్’ (Psychokinesis). ఈ మూవీకి యెయోన్ సాంగ్-హో దర్శకత్వం వహించారు. ఈ కొరియా సూపర్ హీరో మూవీలో ర్యూ సెంగ్-ర్యోంగ్, షిమ్ యున్-క్యుంగ్, పార్క్ జియోంగ్-మిన్, కిమ్ మిన్-జే, జంగ్ యు-మి ప్రధాన పాత్రలు పోషించారు. 2016లో వచ్చిన ట్రైన్ టు బుసాన్ యాక్షన్ మూవీ తర్వాత దర్శకుడు యెయోన్ సాంగ్-హో తీసిన రెండవ యాక్షన్ మూవీ ఇది. ఈ  కొరియన్ సూపర్ హీరో మూవీ ఒక బ్యాంక్ సెక్యూరిటీ గార్డు చుట్టూ తిరుగుతుంది. ఉల్కాపాతం నీటిని తాగిన తర్వాత హీరోకి టెలికైనటిక్ సూపర్ పవర్స్ వస్తాయి. కుమార్తె, ఆమె పొరుగువారిని రక్షించడానికి ఆ పవర్స్ ను ఉపయోగిస్తాడు. ‘సైకోకినిసిస్’ జనవరి 31, 2018న దక్షిణ కొరియా థియేటర్‌లలో 2D, స్క్రీన్‌ఎక్స్ ఫార్మాట్‌లలో విడుదలైంది. ఈ కొరియన్ ఫాంటసీ మూవీ ఏప్రిల్ 25, 2018 నుండి నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో అందుబాటులోకి వచ్చింది.


స్టోరీ లోకి వెళితే

భార్య పిల్లలు ఉండగానే హీరో ఏదో సాధించాలని బయటికి వెళ్లిపోతాడు. ఏమీ సాధించలేక ఒకచోట సెక్యూరిటీ గార్డ్ గా పని చేసుకుంటూ ఉంటాడు. అయితే అక్కడ చిన్న చిన్న దొంగతనాలు కూడా చేస్తాడు. ఇలా ఉంటే మరోవైపు హీరో భార్య ఉండే ప్రాంతంలో ఒక పెద్ద కంపెనీ కుట్రకు పాల్పడుతుంది. అక్కడ ఉన్న షాపులను తొలగించి షాపింగ్ మాల్ కట్టాలనుకుంటుంది. ఈ గొడవల్లో హీరోయిన్ చనిపోతుంది. ఈ విషయం తెలుసుకున్న హీరో అక్కడికి బయలుదేరుతాడు. ఇంతలోనే అంతరిక్షం నుంచి ఒక పదార్థం నీటిలో పడుతుంది. హీరోకి దాహంగా ఉండడంతో ఆ నీటిని తాగుతాడు. అప్పటినుంచి అతనికి సూపర్ పవర్స్ వస్తాయి. ఇంటికి వచ్చిన తరువాత కూతురితో నీకు అండగా ఉంటానని చెప్తాడు. అతని కూతురు అతన్ని తిరస్కరిస్తుంది. ఆ తర్వాత అక్కడ ఉన్న షాపులను ఖాళీ చేయించే వాళ్ళను హీరో చావగొడతాడు. అతనికి ఉన్న శక్తులను చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఇక చేసేదేం లేక అతన్ని తెలివిగా ఒక కేసులో ఇరికిస్తారు. హీరోని దొంగతనం కేసులో జైలుకు తీసుకెళ్తారు. ఆ తర్వాత ఆ కంపెనీ అక్కడ ఉన్న వాళ్ళందరినీ బెదరగొడుతూ ఉంటారు. దొరికిన వాడిని దొరికినట్టే కొడతారు. చివరికి హీరో వాళ్ళను కాపాడుతాడా? కూతురు తండ్రితో కలిసి హ్యాపీగా ఉంటుందా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘సైకోకినిసిస్’ (Psychokinesis) అనే ఈ కొరియన్ మూవీని చూడండి.

Tags

Related News

Avihitham: పితృస్వామ్య రాజ్యంలో బాధితులుగా కూతుర్లు.. ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం..!

K Ramp OTT : ఓటీటీ డేట్ ను లాక్ చేసుకున్న ‘కే ర్యాంప్’.. స్ట్రీమింగ్ అప్పటినుంచే..?

OTT Movie : ఒంటిపై నూలు పోగు లేకుండా భగభగ మండే మంటల్లోకి పరుగు… ఇదెక్కడి దిక్కుమాలిన పని సామీ

OTT Movie : మిస్టీరియస్ మనిషితో ముసలావిడ రొమాన్స్… ఇలాంటి సినిమాను ఎక్కడా చూసుండరు భయ్యా

OTT Movie : భర్తకు బాయ్ ఫ్రెండ్ తో అడ్డంగా దొరికిపోయే భార్య… ఐఎండీబీలో రేటింగ్ 8… క్రైమ్ మూవీ లవర్స్ కు పండగే

OTT Movie : IMDb లో 9.7 రేటింగ్… స్కూల్ పుస్తకాల్లో స్కామ్… ఈ తండ్రి గట్స్ కు దండం పెట్టాల్సిందే భయ్యా

OTT Movie : బ్రోతల్ హౌస్ నుంచి తప్పించుకుని 17 ఏళ్ల అమ్మాయితో ఆ పాడు పనులు… ఈ మూవీ స్ట్రిక్ట్లీ సింగిల్స్ కు మాత్రమే

OTT Movie : స్కూల్ పాప డ్రెస్సుకు బటన్స్ పెట్టే మాస్టార్… డోర్ వేస్తానని చెప్పి ఆమె చేసే పనికి ఫ్యూజులు అవుట్

Big Stories

×