E-Paper
Advertisement

ఫ్రెండ్ కోసం ఫేక్ డేటింగ్… ప్రొఫెసర్‌తో ఆ పనిదాకా వెళ్తే… ఈ రొమాంటిక్ కామెడీ తెలుగులోనే

ఫ్రెండ్ కోసం ఫేక్ డేటింగ్… ప్రొఫెసర్‌తో ఆ పనిదాకా వెళ్తే… ఈ రొమాంటిక్ కామెడీ తెలుగులోనే
Advertisement

Romantic Feel Good Movie: ఒక హృదయపూర్వక, ఆహ్లాదకరమైన రొమాంటిక్ కామెడీ సినిమాను చూడాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను మిస్ అవ్వద్దు. ప్రఖ్యాత రచయిత్రి ఆలి హాజెల్‌వుడ్ రాసిన బెస్ట్ సెల్లింగ్ నవల ఆధారంగా అమెజాన్ ఎంజిఎమ్ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం పేరు The Love Hypothesis. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్న ఒలీవ్ స్మిత్ అనే కాస్త అమాయకపు సైన్స్ విద్యార్థిని, తన స్నేహితురాలిని నమ్మించడం కోసం కోపిష్టి ప్రొఫెసర్ ‘ఫేక్ డేటింగ్’ చేస్తుంది. ఆ తరువాత వీళ్ళ కెమిస్ట్రీ చూస్తున్నంత సేపు మనసు ఆహ్లాదంగా ఉంటుంది. యూత్, ప్రేమికులు మిస్ కూకుండా చూడాల్సిన సినిమా ఇది.

కథలోకి వెళ్తే…

ఒలీవ్ స్మిత్ ఓ తెలివైన బయాలజీ పీహెచ్‌డీ విద్యార్థిని. తన బెస్ట్ ఫ్రెండ్ అహన్‌కు తన మాజీ క్రష్ జెరెమీపై ఇష్టం ఉందని తెలిసి, తాను అతడి విషయంలో ముందుకు వెళ్లిపోయానని నమ్మించేందుకు ఓ నాటకం ఆడుతుంది. అదే సమయంలో ఎదురుగా కనిపించిన వ్యక్తిని ఇంపల్సివ్‌గా ముద్దుపెట్టుకుంటుంది. అతడు మరెవరో కాదు, కాలేజ్‌లోనే అందరికీ భయమేసే ప్రొఫెసర్ డాక్టర్ ఆడమ్ కార్ల్‌సన్.

Advertisement

ఈ అనుకోని ఘటన తర్వాత ఇద్దరికీ ఓ ఫేక్ రిలేషన్‌షిప్ అవసరం ఏర్పడుతుంది. ఒలీవ్‌కు తన ఫ్రెండ్‌ను నమ్మించాల్సిన అవసరం ఉంటే, ఆడమ్‌కు కూడా తన కెరీర్‌కు సంబంధించిన కొన్ని కారణాల వల్ల ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది. దీంతో ఇద్దరూ కొన్ని రూల్స్, బౌండరీస్ పెట్టుకుని ఫేక్ డేటింగ్ మొదలుపెడతారు.

కానీ ప్లాన్ చేసినంత సులభంగా పరిస్థితులు ఉండవు. కలిసి తిరగడం, ఒకరి గురించి మరొకరు తెలుసుకోవడం, చిన్న చిన్న గొడవలు, ఊహించని రొమాంటిక్ మూమెంట్స్‌తో ఇద్దరి మధ్య ఉన్న దూరం క్రమంగా తగ్గుతుంది. చివరికి ఫేక్ రిలేషన్‌షిప్‌లో మొదలైన ఈ బంధం నిజమైన ప్రేమగా మారిందా? లేక ఇద్దరూ తమ అసలు భావాలను దాచుకున్నారా? అనేదే కథలో ఆసక్తికరమైన భాగం.

తెలుగులో అందుబాటులో ఉందా?

Advertisement

క్లేర్ స్కాన్లన్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ సినిమాలో లిలీ రీన్‌హార్ట్, టామ్ బేట్‌మన్, రేచల్ మార్ష్, జబూకీ యంగ్-వైట్, నికోలస్ డువెర్నే, ఆర్టీ ఫ్రౌషన్ తదితరులు నటించారు. ఇక తెలుగు ప్రేక్షకులకు గుడ్ న్యూస్ ఏంటంటే Prime Videoలో తెలుగు ఆడియోతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలు కూడా అందుబాటులో ఉన్నాయి. సెప్టెంబర్ 23 నుంచి Prime Video సబ్‌స్క్రిప్షన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.  ఇది రెంట్ మూవీగా కాకుండా Prime Originalగా అందుబాటులో ఉంది.

Read Also: మందు బాటిల్ వల్ల మొదలైన గొడవ… చివరికి క్రైమ్‌లో చిక్కుకున్న స్నేహితులు… ఫుల్ నవ్వులు

Related News

చాక్లెట్ ఫ్యాక్టరీలోకి 12 టీమ్స్ ఎంట్రీ… టెంప్ట్ అవ్వకపోతే కోట్ల ప్రైజ్ మనీ… క్రేజీ రియాలిటీ కాంపిటీషన్

ఆన్‌లైన్ స్కామర్లను ఆటపట్టించే కుర్రాళ్లు… ఏకంగా బిలియనీర్ క్రిప్టోనే కొట్టేస్తే? హై టెన్షన్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ముంబైని వణికించే మూగ చెవిటి లేడీ సైకో… వణుకు పుట్టించే డార్క్ క్రైమ్ థ్రిల్లర్

మిలిటరీ స్కూల్‌లో ఫ్రెండ్ అదృశ్యం… ఇంటెన్స్ సిరీస్‌ను టీనేజర్స్ డోంట్ మిస్

అమాయక ఐస్‌క్రీమ్ మ్యాన్ వెనుక దాగివున్న డార్క్ సీక్రెట్… నిద్రను దూరం చేసే భయంకరమైన సైకో హర్రర్

సోదరుడి మృతదేహం కోసం అర్ధరాత్రి వచ్చిన వ్యక్తి… రాత్రంతా ఊపిరి బిగపట్టించే టెన్షన్… డార్క్ సస్పెన్స్ డ్రామా

క్రేజీ పోలీసుల పిచ్చి ప్లాన్‌లు… అడుగడుగునా పొట్టచెక్కలయ్యే కామెడీ

Big Stories

Advertisement
×