E-Paper
Advertisement

6 ఎపిసోడ్లు… చివరి వరకూ సీట్ ఎడ్జ్ థ్రిల్లున్న కొరియన్ సస్పెన్స్ సైకలాజికల్ డ్రామా

6 ఎపిసోడ్లు… చివరి వరకూ సీట్ ఎడ్జ్ థ్రిల్లున్న కొరియన్ సస్పెన్స్ సైకలాజికల్ డ్రామా
Advertisement

Korean Thriller: కొరియన్ సినిమాలంటే ఇష్టమా ? అందులోనూ సిరీస్ అంటే చెవి కోసుకుంటారా ? అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ ను డోంట్ మిస్. ఈ సిరీస్ పరుగులు పెట్టే కథతో, సీట్ ఎడ్జ్ థ్రిల్ తో మెంటలెక్కించే ట్విస్టులున్న ఓ అద్భుతమైన కొరియన్ సిరీస్ గురించే ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాము. ఈ సిరీస్ పేరు ‘Notes from the Last Row’. 2026లో విడుదలైన ఈ సిరీస్ మొత్తం 6 ఎపిసోడ్స్ ఉంటుంది. మరి ఈ సిరీస్ కథ ఏంటి ? ఎక్కడ చూడవచ్చు ? అనే వివరాల్లోకి వెళ్తే…

కథలోకి వెళ్తే…

హువాన్ మయోర్గా అనే స్పానిష్ నాటకం ఆధారంగా తెరకెక్కిన మైండ్-గేమ్ థ్రిల్లర్ ఇది. ఇందులో హెయో మున్-ఓ మెయిన్ లీడ్. అతను ఒక యూనివర్సిటీలో లిటరేచర్ ప్రొఫెసర్ గా పని చేస్తూ ఉంటాడు. యువకుడిగా ఉన్నప్పుడు తన కథలపై వచ్చిన విమర్శల వల్ల, అతను ఒక ఫెయిల్డ్ రైటర్‌ గా మిగిలిపోతాడు. ఆ నిరాశతోనే బతుకుతూ, తన క్లాసులో సరిగ్గా వాక్యాలు కూడా రాయలేకపోతున్న విద్యార్థులను తక్కువ చేసి చూస్తుంటాడు.

Advertisement

ఈ నేపథ్యంలో ఓ బ్రిలియంట్ స్టూడెంట్ ఎంట్రీ ఉంటుంది. క్లాసులో అందరి కంటే చివరి బెంచీలో కూర్చునే లీ కాంగ్ అనే ఇంజనీరింగ్ స్టూడెంట్‌ని మున్-ఓ. అతన్ని మన టీచర్ గమనిస్తాడు. ఆ అబ్బాయి రాసిన కథను చదివి, అతనిలోని అద్భుతమైన రచనా ప్రతిభను చూసి అవాక్ అవుతాడు. ఆ అబ్బాయి టాలెంట్‌ను ప్రోత్సహించాలని నిర్ణయినహుకున్న ప్రొఫెసర్ అతనికి పర్సనల్ గా రైటింగ్ లెసన్స్ ఇవ్వడం షురూ చేస్తాడు. కానీ, లీ కాంగ్ రాసే కథలు కేవలం ఊహ కాదని, ప్రొఫెసర్ స్నేహితుడు, అతని భార్య అంటే ప్రొఫెసర్ ఫస్ట్ లవ్ ల నిజ జీవిత సంఘటనల ఆధారంగా రాస్తున్నాడని మున్-ఓకి తెలుస్తుంది.

ట్విస్ట్ ఏంటంటే ఆ అబ్బాయి రాసే కథ తదుపరి భాగంలో ఏం జరుగుతుందో ముందే తెలుసుకోవాలనే పిచ్చి పడుతుంది ప్రొఫెసర్‌కి. కథ కోసం ఆ అబ్బాయి ఎవరెవరిని ఫాలో అవుతున్నాడు ? నిజ జీవితానికి, ఊహాజనిత కథకు మధ్య గీత దాటినప్పుడు వారి జీవితాలు ఎలా అతలాకుతలం అవుతాయి ? అనేదే ఈ సిరీస్ స్టోరీ. ఈ సిరీస్‌ను Netflix లో చూడవచ్చు. ఒరిజినల్ గా కొరియన్ భాషతో వచ్చిన ఈ సిరీస్ ను తెలుగు, హిందీ, తమిళ్, ఇంగ్లీష్ భాషలలో వీక్షించవచ్చు. ఇప్పటిదాకా చూడకపోతే డోంట్ మిస్.

Advertisement

Read Also: మత్తులో మర్మయిడ్ ను పట్టుకొచ్చే అడిక్ట్… ఈ కామెడీ హర్రర్ థ్రిల్లర్ ను డోంట్ మిస్

Tags

Related News

Friday OTT Releases : ఫ్రైడే ఓటీటీ సందడి.. ఆ రెండు మస్ట్ వాచ్..!

10 ఏళ్లలో 55 బదిలీలు… చివరికి ముఖ్యమంత్రి కుటుంబాన్ని కూడా వదలని కానిస్టేబుల్ కథ

పైలెట్ కావాల్సిన కుర్రాడు రెడ్ లైట్ ఏరియాలో ప్రేమంటూ… ఈ సిరీస్ పెద్దలకు మాత్రమే

పేదలకు నరకం… ధనవంతులకు స్వర్గం ఈ రైలు… లైఫ్ లో మరచిపోలేని థ్రిల్లిచ్చే సర్వైవల్ థ్రిల్లర్

కబడ్డీ నుంచి క్రైమ్ వరల్డ్‌లోకి… స్పోర్ట్స్ మూవీ కాదు పక్కా రా యాక్షన్ థ్రిల్లర్

కోరుకున్న వాడిని దక్కించుకోవడానికి ఇవేం మెంటల్ పనులు… ‘అబ్సెషన్’ చూసి ఆగమైనోళ్ల కోసమే ఈ థ్రిల్లర్ సిరీస్

పెళ్లి చేసుకుంటే కోటీశ్వరుల జీవితం… కానీ ఈ అమ్మాయి చేసిన పని తెలిస్తే దిమాక్ కరాబ్

తల్లి కావాలనే కోరిక… చివరికి బిడ్డ కోసం ఆమె చేసిన పని తెలిస్తే షాక్

Big Stories

Advertisement
×