E-Paper
Advertisement

షార్ట్ ఫిలిమ్ అంటూ రూ.5 లక్షలు.. చివరికి పోలీసులకు బిగ్ బాస్ బ్యూటీ !

షార్ట్ ఫిలిమ్ అంటూ రూ.5 లక్షలు.. చివరికి పోలీసులకు బిగ్ బాస్ బ్యూటీ !
Advertisement

Varshini Venkat:వర్షిని వెంకట్…పలు టీవీ షోలు, రియాలిటీ ప్రోగ్రామ్స్ ద్వారా ఆడియన్స్ కి బాగా దగ్గరైన ఈ ముద్దుగుమ్మ ఇపుడు కటకటాల పాలైందని తెలుస్తుంది.ఇంతకీ ఎంచక్కా టీవీలలో షోస్ చేసుకోవాల్సిన ఈ భామ జైల్లో ఎందుకు పడిందా అని ఆలోచిస్తున్నారా ..అయితే చూసేద్దాం.

విషయంలోకి వెళ్తే చెన్నైలో ఒక యువకుడి దగ్గర షార్ట్ ఫిలిమ్ తీస్తున్నానని చెప్పి రూ.5 లక్షలు తీసుకుందట.పైగా షార్ట్ ఫిలిం తీయకుండా డబ్బులు ఇవ్వుమని అడిగితే బెదిరించి ఉన్న డబ్బులు మరియు ఫోన్లు లాక్కున్నారని వాపోతూ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు.

Advertisement

ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్షిని వెంకట్‌కు చెన్నైకి చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా తర్వాత సన్నిహితంగా మారినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో తాను ఓ షార్ట్ ఫిలిమ్ చేయబోతున్నానని వర్షిని అతడికి చెప్పినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టులో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని చెప్పింది.ఇంకేం 5 లక్షలు పెడితే డబ్బులే డబ్బులు అనుకుంటూ వాయిదాల పద్దతిన మొత్తం రూ.5 లక్షలు ఇచ్చాడట.

. డబ్బులు ఇచ్చిన తర్వాత తనకు చెప్పినట్లుగానే సినిమా పనులు మొదలవుతాయని అతడు అనుకున్నాడట. కానీ రోజులు గడుస్తున్నా షూటింగ్ మొదలు కాలేదు. అసలు ఎలాంటి పనులు కూడా మొదలు కాకపోవడంతో తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని వర్షిని వెంకట్‌ను అడగడం మొదలుపెట్టాడు.

Advertisement

దాంతో ఆ యువకుడిని చెన్నైలోని గిండి ప్రాంతంలో కలిసిన వర్షిని వెంకట్, మరికొందరితో కలిసి అతడిని బెదిరించారని అతడి దగ్గర ఉన్న రూ.50 వేల నగదు, రెండు మొబైల్ ఫోన్లను బలవంతంగా తీసుకున్నారని బాధితుడు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది.

దీంతో ఆ యువకుడు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా వర్షిని వెంకట్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.అయితే ఈ కేసులో వచ్చిన ఆరోపణలు ఇంకా దర్యాప్తులోనే ఉన్నాయి. పూర్తి వివరాలు విచారణ తర్వాతే బయటకు రావాల్సి ఉందని సమాచారం.

also read :కోమల్ నుదుటిపై సింధూరం.. గోవిందా సీక్రెట్ మ్యారేజ్ నిజమేనా?

వర్షిని వెంకట్ విషయానికి వస్తే పలు రియాలిటీ షోలలో కనిపించిన ఈ భామ బిగ్ బాస్ తమిళ్‌లో పాల్గొనడంతో ఒక్కసారిగా ఫేమస్ అయిపొయింది. ఇపుడు ఈ వివాదంతో ఆ క్రేజ్ కాస్త బూడిద పాలైనట్టు కనిపిస్తుంది. చూడాలి మరి ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో !

Tags

Related News

గణేష్ నిమజ్జనం స్పెషల్ ఈవెంట్.. సందడి చేసిన సెలబ్రిటీస్!

బిగ్ బాస్ 10: మారిన ఓటింగ్.. ఎలిమినేషన్ దిశగా మరో లేడీ?

సరిగమపలో అదరగొడుతున్న దైవిక్.. అతని బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే!

బిగ్ బాస్ 10లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్న భల్లాల దేవ?

బిగ్ బాస్ త్రిగుణ్ సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నారా? ఈయన భార్య ఎవరంటే?

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు మైండ్ బ్లాక్.. పార్వతి మాటతో షాక్.. పాపం ప్రభా..

Big Stories

Advertisement
×