E-Paper
Advertisement

సముద్రం కింద మరో అద్భుత ప్రపంచం… ఎడారిలోనూ వేలాది జీవుల వింత జీవితం… కళ్లకు విందు చేసే నేచర్ డాక్యుమెంటరీ

సముద్రం కింద మరో అద్భుత ప్రపంచం… ఎడారిలోనూ వేలాది జీవుల వింత జీవితం… కళ్లకు విందు చేసే నేచర్ డాక్యుమెంటరీ
Advertisement

Red Sea Documentary: మనకు తెలియని ప్రకృతి రహస్యాలను నీటి అడుగునుంచి ఎడారి దాకా చూపించే నేచర్ డాక్యుమెంటరీ ‘Red Sea: Evolution’s Magic Garden’. ప్రపంచంలోని అతిపెద్ద, జీవ వైవిధ్యంతో నిండిన కోరల్ రీఫ్ ప్రాంతాల్లో ఒకటైన ఎర్ర సముద్రం రహస్యాలను ఈ డాక్యుమెంటరీ మనకు దగ్గరగా తీసుకొచ్చింది. వెయ్యికి పైగా చేపల జాతులు, సముద్ర తాబేళ్లు, ఇండో-పసిఫిక్ బాటిల్‌నోస్ డాల్ఫిన్లు, డుగాంగ్‌లు వంటి జీవులతో పాటు సముద్రం చుట్టూ ఉన్న ఎడారులు, దీవుల్లో కనిపించే అరుదైన జీవజాతులను కూడా ఇందులో చూడొచ్చు. ముఖ్యంగా సోకోత్రా దీవిలో కనిపించే డ్రాగన్ బ్లడ్ ట్రీలు, వైట్ ఒరిక్స్ వంటి ప్రత్యేకమైన జీవజాలం విజువల్ ట్రీట్‌గా నిలుస్తాయి. ఈ 44 నిమిషాల డాక్యుమెంటరీ ప్రకృతి ప్రేమికులకు కొత్త అనుభూతిని అందిస్తుంది. మరి ఎర్ర సముద్రం అడుగున ఎలాంటి అద్భుత ప్రపంచం ఉంది? ఎడారిలోనూ జీవం ఎలా విస్తరించింది? అనే వివరాలపై ఓ లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

ఇది కథతో నడిచే సినిమా కాదు. కెమెరా మనల్ని ఎర్ర సముద్రం అడుగున ఉన్న అద్భుతమైన కోరల్ రీఫ్ ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. వెయ్యికి పైగా చేపల జాతులతో పాటు సముద్ర తాబేళ్లు, బాటిల్‌నోస్ డాల్ఫిన్లు, డుగాంగ్‌లు వంటి జీవులు ఈ సముద్ర పర్యావరణ వ్యవస్థలో ఎలా జీవిస్తున్నాయో చూపిస్తుంది.

Advertisement

ఎర్ర సముద్రం ప్రత్యేకత సముద్రంలోనే కాదు.. దాని చుట్టూ ఉన్న ఎడారులు, దీవుల్లోనూ కనిపిస్తుంది. సాధారణంగా జీవం లేని ప్రాంతాలుగా కనిపించే ఈ ప్రదేశాల్లో కూడా ఎన్నో జంతువులు, మొక్కలు తమదైన విధంగా మనుగడ సాగిస్తున్నాయి. వైట్ ఒరిక్స్ నుంచి సోకోత్రా దీవిలోని అరుదైన డ్రాగన్ బ్లడ్ ట్రీల వరకు ప్రకృతి సృష్టించిన అద్భుతాలను ఇందులో చూపిస్తారు.

ఎక్కడ చూడచ్చు అంటే 

హరాల్డ్ పోకీసర్ దర్శకత్వం వహించిన ఈ డాక్యుమెంటరీలో హోవర్డ్ నైటింగాల్, జూలీ మెకార్తీ వాయిస్ టాలెంట్‌గా ఉన్నారు. 44 నిమిషాలతో నడిచే ఈ డాక్యుమెంటరీ JioHotstarలో సెప్టెంబర్ 17 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. సముద్ర జీవులు, కోరల్ రీఫ్స్, ఎడారి వన్యప్రాణులు, అరుదైన మొక్కలు, ప్రకృతి విజువల్స్ ఇష్టపడేవారికి ‘Red Sea: Evolution’s Magic Garden’ కళ్లకు విందు చేసే డాక్యుమెంటరీగా నిలుస్తుంది.

Advertisement

Read Also: మిలిటరీ స్కూల్‌లో ఫ్రెండ్ అదృశ్యం… ఇంటెన్స్ సిరీస్‌ను టీనేజర్స్ డోంట్ మిస్

Tags

Related News

ఫుట్‌బాల్ స్టార్ కెరీర్‌కు బ్రేక్… డ్యాన్సర్ గర్ల్‌ఫ్రెండ్‌కు కొత్త కష్టాలు… రొమాంటిక్ స్పోర్ట్స్ కామెడీ

కాస్మెటిక్ క్లినిక్‌లో షాకింగ్ నిజాలు… స్టార్ డాక్టర్‌తో ఢీకొన్న తర్వాత బయటపడే బ్యూటీ ఇండస్ట్రీ డార్క్ సీక్రెట్స్

టాయ్స్‌కు కొత్త టెక్నాలజీతో పోటీ… స్మార్ట్ ట్యాబ్‌ను ఆపేందుకు రంగంలోకి వుడీ, బజ్… క్రేజీ ఫన్ అడ్వెంచర్

స్విట్జర్లాండ్ ట్రిప్‌లో తగిలే మిస్టీరియస్ యువకుడు… విధిని దాటి సాగే మ్యాజికల్ రొమాంటిక్ డ్రామా

తప్పు కేసులో జైలుకు… కోర్టు తీర్పు వెనుక షాకింగ్ సీక్రెట్… ఇంటెన్స్ కోర్టు రూమ్ సస్పెన్స్ డ్రామా

చాక్లెట్ ఫ్యాక్టరీలోకి 12 టీమ్స్ ఎంట్రీ… టెంప్ట్ అవ్వకపోతే కోట్ల ప్రైజ్ మనీ… క్రేజీ రియాలిటీ కాంపిటీషన్

ఆన్‌లైన్ స్కామర్లను ఆటపట్టించే కుర్రాళ్లు… ఏకంగా బిలియనీర్ క్రిప్టోనే కొట్టేస్తే? హై టెన్షన్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×