BigTV English

White Ball: వన్డే, T20 మ్యాచ్ లకు వాడే బాల్ ధర ఎంతో తెలుసా….ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే

White Ball: వన్డే, T20 మ్యాచ్ లకు వాడే బాల్ ధర ఎంతో తెలుసా….ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే

White Ball:  క్రికెట్ క్రీడకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా భారతదేశంలో ఈ క్రీడకు ఎంతో క్రేజ్ ఉంది. టెస్ట్ మ్యాచ్ నుండి వన్డే, టి-20.. మ్యాచ్ ఏదైనా సరే సమయానికి క్రికెట్ ప్రేమికులు టీవీల ముందు వాలిపోతుంటారు. ఈ క్రీడను గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ఆడుతుంటారు. చిన్నపిల్లలు రబ్బరు బంతితో, యువకులు టెన్నిస్ బంతులతో క్రికెట్ ఆడడం సాధారణం. ఈ క్రీడలో బంతి కీలక పాత్ర పోషిస్తుంది. బ్యాటర్లు బ్యాట్ తో ఎంత రెచ్చిపోయినా.. చివరకు ఒక్క మంచి బంతికి అవుట్ అవుతుంటారు. ఒక్కోసారి ఆ ఒక్క బంతి గెలుపోటములను నిర్ణయిస్తుంది.


అయితే అంతర్జాతీయ మ్యాచ్ లలో క్రికెట్ ఆడడానికి ఎటువంటి బంతిని ఉపయోగిస్తారు..? ఎన్ని రకాల బంతులను వాడతారు..? వీటిని ఎలా తయారు చేస్తారు..? ఒక్క బంతి ధర ఎంత..? అనే వాటికి సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్ లో కార్క్ బంతిని ఉపయోగిస్తారు. దీనిని తోలుతో కప్పబడిన కార్క్ బాడీతో తయారుచేస్తారు. ఈ తోలు రెండు లేదా నాలుగు వరుసల్లో ఉంటుంది. ఈ బంతిని ఆరు వరసల కుట్లతో కుడతారు. ఈ కుట్లను సీమ్ అంటారు. క్రికెట్ బంతులు దాదాపు 23 సెంటీమీటర్ల వ్యాసం, 160 నుండి 163 గ్రాముల బరువు ఉంటాయి. అయితే క్రికెట్ ఆట తోపాటు బంతులు కూడా మార్పులు చెందాయి. ప్రస్తుతం ఈ క్రీడలో మూడు రకాల బంతులను ఉపయోగిస్తున్నారు.

Also Read: SRH Team : సెలూన్ షాప్ లో SRH ప్లేయర్స్.. హైదరాబాద్ గల్లిల్లో ఎంజాయ్


రెడ్ బాల్:

ఈ ఎరుపు రంగు బంతిని దేశవాళీ టోర్నీలు, టెస్టుల్లో ఉపయోగిస్తారు. ఈ బంతిని చేతితో లేదా యంత్రంతో తయారుచేస్తారు. ఈ బాల్ అధిక దృఢత్వంతో ఉంటుంది. ఎందుకంటే టెస్ట్ ఫార్మాట్ లో రోజుకు 80 నుంచి 90 ఓవర్లు ఆడతారు. అందుకు అనుగుణంగా దీనిని చాలా దృఢంగా ఉండేలా అత్యున్నత మన్నికతో ఈ ఎరుపు రంగు బంతిని తయారు చేస్తారు. ఆటసాగే కొద్దీ బంతి అరుగుతుంది. దీంతో బౌలర్లుగా బంతిని పెద్దగా స్వింగ్ చేయలేరు.

వైట్ బాల్:

వన్డే ఫార్మాట్ లో ఈ వైట్ బాల్ ని ఉపయోగిస్తారు. ఫ్లడ్లైట్ల వెలుతురులో ఎరుపు రంగు బంతి పిచ్ రంగుకు దగ్గరగా ఉండడం వల్ల కనిపించదు. ఈ కారణంగానే తెలుపు రంగు బంతిని తయారు చేశారు. రెడ్ బాల్ తో పోలిస్తే ఈ వైట్ బాల్ నాణ్యత, మన్నిక కూడా తక్కువ ఉంటుందని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ తెలుపు రంగు బంతిని కుట్టిన ప్రాంతాన్ని సీమ్ అంటారు. రెడ్ బాల్ తో పోలిస్తే ఈ బంతి కొన్ని సందర్భాల్లో వెడల్పు ఎక్కువగా ఉంటుంది. టి-20 ఫార్మాట్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} లోను తెలుపు రంగు బంతినే వాడుతారు.

Also Read: Dhoni – Ruturaj : గాయం పేరుతో కుట్రలు… రుతురాజు కెరీర్ నాశనం చేసిన ధోని

ఈ బంతులను మూడు ప్రధాన కంపెనీలు తయారు చేస్తాయి. అవి డ్యూక్స్, కూకబుర్రా, ఎస్జి. ఈ డ్యూక్స్ కంపెనీ ని ఇంగ్లాండ్, కూకబుర్రను వెస్టిండీస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఎస్జీ ని శ్రీలంక తయారుచేస్తాయి. ఈ ఎస్జిని భారతదేశం ఎక్కువగా ఉపయోగిస్తుంది. కూకబుర్ర వైట్ బాల్ ధర వెబ్సైట్ లో రూ. 12,366, క్రికెట్ షాప్ లో రూ. 19,974, స్పోర్ట్స్ గ్లోబల్ లో 20 వేలకు లభ్యమవుతుంది. ఇక టెస్టులకు ఉపయోగించే రెడ్ బాల్ ధర కూడా ఇంచుమించు ఇదే ధరతో ఉంటుంది.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×