OTT Movie : చిన్నపిల్లలు, వృద్ధులు ఒక్కరే అని చెప్తారు. చిన్నపిల్లల్ని తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో, అదేవిధంగా వృద్ధాప్యంలో తల్లిదండ్రులని పిల్లలు కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలి. వృద్ధాప్యంలో వాళ్లు కోరుకునేది ఒక తోడు మాత్రమే. వాళ్లకు తోడుగా పిల్లలే ఉంటే చాలా అదృష్టవంతులు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో మతిమరుపు ఉన్న ఒక వృద్ధుడు, కూతురి కలలకు అడ్డుగా ఉంటాడు. తండ్రి కూతుర్ల మధ్య జరిగే ఈ స్టోరీ కంటనీరు పెట్టిస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ సైకలాజికల్ హాలీవుడ్ మూవీ పేరు ‘ది ఫాదర్’ (The father). 2020లో విడుదలైన ఈ సైకలాజికల్ డ్రామా మూవీకి ఫ్లోరియన్ జెల్లర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో ఆంథోనీ హాప్‌కిన్స్ మతిమరుపు వ్యాధి తో జీవిస్తున్న ఆక్టోజెనేరియన్ వెల్ష్ అనే వ్యక్తిగా నటించారు. ఒలివియా కోల్మన్, మార్క్ గాటిస్, ఇమోజెన్ పూట్స్, రూఫస్ సెవెల్ మరియు ఒలివియా విలియమ్స్ కూడా ఇందులో నటించారు. 27 జనవరి 2020న సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఫాదర్ ప్రీమియర్ ను ప్రదర్శించారు. ఇది ఫ్రాన్స్‌లో 26 మే 2021న, UKలో 11 జూన్ 2021న విడుదలైంది. ఈ మూవీ $6 మిలియన్ల బడ్జెట్‌తో తెరకెక్కగా, ప్రపంచవ్యాప్తంగా $36 మిలియన్లు వసూలు చేసింది. హాప్‌కిన్స్ నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 93వ అకాడమీ అవార్డ్స్‌లో, ది ఫాదర్ ఉత్తమ చిత్రంతో సహా ఆరు నామినేషన్లను అందుకుంది. హాప్కిన్స్ ఉత్తమ నటుడు, హాంప్టన్ ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే అవార్డులను గెలుచుకున్నారు. అప్పటి నుండి 21వ శతాబ్దపు అత్యుత్తమ చిత్రాలలో ఒకటిగా ఈ మూవీ నిలిచింది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
హీరోయిన్ తన తండ్రితో కలసి జీవిస్తూ ఉంటుంది. తండ్రికి మతిమరుపు ఎక్కువగా ఉంటుంది. కొద్ది నిమిషాల్లోనే జరిగింది మరిచిపోతూ ఉంటాడు. తనని చూసుకోవడానికి ఒక కేటాక్ అన్ని అపాయింట్ చేస్తుంది కూతురు. అయితే ఆమెను దొంగ అంటూ నిందిస్తాడు. వాచి మరచిపోయి దొంగలించింది అనుకొని తిడుతూ ఉంటాడు. అలా కొంతమంది కేర్ టేకర్ అని కూతురు పెట్టిన ఎక్కువ రోజులు ఉండరు. అయితే కూతురు మాత్రం తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలనుకుంటుంది. ఇదివరకే ఆమెకు విడాకులు కూడా జరిగి ఉంటాయి. ఓ పక్క తండ్రి మరోపక్క కాబోయే భర్త ఈ రెండిటి మధ్య హీరోయిన్ నలిగిపోతూ ఉంటుంది. తండ్రిని చూసుకుంటూనే జీవితం గడిచిపోతుందని బాధపడుతుంది. చివరికి తండ్రిని ఒక వృద్ధాశ్రమంలో చేర్పించాలనుకుంటుంది. చివరికి హీరోయిన్ తండ్రిని ఆశ్రమంలో జాయిన్ చేస్తుందా? కొత్త జీవితాన్ని వెతుక్కుంటుందా? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే, అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ ఫీల్ గుడ్ మూవీని ఒక్కసారైనా చూడండి.