OTT Movie : ఇపుడు ఎంటర్టైన్మెంట్ కోసం ఓటీటీ వైపు చూస్తున్నారు ప్రేక్షకులు. థియేటర్లకు వెళ్లకుండా, నచ్చిన సినిమాలను ఓటీటీ లో చూడటానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వీటిలో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఎక్కువగా చూస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఒక హత్య చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాలో ప్రతీ సీన్ సస్పెన్స్ తో పిచ్చెక్కిస్తుంది. చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో
ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ‘రజని’ (Rajni). 2023 లో వచ్చిన ఈ సినిమాకి వినిల్ స్కారియా వర్ఘీస్ దర్శకత్వం వహించారు. ఇందులో కాళిదాస్ జయరామ్, నమితా ప్రమోద్, రెబా మోనికా జాన్, సైజు కురుప్, అశ్విన్ కుమార్, కరుణాకరన్, షాన్ రోమీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా మలయాళంలో Rajni గా, తమిళంలో Aval Peyar Rajni గా 2023 డిసెంబర్ 8న థియేటర్లలో విడుదలైంది. 2024 జనవరి 12 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ స్టోరీ చెన్నైలో జరిగే ఒక హత్య చుట్టూ తిరుగుతుంది. 2 గంటల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDB లో 5.4/10 రేటింగ్ ఉంది.
స్టోరీలోకి వెళితే
ఈ స్టోరీ చెన్నైలో జరుగుతుంది. ఇక్కడ నవీన్, అతని సోదరి గౌరి ఒక హత్య కేసులో చిక్కుకుంటారు. గౌరి భర్త అభిజిత్ ఒక రోజు రాత్రి, విచిత్ర పరిస్థితుల్లో హత్యకు గురవుతాడు. అభిజిత్,గౌరి, నవీన్ కలసి ఒక స్నేహితుడి ఇంటిలో డిన్నర్ చేసి తిరిగి వస్తుండగా, వీళ్ళ కారు రోడ్డు మధ్యలో ఆగిపోతుంది. అభిజిత్ పెట్రోల్ కొనడానికి బయటకు వెళ్తాడు, కానీ గౌరి కారులో నిద్రపోతుంటుంది. ఆమె మెలుకువలోకి వచ్చినప్పుడు, కారు పైన ఎవరో దాడి చేస్తున్న శబ్దం వినిపిస్తుంది. ఇంతలోనే అభిజిత్ హత్యకు గురవుతాడు. ఈ ఘటన వల్ల గౌరి భయాందోళనలకు గురవుతుంది. పోలీసులు ఈ హత్య వెనుక ఏదో కుట్ర ఉందని అనుమానిస్తారు. ఈ హత్యకు అభిజిత్‌తో ఒక వివాహేతర సంబంధం కారణమని ఊహిస్తారు. కానీ నవీన్ ఈ వాదనను తోసిపుచ్చి, అసలు నిజాన్ని కనిపెట్టేందుకు స్వయంగా దర్యాప్తు చేయడం ప్రారంభిస్తాడు.
నవీన్ స్థానిక పోలీసుల సహాయంతో, CCTV ఫుటేజ్, ఇతర ఆధారాలను పరిశీలిస్తాడు. ఇది అతన్ని చెన్నై శివార్లలోని చీకటి వీధుల్లోకి తీసుకెళ్తుంది. నవీన్ ఈ దర్యాప్తు చేస్తున్నప్పుడు, తన సోదరి జీవితం కూడా ప్రమాదంలో ఉందని తెలుసుకుంటాడు. ఈ హత్య అనుకోకుండా జరిగింది కాదని, దీని వెనుక ఒక కుట్ర ఉందని గ్రహిస్తాడు. ఇప్పుడు స్టోరీ రజని అనే అమ్మాయి వైపు తిరుగుతుంది. రజని అనే అమ్మాయి రజనీకాంత్ అభిమానిగా ఉంటుంది. ఆమె గతంలో జరిగిన ఒక సంఘటన కారణంగా, అబ్బాయిగా మారి ఈ హత్యలను చేస్తుంది. నవీన్ ఈ దర్యాప్తులో అనేక ప్రమాదాలను ఎదుర్కుంటాడు. ఇక్కడ అతను రజని గతాన్ని, ఆమె హత్యల వెనుక ఉన్న ఉద్దేశాలను కనిపెడతాడు. చివరికి అభిజిత్ ను చంపింది ఎవరు ? రజని అబ్బాయిగా ఎందుకు మారుతుంది ? ఆమె గతం ఏమిటి ? అభిజిత్ కి, రజనికి ఉన్న సంబంధం ఏమిటి ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : ఇది అమ్మాయిల కథ కాదు మావా అరాచకం … ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చూడాల్సిన మూవీ