E-Paper
Advertisement

రూ. 1,059కే టైప్-సి ఛార్జింగ్ ఫోనా? పెద్దలకు అదిరిపోయే గిఫ్ట్.. ఐటెల్ కొత్త మోడల్ వచ్చెసింది!

రూ. 1,059కే టైప్-సి ఛార్జింగ్ ఫోనా? పెద్దలకు అదిరిపోయే గిఫ్ట్.. ఐటెల్ కొత్త మోడల్ వచ్చెసింది!
Advertisement

itel ACE 4 Shine: తక్కువ బడ్జెట్‌లో ఒక మంచి కీప్యాడ్ ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే మీకోసమే ఐటెల్ కంపెనీ సరికొత్త మోడల్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. itel ACE 4 Shine పేరుతో ఈ ఫోన్ విడుదలైంది. కేవలం రూ.1,059 ధరలో వచ్చిన ఈ ఫోన్.. ముఖ్యంగా వృద్ధులు, రెండో ఫోన్ కావాలనుకునే వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా.. చేతిలో పట్టుకోవడానికి కూడా ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

ఆకట్టుకునే డిజైన్, డిస్‌ప్లే..

ఈ ఫోన్‌లో 1.77 అంగుళాల కలర్ డిస్‌ప్లే ఇచ్చారు. రాత్రివేళల్లో లేదా వెలుతురు తక్కువగా ఉన్న సమయంలో కూడా అక్షరాలు స్పష్టంగా కనిపించేలా ‘రేడియంట్ కీప్యాడ్’ అందించడం విశేషం. దీనివల్ల డయల్ చేయడం చాలా తేలికవుతుంది. ఇది బ్లాక్, మ్యాజిక్ బ్లూ, ఫారెస్ట్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Advertisement

Also Read: కేబుల్‌తో ఛార్జ్ చేయాలా? వైర్‌లెస్‌గా చేయాలా? AirPods విషయంలో ఇదిగో ఫుల్ క్లారిటీ!

టైప్-సి ఛార్జింగ్ సపోర్ట్..

itel ACE 4 Shineలో ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ టైప్-సి ఛార్జింగ్ పోర్ట్. సాధారణంగా కీప్యాడ్ ఫోన్లకు పాత కాలపు మైక్రో యుఎస్బీ ఇస్తారు. కానీ ఇందులో టైప్-సి ఇవ్వడం వల్ల ఛార్జింగ్ సులువుగా పెట్టుకోవచ్చు. దీనిలోని 1000mAh బ్యాటరీ దాదాపు 8 రోజుల స్టాండ్‌బై, 8 గంటలకు పైగా టాక్‌టైమ్‌ను ఇస్తుంది.

భాషలు, ప్రత్యేక ఫీచర్లు..

Advertisement

పెద్దవారికి ఉపయోగపడేలా ఇందులో ‘కింగ్ వాయిస్’ అనే ఫీచర్ ఉంది. ఇది మెనూలు, వచ్చే కాల్స్ పేర్లను హిందీ, ఇంగ్లీష్‌లో చదివి వినిపిస్తుంది. దాంతో పాటు ఆపద సమయంలో వాడేందుకు ఎస్‌ఓఎస్ (SOS) బటన్ కూడా ఇచ్చారు. తెలుగు, హిందీతో సహా 9 ప్రాంతీయ భాషలకు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ, మెమొరీ..

ఈ డ్యూయల్ సిమ్ 2జీ ఫోన్‌లో UNISOC ప్రోసెసర్ ఉపయోగించారు. మెమొరీని కార్డ్ ద్వారా 32GB వరకు పెంచుకోవచ్చు. ఇందులో వైర్‌లెస్ ఎఫ్‌ఎమ్ రేడియో, కాల్ రికార్డింగ్, బ్లూటూత్, మంచి టార్చ్ లైట్ వంటి అన్ని రోజువారీ అవసరమైన ఫీచర్లు ఉన్నాయి. ఆఫ్ లైన్ షాపుల్లోనూ, ఆన్‌లైన్ లోనూ ఇది కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

Also Read: కళ్లజోడుతోనే ఫోన్ కాల్స్, మ్యూజిక్.. భారత్‌లో మెటా కొత్త గ్లాసెస్ లాంచ్, రేటు ఎంతో తెలుసా?

Tags

Related News

యూట్యూబ్‌లో షాపింగ్ హంగామా.. ఇక వీడియోలు చూస్తూనే కొనేయొచ్చు, క్రియేటర్లకు కొత్త ఆదాయ అవకాశాలు!

హ్యాకర్ల టార్గెట్‌గా గూగుల్ క్రోమ్ యూజర్లు? CERT-In బిగ్ వార్నింగ్.. వెంటనే ఇలా చేయండి!

కేబుల్‌తో ఛార్జ్ చేయాలా? వైర్‌లెస్‌గా చేయాలా? AirPods విషయంలో ఇదిగో ఫుల్ క్లారిటీ!

44% భారీ డిస్కౌంట్‌తో వాషింగ్ మెషీన్.. ఫీచర్లు అదుర్స్!

కళ్లజోడుతోనే ఫోన్ కాల్స్, మ్యూజిక్.. భారత్‌లో మెటా కొత్త గ్లాసెస్ లాంచ్, రేటు ఎంతో తెలుసా?

తక్కువ ధరలో పెద్ద టీవీ కోసం చూస్తున్నారా? మీ కోసమే ఈ మోడల్

ఐఫోన్ డ్యూయో కంటే తక్కువ ధరకే అద్భుతమైన ఫోల్డబుల్ ఫోన్లు.. ఇవే ఆ 4 మోడల్స్!

Big Stories

Advertisement
×