Vizag Beach: విశాఖ సిటీకి బీచ్ రోడ్డు అద్భుతమైన ఆభరణం. ఓ వైపు పచ్చని కొండలు.. మరోవైపు కనుచూపు మేరా సాగర తీరం మధ్య తరలి వచ్చిన లక్షలాది మంది జనం యోగాసనాలు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు దక్కించుకుంది. 3 లక్షల 19 మంది ఒకేసారి యోగాలో పాల్గొన్నారు. దీనికి సంబంధించి అద్భుతమైన వీడియో విడుదల చేసింది టీడీపీ.
జూన్ 21న విశాఖలో యోగా గిన్నీస్ రికార్డులకు ఎక్కింది. ఒకేసారి ఏకంగా 3 లక్షల మందికి పైగానే యోగాలో పాల్గొన్నారు. విశాఖలోని సాగరతీరంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా హాజరయ్యారు. యోగా దినోత్సవరం సందర్భంగా అంతకు రెండు వారాల నుంచి ఆ కార్యక్రమంలో అధికారులు నిమగ్నమయ్యారు.
ఎంతవరకు యోగా కార్యక్రమానికి వస్తున్నారో తెలుసుకుని ప్లాన్ ప్రకారం నిర్వహించారు. అది సక్సెస్ అయ్యారు. అయితే ఆ రోజు కేవలం ఆర్‌కె బీచ్‌లో జరిగిన యోగా వీడియో మాత్రమే బయటకు వచ్చింది. తాజాగా 30.16 కిలోమీటర్ల మేరా యోగా కార్యక్రమం జరిగింది. రామకృష్ణా బీచ్ నుంచి భోగాపురం వరకు యోగాని నిర్వహించారు.
మొత్తంగా 3.19 లక్షల మంది ఒకేసారి యోగా చేశారు ప్రజలు. సాగరతీరంలో ఇదొక అద్భుత దృశ్యంగా వర్ణిస్తున్నారు. దీనికి సంబంధించి డ్రోన్ వీడియో విడుదల చేసింది తెలుగుదేశం పార్టీ. ఇంతవరకు బాగానే ఉంది. వైసీపీ హయాంలో విశాల వంతమైన భవనాల కోసం అందమైన రుషికొండను చెక్కేసింది. ఆ కొండ చుట్టూనే యోగా కార్యక్రమం జరిగింది.
ALSO READ: స్టేషన్‌లో జగన్ కారు.. కేసు సీబీఐకి అప్పగించే ఛాన్స్?
ఆ దృశ్యాలు చూసిన ప్రతీ వ్యక్తి ప్రకృతిని వైసీపీ డ్యామేజ్ చేసిందంటూ ఆడిపోసు కుంటున్నారు. అందమైన విశాఖను నాశనం చేశారంటూ నెటిజన్స్ తమతమ అభిప్రాయాలను బయటపెడుతున్నారు. సిటీలో సముద్ర పక్కన కొండలు కనిపించే ప్రాంతాలు తక్కువగా ఉంటాయని అంటున్నారు. అందులో విశాఖ కూడా ఒకటని గుర్తు చేస్తున్నారు.
యోగా రోజు గిరిజన విద్యార్థుల సూర్య నమస్కారాలు చేశారు. ఒకేసారి 22,122 మంది విద్యార్థులు సూర్య నమస్కారాలు చేసి గిన్నీస్ రికార్డులకు ఎక్కారు. వాటికి సంబంధించిన సదరు గిన్నీస్ నిర్వాహకులు మంత్రులు లోకేశ్, సత్యకుమార్‌కు ధ్రువపత్రాలు అందజేశారు. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో వేదికగా జరిగింది. దాదాపు 25 వేల మంది గిరిజన విద్యార్థులతో 108 నిమిషాల పాటు 108 సూర్య నమస్కారాలు చేశారు. విద్యార్థులు ఆసనాలు వేయడంపై కేంద్రమంత్రి ప్రతాప్‌రావ్ జాదవ్ హర్షం వ్యక్తం చేశారు కూడా.
ఇదో అద్భుత దృశ్యం..
30.16 కిలోమీటర్లు..
రామకృష్ణా బీచ్ నుంచి భోగాపురం వరకు..
మొత్తం 3.19 లక్షల మంది ఒకేసారి యోగా..
"యోగాంధ్ర "లో గిన్నిస్ రికార్డును సాధించాం ఇలా…#APBreaksWorldRecord #YogandhraWorldRecord #Yogandhra#InternationalYogaDay #ChandrababuNaidu #AndhraPradesh pic.twitter.com/KjPw9OhoJ8— Telugu Desam Party (@JaiTDP) June 24, 2025