E-Paper
Advertisement

ఆ రోజు చిన్న రోల్.. ఈ రోజు వంద కోట్ల సినిమా.. సుహాస్ జర్నీ ఇదే!

ఆ రోజు చిన్న రోల్.. ఈ రోజు వంద కోట్ల సినిమా.. సుహాస్ జర్నీ ఇదే!
Advertisement

Suhas Mandadi:సుహాస్ ..ఇప్పుడు ఈ పేరు మారుమ్రోగిపోతుంది.కారణం చిన్న పాత్రలతో కెరీర్ మొదలెట్టిన ఈ వెర్సటైల్ యాక్టర్ ఇపుడు వందకోట్ల సినిమాలో కీ రోల్ పోషించడమే.అవును…సూరి మెయిన్ లీడ్ గా నటించిన మండాడి సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులుపుతుండటంతో అందులో విలనీ షేడ్ ఉన్న పాత్రలో నటించి మెప్పించిన సుహాస్ ఇపుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయాడు.

నిజానికి సుహాస్ కి ఈ క్రేజ్ అంత ఈజీగా రాలేదు.కెరీర్ మొదట్లో ది అతిధి,కళాకారుడు, రాధిక,బంగారం వంటి షార్ట్ ఫిలిమ్స్ తో మంచి పేరు తెచ్చుకుని క్రమంగా సినిమాల్లోకి అడుగుపెట్టి . కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మెప్పించి.. ఆ తర్వాత హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా కథకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకోవడం సుహాస్ సక్సెస్ కి ప్రధాన కారణం అని చెప్పవచ్చు.

Advertisement

అలా తొలినాళ్ళలో పడి పడి లేచే మనసు’ ‘మజిలీ’, ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘డియర్‌ కామ్రేడ్‌’, ‘ప్రతి రోజు పండగే’ వంటి సినిమాల్లో చిన్న పాత్రలు పోషించి ఆడియన్స్ కి దగ్గరయ్యాడు.అయితే 2019లో వచ్చిన ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు సుహాస్. ఇందులో కొర్ర సుహాస్‌ అనే పాత్రలో నటించి మెప్పించాడు.

అయితే సుహాస్ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా మాత్రం సందీప్ రాజ్ దర్శకత్వంలో వచ్చిన‘కలర్‌ ఫోటో’సినిమా అనే చెప్పాలి. ఇందులో జయకృష్ణ పాత్రలో హీరోగా నటించి మెప్పించిన సుహాస్ ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. ఇక అక్కడి నుంచి ‘రంగ్‌ దే’, ‘అర్ధ శతాబ్దం’, ‘హెడ్స్‌ అండ్‌ టేల్స్‌’, ‘ఫ్యామిలీ డ్రామా’, ‘గమనం’ వంటి సినిమాల్లో సరికొత్త పాత్రలు పోషించి మరింతగా రాటు తేలాడు .

Advertisement

అయితే సుహాస్‌ కేవలం హీరో పాత్రలకే పరిమితం కాలేదండోయ్..2022లో వచ్చిన ‘HIT: The Second Case’లో కుమార్‌ అనే నెగెటివ్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. ఈ పాత్రకు గాను SIIMAలో బెస్ట్‌ యాక్టర్‌ ఇన్‌ ఎ నెగెటివ్‌ రోల్‌ – తెలుగు అవార్డును అందుకున్నాడు కూడా.

ఇక 2023లో వచ్చిన ‘రైటర్‌ పద్మభూషణ్‌’ సుహాస్‌ కెరీర్‌ ని మరింత పరుగులు పెట్టించిన సినిమా.ఇక 2024లో వచ్చిన ‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని విజయాన్ని సొంతం చేసుకోవడంతో మరోసారి సుహాస్ పేరు గట్టిగా వినబడింది. మల్లికార్జున్‌ అలియాస్‌ మల్లి పాత్రలోసుహాస్‌ ఇచ్చిన ఫెర్ఫామెన్స్ టాప్ నాచ్.

ఇక అదే ఏడాది ‘శ్రీరంగ నీతులు’, ‘ప్రసన్న వదనం’, ‘డార్లింగ్‌’, ‘గొర్రె పురాణం’, అంటూ వరుస సినిమాలు బోల్తా కొట్టినప్పటికీ ‘జనక అయితే గనక’తో మరోసారి సత్తా చాటాడు.ఇక గోపీచంద్ తీసిన ‘జాట్‌’తో హిందీ ప్రేక్షకులనీ పలరించాడు. అలా ‘ఉప్పు కప్పురంబు’, ‘ఓ భామ అయ్యో రామ’ వంటి సినిమాల్లోనూ నటించిన సుహాస్ ‘దే కాల్‌ హిమ్‌ OG’లో క్యామియో గా కనిపించడం విశేషం.

ఇక 2026లో ‘హే బాల్వంత్‌’లో కృష్ణ బాల్వంత్‌ పాత్రలో మెప్పించిన సుహాస్ తాజాగా మండాడి తో సాలిడ్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.ఒక రకంగా తెలుగు వాడు అయి ఉండి తమిళ సినిమాలో కీలాక పాత్రలో కనిపించి మెప్పించడం మెచ్చుకోతగ్గ విషయమే !

also read :సరిగమపలో అదరగొడుతున్న దైవిక్.. అతని బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే!

చూడాలి ప్రస్తుతం ‘కేబుల్‌ రెడ్డి’, ‘ఆనందరావు అడ్వెంచర్స్‌’ వంటి సినిమాలని లైనప్ చేసిన ఈ కుర్ర హీరో ముందు ముందు ఇంకెన్ని సంచలనాలు ఖాతాలో వేసుకుంటాడో !

Tags

Related News

16 ఏళ్ల కష్టానికి నేనే సాక్ష్యం.. నాని వైఫ్ అంజనా పోస్ట్ వైరల్!

మా కుటుంబాన్ని మార్చేసిన రోజు..చిరు 48 ఇండస్ట్రీ జర్నీ పై చరణ్ ఎమోషనల్ పోస్ట్!

డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో సుమలతకు షాక్..రఘు మాస్టర్‌కు 214 మంది మద్దతు!

రెండు జడలతో ఉన్న ఈ బుడ్డోడిని గుర్తుపట్టారా? టాలీవుడ్ ట్రెండింగ్ డైరెక్టర్?

ది ప్యారడైజ్ నాని నుంచి సంపూ వరకు ఎవరి రెమ్యూనరేషన్ ఎంతంటే?

కయాదు లోహర్ పేరుకి పురాణాలతో ఉన్న సంబంధం ఏంటో తెలుసా?

ప్యారడైజ్ కోసం మైత్రి క్రేజీ ప్లాన్.. ఇంటర్వెల్ స్నాక్స్ గా తెలంగాణ స్పెషల్ ఫుడ్!

Big Stories

Advertisement
×