E-Paper
Advertisement

మూడేళ్ల ప్రేమకు బ్రేకప్… ఎక్స్ పై రివెంజ్‌తో మతిపోగొట్టే పని… యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ

మూడేళ్ల ప్రేమకు బ్రేకప్… ఎక్స్ పై రివెంజ్‌తో మతిపోగొట్టే పని… యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ
Advertisement

Romantic Comedy: కమింగ్-ఆఫ్-ఏజ్ రొమాంటిక్ కామెడీగా వచ్చిన హిందీ సినిమా ‘డోంట్ బి షై’. కాలేజ్ లైఫ్, ప్రేమ, బ్రేకప్, రివెంజ్, ఫ్రెండ్‌షిప్ కలిసిన  ఒక తేలికపాటి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఇది. మూడేళ్లుగా ప్రేమలో ఉన్న బాయ్‌ఫ్రెండ్ ఒక్కసారిగా బ్రేకప్ చెబితే? మాజీ ప్రియుడిపై రివెంజ్ తీర్చుకోవాలని వెళ్లిన అమ్మాయి… చివరికి అతని కొత్త ప్రియురాలితోనే ఫ్రెండ్ అయిపోతే? ఇద్దరి మధ్య ఏర్పడే బంధం ఎలా ఉంటుంది?  అదిరిపోతుంది కదా ఆ జర్నీ. అలాంటి ప్రయాణంతో వచ్చిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తోంది. అలియా భట్ తన సొంత నిర్మాణ సంస్థ ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ మూవీని నిర్మించడం విశేషం.

కథలోకి వెళ్తే..

శ్యామిలీ అలియాస్ షై (Shyamili “Shy” Das) తన బాయ్‌ఫ్రెండ్ మయాంక్ (Mayank)తో మూడేళ్లుగా రిలేషన్‌లో ఉంటుంది. తన ప్రేమ విషయంలో షై చాలా సీరియస్‌గా ఉంటుంది. కానీ ఓ రోజు మయాంక్ ఆమెకు బ్రేకప్ చెప్పేస్తాడు. కారణం ఏంటంటే… అతను మరో అమ్మాయితో రిలేషన్‌లోకి వెళ్లిపోతాడు. మూడు సంవత్సరాల ప్రేమ ఒక్కసారిగా ముగియడంతో షైకి కోపం వస్తుంది. తనను అంత సులభంగా వదిలేసిన మయాంక్‌కు ఓ గట్టి షాక్ ఇవ్వాలని నిర్ణయించుకుంటుంది. అతని కొత్త గర్ల్‌ఫ్రెండ్ తార (Tara)ను టార్గెట్ చేయాలని అనుకుంటుంది.

Advertisement

కానీ షై ఊహించని మలుపు ఇక్కడే మొదలవుతుంది. తారను ప్రత్యర్థిగా చూడాలని మొదలుపెట్టిన ఆమె… ఆమెతోనే మాట్లాడాల్సి వస్తుంది. మొదట అసూయ, కోపం, అపార్థాలతో ఉన్న ఈ ఇద్దరి మధ్య క్రమంగా ఓ స్నేహం ఏర్పడుతుంది. మయాంక్‌తో ఉన్న గతాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతున్న షై… తారతో మాట్లాడిన కొద్దీ తనకు తెలియని విషయాలు తెలుసుకుంటుంది. తన కోపం మొత్తం మయాంక్‌పై ఉండాల్సిందా? లేక తాను కూడా ఈ సంబంధంలో కొన్ని విషయాలను తప్పుగా అర్థం చేసుకుందా? అనే ప్రశ్నలు ఆమెకు ఎదురవుతాయి.

ఇలా మాజీ ప్రియుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని మొదలైన షై ప్రయాణం… చివరికి తనను తాను అర్థం చేసుకునే ప్రయాణంగా మారుతుంది. బ్రేకప్ తర్వాత జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి? ప్రేమ ముగిసిపోయిన తర్వాత కూడా కొత్త సంబంధాలు, స్నేహాలు ఎలా మొదలవుతాయి? అనే అంశాలను కామెడీగా చూపిస్తుంది.

ఓటీటీలో ఎక్కడ చూడొచ్చు?

Advertisement

ఆరుషి బజాజ్, అన్ష్ దుగ్గల్, బియాంకా అరోరా, పీయూష్ ఖతి తదితరులు నటించిన ‘డోంట్ బీ షై’కి శ్రీతి ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఆలియా భట్ , షహీన్ భట్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఇది హిందీ రొమాంటిక్ కామెడీ. 2026 సెప్టెంబర్ 25 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం సహా పలు ఆడియో ఆప్షన్లు ప్లాట్‌ఫామ్‌లో ఉన్నాయి.

Read Also: అమ్మాయిలతో ప్రతీ రాత్రి ఆ పని… ఆ గోడల మధ్య దాగున్న భయంకరమైన రహస్యం… డార్క్ డిస్టోపియన్ థ్రిల్లర్

Related News

బాబోయ్ ఆ గుహలోకి వెళ్తే మాయమవుతారు… గర్భిణీ ఆత్మహత్య… మైండ్ బ్లోయింగ్ సూపర్‌నేచురల్ థ్రిల్లర్

అడవిలో అరుదైన వింత కోసం వెళ్లిన ఫోటోగ్రాఫర్… కట్ చేస్తే మిస్టీరియస్ ఫాంటసీ థ్రిల్లర్

ప్రేమకు అడ్డుగా మారిన ఊరి గొడవలు… తమిళనాడు బ్యాక్‌డ్రాప్‌లో ఇంట్రెస్టింగ్ లవ్ డ్రామా

ఈ వీకెండ్ తెలుగులో ఓటీటీలోకి 10 కొత్త సినిమాలు, సిరీస్‌లు… హారర్ నుంచి లవ్ స్టోరీల వరకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్

సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన ‘రంభ ఊర్వశి మేనక’.. అసలు కారణం ఏంటంటే?

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీల్లోకి బోలెడు సినిమాలు.. ఒక్కరోజు స్ట్రీమింగ్ ఇవే. .

మృణాల్ ఠాకూర్‌ ఫేవరేట్ మూవీ… బ్రేకప్ తర్వాతే అసలు కథ మొదలైతే? ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా

Big Stories

Advertisement
×