E-Paper
Advertisement

పార్ట్‌నర్లను మార్చుకుని ఎంజాయ్ చేయాలనుకునే జంటలు… రచ్చ రంబోల అయ్యే ఆ రాత్రి

పార్ట్‌నర్లను మార్చుకుని ఎంజాయ్ చేయాలనుకునే జంటలు… రచ్చ రంబోల అయ్యే ఆ రాత్రి
Advertisement

Romantic Comedy OTT : కామెడీ సినిమాలు రక రకాల కంటెంట్ తో నవ్వించే ప్రయత్నం చేస్తుంటాయి. అయితే అడల్ట్ కామెడీ స్టైల్ మాత్రం వేరేలా ఉంటుంది. అయితే ఇది కేవలం పెద్దలు మాత్రమే చూడాల్సిన రొమాంటిక్ కామెడీ కేటగిరీకి చెందుతుంది. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా మెయిన్ థీమ్ ‘స్వింగింగ్’. అనే పార్టనర్స్ ను వేరే వాళ్ళతో మార్చుకోవడం. కాబట్టి ఇందులో బోల్డ్ సీన్లు, డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇది కేవలం బూతు సినిమా మాత్రమే కాదు. మనుషుల మధ్య ఉండే సంబంధాలు, ఒకరిపై ఒకరికి ఉండే నమ్మకం, కొత్తదనం కోసం వెతికే క్రమంలో వచ్చే ఇబ్బందులను సరదాగా చూపిస్తుంది. మొత్తానికి ఈ సినిమా ఒక రాత్రి జరిగే రచ్చ రాంబోలా మాదిరి ఉంటుంది.

నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో స్ట్రీమింగ్ 

2021లో వచ్చిన ఈ స్పానిష్ రొమాంటిక్ కామెడీ సినిమా పేరు ‘దొందే కాబెన్ దోస్’ (Donde caben dos). ఇందులో నటించిన అన్నా కాస్టిల్లో, ఎర్నెస్టో ఆల్టెరియో వంటి నటీనటులు స్పెయిన్‌లో చాలా పాపులర్. సినిమా మొత్తం ఒకే రాత్రిలో, ఒకే క్లబ్ చుట్టూ తిరిగినట్లు అనిపించినా, కథను నడిపించిన విధానం, పాత్రల మధ్య వచ్చే కామెడీ డైలాగులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. సుమారు 1 గంట 50 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రం, బోల్డ్ కంటెంట్ ఉన్నప్పటికీ ఎమోషన్స్ ని కూడా టచ్ చేస్తుంది. నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో విడుదలైన తర్వాత ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. దీనికి విమర్శకుల నుండి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ, డిజిటల్ ప్లాట్‌ ఫామ్‌లో స్ట్రీమింగ్ పరంగా ఇది మంచి వ్యూస్ సాధించింది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

పెళ్ళై ఏళ్లు గడిచిపోయి, ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికే బోర్ కొడుతున్న కొన్ని జంటలు, లైఫ్‌లో ఏదో కొత్త కిక్కు కావాలని డిసైడ్ అవుతారు. ఇలాంటి వాళ్ల కోసమే సిటీలో ఒక ‘స్వింగర్స్ క్లబ్’ (పార్టనర్స్‌ని మార్చుకునే చోటు) ఉంటుంది. ఆ రాత్రికి అక్కడికి వెళ్తే అన్నీ కొత్త మొహాలే కనిపిస్తాయి. ఏం చేసినా ఎవరూ అడగరు అనే ధీమాతో కొన్ని జంటలు రెడీ అయ్యి ఆ క్లబ్‌లో అడుగు పెడతారు. తీరా అక్కడికి వెళ్ళాక సీన్ రివర్స్ అవుతుంది. ఒక జంట తమ పార్టనర్‌ని వేరే వాళ్ళకి ఇవ్వలేక కుళ్లుకుంటూ ఉంటారు, ఇంకొకరేమో కొత్త ఎంజాయ్‌మెంట్ దొరికిందని తెగ మురిసిపోతుంటారు.

మరికొందరు పెళ్లి కాని కుర్రాళ్లు ఏదో పొడిచేద్దాం అని వెళ్తే, అక్కడ ఎదురయ్యే వింత మనుషులు, వాళ్ళు చేసే పిచ్చి పనుల వల్ల కామెడీ మాములుగా ఉండదు. నైట్ అంతా ఫుల్ రచ్చ, గొడవలు, రొమాన్స్‌తో సాగుతుంది. చివరికి తెల్లారేసరికి ఆ క్లబ్‌కి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఒక విషయం అర్థమవుతుంది. బయట ఎవరితో ఎంజాయ్ చేసినా, చివరికి మనకి తోడుగా ఉండేది మన సొంత పార్టనరే అని. క్లబ్బులు, డేటింగులు అన్నీ ఒక రాత్రి సరదా మాత్రమే అని, అసలైన ప్రేమ ఇంట్లోనే ఉందని తెలుసుకుని, చివరికి ఎవరి దారిన వాళ్లు వెళ్తారు. మొత్తం మీద ఇదొక బోల్డ్ అండ్ ఫన్నీ స్టోరీ.

Advertisement

Read Also : మైండ్ గేమ్‌ తో మతిపోగొట్టే అంతుచిక్కని మిస్టరీ… అసలు పిచ్చి ఎవరికో అర్థం కాక బుర్ర తిరిగిపోయే థ్రిల్లర్

Tags

Related News

ఓటీటీలోకి రవితేజ బ్లాక్ బస్టర్ ‘ఇరుముడి’.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

మానవులకు, సైబోర్గ్స్‌కి మధ్య బ్లడీ బ్లడ్ బాత్… భవిష్యత్ ప్రపంచంలో మైండ్ బ్లోయింగ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

గ్రహశకలం ఢీకొట్టడంతో తెలియని గ్రహంపై క్రాష్ ల్యాండ్… డ్రాగన్లు, రాక్షస డైనోసార్లతో ఊపిరి పీల్చుకోనివ్వని పోరాటం

అరేబియన్ నైట్స్ ఫాంటసీకి భయపెట్టే ట్విస్ట్… ఎపిక్ హర్రర్ సిరీస్ స్ట్రీమింగ్ తెలుగులోనే

ట్రిప్ పేరుతో ఇదేం ట్విస్ట్… కార్పొరేట్ ఆఫీస్ పాలిటిక్స్ కల్చర్‌ను ఎండగట్టిన సినిమా

పెళ్లి ఒకరితో ప్రేమ మరొకరితో… హృదయాన్ని హత్తుకునే కొరియన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ

అవయవాల అక్రమ రవాణా కుట్రను ఛేదించే ఆత్మ… మెంటలెక్కించే మెడికల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ సిరీస్

అమాయకపు బొమ్మ రక్తాన్ని తాగే రాక్షసిగా మారితే… తెలుగులోనే ఈ హడలెత్తించే డార్క్ డెమోనిక్ హర్రర్ ఫిల్మ్

Big Stories

Advertisement
×