BigTV English

OTT Movie : అప్కమింగ్ హీరోయిన్ పై బ్లాక్ మ్యాజిక్… లవర్ ను, డైరెక్టర్ ను కూడా వదలకుండా… వణికించే హర్రర్ సీన్స్

OTT Movie : అప్కమింగ్ హీరోయిన్ పై బ్లాక్ మ్యాజిక్… లవర్ ను, డైరెక్టర్ ను కూడా వదలకుండా… వణికించే హర్రర్ సీన్స్
Advertisement

OTT Movie : దెయ్యాలతో భయపెట్టే హర్రర్ సినిమాలు ఒక ఎత్తైతే, అందులోనూ చేతబడితో గూస్ బంప్స్ తెప్పించే సినిమాలు మరికొన్ని. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ మాత్రం సినిమా ఇండస్ట్రి గురించి ఉండడం ఆసక్తికరం. ఒక అప్ కమింగ్ హీరోయిన్ పాపులర్ అవుతుందనే జెలసీతో, అప్పటికే ఇండస్ట్రీలో టాప్ లో కొనసాగుతున్న మరో హీరోయిన్ చేతబడి చేయిస్తుంది. యూనిక్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ బాలీవుడ్ సూపర్‌ న్యాచురల్ హారర్-థ్రిల్లర్ సినిమా ఒక సినీ నటి జీవితంలో జరిగే భయానక సంఘటనలు, బ్లాక్ మ్యాజిక్, ఉత్కంఠభరితమైన ట్విస్ట్‌లతో అదరగొడుతుంది. ఈ మూవీ గురించి వివరాలపై ఓ లుక్కేద్దాం పదండి.


కథలోకి వెళ్తే…
కథ షనాయా (బిపాషా బసు) అనే ఒక ప్రముఖ సినీ నటి చుట్టూ తిరుగుతుంది. ఆమె ఫామ్ కోల్పోతున్న సమయంలో, అప్కమింగ్ హీరోయిన్ సంజనా (ఈషా గుప్తా) విజయం పట్ల తీవ్ర అసూయకు గురవుతుంది. షనాయా స్టార్‌డమ్‌ను కోల్పోతానేమో అనే భయంతో, తన కెరీర్‌ తిరిగి పుంజుకోవడానికి, అలాగే సంజనాను నాశనం చేయడానికి బ్లాక్ మ్యాజిక్‌ను ఆశ్రయిస్తుంది. ఆమె ఒక దుష్ట తాంత్రికుడు (మనీష్ చౌదరి) సహాయంతో బ్లాక్ మ్యాజిక్ చేయిస్తుంది.

సంజనాపై భయంకరమైన సూపర్‌ న్యాచురల్ శక్తులను ఉసిగొల్పుతారు. ఈ ప్రక్రియలో షనాయా తన ప్రేమికుడు ఆదిత్య (ఇమ్రాన్ హష్మి), ఒక సక్సెస్ ఫుల్ దర్శకుడిపై కూడా చేతబడిని ఉపయోగిస్తుంది. ఎందుకంటే అతను సంజనాతో సన్నిహితంగా ఉండటం ఆమెకు ఏమాత్రం నచ్చదు. బ్లాక్ మ్యాజిక్ భయంకర పరిణామాలు, దెయ్యాల ఆవాహన, అసూయ, ప్రతీకారంతో షనాయా తనపై తానే కంట్రోల్ కోల్పోతుంది. మరోవైపు సంజనా తనపై జరుగుతున్న అతీంద్రియ శక్తుల దాడులను ఎదుర్కొంటూ, ఆదిత్యతో కలిసి ఈ బ్లాక్ మ్యాజిక్ నుండి బయటపడే ప్రయత్నం చేస్తుంది. షాకింగ్ ట్విస్టులతో ఆకట్టుకునే ఈ సినిమా క్లైమాక్స్ ఏంటి? సంజనా చివరికి ఆ చేతబడి నుంచి ఎలా బయట పడింది? అనే విషయాలను సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.


Read Also : 8 మంది ఊచకోత… దశాబ్దం క్రితం జరిగిన దారుణం… గుండె జబ్బులు ఉన్నవాళ్ళు చూడకూడని కొరియన్ హారర్ థ్రిల్లర్

పెద్దలకు మాత్రమే ఈ సినిమా
‘రాజ్’ సిరీస్‌లో మూడవ చిత్రమైన ఈ సినిమా బ్లాక్ మ్యాజిక్, రివేంజ్ థీమ్‌లతో తెరకెక్కిన ఒక డార్క్ థ్రిల్లర్. ‘రాజ్ 3 : ది థర్డ్ డైమెన్షన్’ (Raaz 3) విక్రమ్ భట్ దర్శకత్వంలో తెరకెక్కిన బాలీవుడ్ సూపర్‌ న్యాచురల్ హారర్-థ్రిల్లర్. బిపాషా బసు, ఇమ్రాన్ హష్మి, ఈషా గుప్తా, మనీష్ చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా A రేటింగ్‌తో రిలీజ్ అయ్యింది. హారర్ సీన్స్ కారణంగానే అనుకోండి. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), జీ5 (Zee5)లో అనే రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

OTT Movie : బాయ్ ఫ్రెండ్ తో ఒంటరిగా గడిపే అమ్మాయిలే ఈ కిల్లర్ టార్గెట్… వెన్నులో వణుకు పుట్టించే థ్రిల్లర్ మావా

OTT Movie : వరుసగా అమ్మాయిలు మిస్సింగ్… ప్రొఫెసర్ ముసుగులో సైకో వల… సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : 8 ఏళ్ల తరువాత థియేటర్లలోకి… నెలలోపే ఓటీటీలోకి 170 కోట్ల హిలేరియస్ కోర్ట్ రూమ్ డ్రామా

OTT Movie : జంప్ అవ్వడానికి ట్రై చేసి అడ్డంగా బుక్… ఇష్టం లేకుండానే ఆ పని… తెలుగు మూవీనే మావా

OTT Movie : అనుకున్న దానికంటే ముందుగానే ఓటీటీలోకి ‘కాంతారా చాఫ్టర్ 1’… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?

OTT Movie : ధృవ్ విక్రమ్ ‘బైసన్’కు ఓటీటీ ఫిక్స్… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

OTT Movie : దీపావళికి ఓటీటీలో టపాసుల్లాంటి మూవీస్… వీకెండ్లో ఈ సినిమాలు, సిరీస్ లు డోంట్ మిస్

OG OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న ఓజీ… ఎప్పుడంటే!

Big Stories

×