E-Paper
Advertisement

పిఠాపురం జనసేన కమిటీపై పవన్ ఫైర్.. అన్నీ చక్కదిద్దుతానని హెచ్చరిక!

పిఠాపురం జనసేన కమిటీపై పవన్ ఫైర్.. అన్నీ చక్కదిద్దుతానని హెచ్చరిక!
Advertisement

Pawan Kalyan: శస్త్రచికిత్స తర్వాత కోలుకున్న పవన్ కల్యాణ్ ఇప్పుడు పార్టీ బలోపేతంపై ఫుల్ ఫోకస్ పెట్టారు. పిఠాపురం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం రెండ్రోజుల పాటు పర్యటించారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు.. స్థానిక సంస్థల ఎన్నికల ముందు పార్టీ బలోపేతంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. పవన్ మొదటిరోజు ఎఫ్‌కే పాలెం గ్రామంలోని చెరువు ఆధునీకరణ పనులను ప్రారంభించారు. అలాగే పిఠాపురంలోని పాదగయ పుణ్యక్షేత్రం దగ్గర పీటికాపుర వనాన్ని ప్రారంభించారు. రెండో రోజు పాదగయా క్షేత్రంతోపాటు సీతారామ ఆలయంలో పూజలు చేశారు. యూ కొత్తపల్లి, తాటిపర్తి గ్రామాల్లో డెవలప్‌మెంట్స్‌ను స్టార్ట్ చేశారు.

పవన్ దిశానిర్దేశం..

ఇక ఈ పర్యటనలో పార్టీ బలోపేతంపై దృష్టిసారించారు జనసేనాని పవన్ కల్యాణ్. ఇందులో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల ముందు పలువురు ఇతర పార్టీల నాయకులను కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. కాకినాడలో లోకల్ బాడీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు పవన్ దిశానిర్దేశం చేశారు. మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు. అయితే, నియోజకవర్గంలో జనసేన కమిటీ తీరుపై పవన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు కలిసి పనిచేసిన నాయకులు.. ఇప్పుడెందుకు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. మూడు, నాలుగు నెలల్లో పరిస్థితిని చక్కదిద్దుతానన్నారు. పిఠాపురాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని.. ఎవరూ చేయలేనంత డెవలప్‌ చేసి చూపిస్తానన్నారు పవన్ కల్యాణ్‌.

Advertisement

Also read: జహీర్ ఖాన్ ను మధ్యలోనే గెంటేస్తారు…CSK జట్టుపై అబ్దుల్ రజాక్ సంచలనం ?

గౌరవానికి భంగం..

కూటమి బలంగా కొనసాగాలని పార్టీనేతలకు స్పష్టంగా చెప్పారు. టీడీపీ–బీజేపీ–జనసేన కలిసి పనిచేయాలని, అయితే జనసేనకు దక్కాల్సిన గౌరవానికి భంగం కలగకూడదన్నారు. స్థానిక ఎన్నికల్లో క్షేత్రస్థాయి బలాన్ని అంచనా వేసి ముందుకు వెళ్లాలని పార్టీకి సూచించారు. నియోజకవర్గాల వారీగా రాజకీయ, సామాజిక పరిస్థితులను పరిశీలించి అభ్యర్థులను నిర్ణయించాలని దిశానిర్దేశం చేశారు.

Advertisement

Also Read: దసరా పండుగ కంటే ముందే.. కాంగ్రెస్ నాయకులకు గుడ్‌న్యూస్..?

Tags

Related News

దసరా పండుగ కంటే ముందే.. కాంగ్రెస్ నాయకులకు గుడ్‌న్యూస్..?

చిలకపచ్చ రంగు.. ఎర్రటి బార్డర్.. ఈసారి బతుకమ్మ చీరల లుక్ ఇదే!

కేసీఆర్ ఫామ్ హౌస్ భూములపై సీఎం రేవంత్ రహస్య సర్వే.. ఇక నెక్ట్స్ ప్లాన్ అదేనా..?

నమ్మి గెలిపిస్తే.. ముఖం చాటేశాడు! సిరిసిల్లలో ఇప్పటి వరకు 15 సార్లు మాత్రమే పర్యటించిన కేటీఆర్‌..!

ఖైరతాబాద్‌లో హీటెక్కిన పాలిటిక్స్.. బీజేపీ టికెట్ కోసం ముమ్మర కసరత్తు!

వరి వద్దు.. ఈ సర్కార్‌ నోటి వెంటా ఇప్పుడిక అదే మాట..! కరువు ప్రభావం.. సాగునీటికి కటకట..!

కాసాని జ్ఞానేశ్వర్ రీ-ఎంట్రీ.. నెక్ట్స్ పొలిటికల్ ప్లాన్ ఇదేనా?

Big Stories

Advertisement
×