E-Paper
Advertisement

Abhishek Sharma 100 Sixes: 100 సిక్సర్లు కొట్టిన అభిషేక్ శ‌ర్మ‌..SRH కెప్టెన్ గా కావ్య పాప ఆఫ‌ర్ ?

Abhishek Sharma 100 Sixes: 100 సిక్సర్లు కొట్టిన అభిషేక్ శ‌ర్మ‌..SRH కెప్టెన్ గా కావ్య పాప ఆఫ‌ర్ ?
Advertisement

Abhishek Sharma 100 Sixes:  టీమిండియా యంగ్ క్రికెటర్ అభిషేక్ శర్మ ( Abhishek Sharma) సంచలన రికార్డు క్రియేట్ చేశాడు. ఈ క్యాలెండర్ ఇయర్ లో ఏకంగా 100 సిక్సర్లు భారీ చరిత్ర సృష్టించాడు. 2025 జనవరి నుంచి ఈ డిసెంబర్ ఏడవ తేదీ వరకు మొత్తం 101 సిక్సర్లు బాదాడు అభిషేక్ శర్మ. దీంతో ఒకే క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన మొదటి ఇండియన్ బ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు. ఈ నేపథ్యంలోనే అభిషేక్ శర్మ (Abhishek Sharma 100 Sixes)పేరు సోషల్ మీడియాలో మారు మోగుతోంది.

Also Read: Hardik Pandya: ఏంట్రా ఈ అరాచ‌కం..జిమ్ లో వ‌ర్కౌట్స్ కాదు, పాండ్యా-మహికా శర్మ ముద్దులాట‌

100 సిక్సర్లు బాదిన అభిషేక్ శర్మ

Advertisement

సన్ రైజర్స్ డేంజర్ ఆటగాడు, టీమిండియా టి20 ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma ) గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అతడు గ్రౌండ్ లో బ్యాటింగ్ కు దిగాడు అంటే చాలు, ప్రత్యర్థి బౌలర్లు చుక్కలు చూస్తారు. అతనికి బౌలింగ్ వేయాలన్నా కూడా గజ గజ వణికి పోతారు. ప్రీమియర్ బౌలర్ అని చెప్పుకుని తిరిగే షాహిన్ ఆఫ్రిది బౌలింగ్ లో కూడా మొదటి బంతికే సిక్సర్ కొట్టగల ధీరుడు అభిషేక్ శర్మ. ఆసియా క‌ప్ 2025 టోర్న‌మెంట్ ఇప్ప‌టికే ఈ విష‌యం రుజువు అయింది. అయితే అలాంటి అభిషేక్ శర్మ తాజాగా సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ 2025 డిసెంబర్ 7వ తేదీ వరకు 101 సిక్సర్లు కొట్టిన భారత తొలి క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు.

ఇందులో ఐపీఎల్ అలాగే టి20, ఇతర దేశవాళీ టోర్నమెంట్లు కూడా ఉన్నాయి. ఈ అన్నిటిలో కలిపి ఈ సంవత్సరం 101 సిక్సర్లు బాదేశాడు. ఇక డిసెంబర్ 9వ తేదీ నుంచి దక్షిణాఫ్రికాతో ఐదు టి20 సిరీస్ ఉండనుంది. ఆ టోర్నమెంట్ లో కూడా అతడు భయంకరమైన బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఉంది. అంటే డిసెంబర్ 31 వరకు సిక్సర్ల సంఖ్య మరింత పెంచుకునే ఛాన్స్ అభిషేక్ శర్మకు ఉంది. ఇక అదే సమయంలో 2024 సంవత్సరంలో మొత్తం 87 సిక్సర్లు కొట్టాడు అభిషేక్ శర్మ. ఈ 2025లో సెంచరీ సిక్సర్లు కొట్టేశాడు.

SRH కెప్టెన్ గా కావ్య పాప ఆఫ‌ర్ ?

Advertisement

ఐపీఎల్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య పాప సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వచ్చే సీజన్ లో కెప్టెన్ మార్పు చేసేందుకు ఆమె సిద్ధమవుతున్నారట. ఇండియన్ ప్లేయర్ కు కెప్టెన్సీ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. ఇందులో భాగంగానే డేంజర్ కుర్రాడు అభిషేక్ శర్మకు సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్యాట్ క‌మిన్స్‌ ను పక్కకు పెట్టి ఈ నిర్ణయం తీసుకున్నారట. ఈ మేరకు జట్టు సభ్యులతో ఇప్పటికే కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడినట్లు తెలుస్తోంది.

ALSO READ: KL Rahul: స‌ల‌హాలు ఇచ్చిన కోహ్లీ ప‌రువు తీసిన రాహుల్‌..ప‌క్క‌కు వెళ్లి కూర్చో అంటూ 

 

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×