E-Paper
Advertisement

మట్టి బొమ్మకు ప్రాణం పోసి.. లేనిపోని ముప్పును కొని తెచ్చుకున్న కథ… ఒళ్ళు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్

మట్టి బొమ్మకు ప్రాణం పోసి.. లేనిపోని ముప్పును కొని తెచ్చుకున్న కథ… ఒళ్ళు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్
Advertisement

Horror Thriller Movie OTT : సూపర్ నేచురల్ హారర్ సినిమాలంటే, అకస్మాత్తుగా దెయ్యం భయపెట్టే సీన్లతో హడలెత్తిస్తుంటాయి. ఎక్కువ సినిమాలలో ఇదే తంతు ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో బలమైన కథతో పాటు ఎమోషన్స్ కూడా బాగా ఉంటాయి. దెయ్యం అంటే ఏదో తెల్ల చీర కట్టుకుని గోడల మీద తిరగడం కాకుండా, పాతకాలపు మంత్రతంత్రాలు, మట్టి బొమ్మల మాయాజాలం చుట్టూ కథ తిరుగుతుంది. ఒక పక్క సెంటిమెంట్ పండిస్తూనే, ఇంకో పక్క వణుకు పుట్టించేలా ఈ సినిమాను చెక్కారు. చూస్తే మీరు కూడా వనికిపోతారు.

ఎక్కడ చూడచ్చు అంటే

2018లో వచ్చిన ఈ ఇజ్రాయెలీ సూపర్ నేచురల్ హారర్ సినిమా పేరు “ది గోలెమ్” (The Golem). దీనిని డోరాన్ పాజ్, యోవ్ పాజ్ దర్శకత్వం వహించారు. ఇందులో హనీ ఫుర్‌స్టెన్‌బర్గ్, ఇషాయ్ గోలన్ లీడ్ రోల్స్ లో నటించారు. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం, హాలీవుడ్ స్థాయి హారర్ సినిమాలతో పోటీ పడేలా ఉంటుంది. అద్భుతమైన సినిమాటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్‌ తో ఈ సినిమా కట్టిపడేస్తుంది. విమర్శకుల పరంగా కూడా ఈ సినిమాకు మంచి మార్కులే పడ్డాయి. ముఖ్యంగా ‘రాటెన్ టొమాటోస్’ వంటి సైట్లలో 89% స్కోరు సాధించి ఎలివేటెడ్ హారర్ కేటగిరీలో నిలిచింది. ఇది ప్రపంచవ్యాప్తంగా వివిధ ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడి ప్రశంసలు అందుకుంది. మీరు ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video)లో స్ట్రీమ్ చేయవచ్చు. Google Play Movies లో అద్దెకు కూడా తీసుకోవచ్చు.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

17వ శతాబ్దంలో లిథువేనియాలోని ఒక చిన్న యూదు గ్రామం కష్టాల్లో ఉంటుంది. ఒకవైపు ఊరంతా ప్లేగు వ్యాధి వ్యాపిస్తుంటే, మరోవైపు పక్క గ్రామాల వాళ్ళు, ఈ రోగానికి మీరే కారణం అంటూ దాడులు చేస్తుంటారు. ఈ సమయంలో ఆ గ్రామానికి చెందిన హన్నా అనే మహిళకు తన కొడుకును కోల్పోయిన బాధ ఉంటుంది. తన ఊరిని, ప్రజలను ఆ గొడవల నుండి కాపాడుకోవడానికి ఆమె ఎవరూ వెళ్లకూడని మార్గాన్ని ఎంచుకుంటుంది. కొన్ని ఆధ్యాత్మిక శక్తులను ఉపయోగించి మట్టితో ఒక ప్రాణిని (గోలెమ్) సృష్టిస్తుంది. ఆశ్చర్యకరంగా, ఆ గోలెమ్ చూడటానికి హన్నా చనిపోయిన కొడుకులాగే ఉంటుంది. దాంతో ఆమెకు దానిపై మమకారం పెరుగుతుంది. కానీ ఆ ప్రాణికి విపరీతమైన శక్తి ఉంటుంది. ఊరి మీదకు దాడికి వచ్చిన శత్రువులను అది అత్యంత క్రూరంగా చంపేస్తుంది.

మొదట్లో గ్రామాన్ని కాపాడుతున్న రక్షకుడిలా అనిపించినా, నెమ్మదిగా ఆ ప్రాణిలోని హింసాత్మకత బయటపడుతుంది. అది కేవలం శత్రువులనే కాకుండా, ఎదురువచ్చిన ఎవరినైనా చంపే స్థాయికి వెళ్తుంది. చివరికి ఆ ప్రాణి నియంత్రణ తప్పుతుంది. అది చేస్తున్న విధ్వంసాన్ని ఆపడం ఎవరి వల్లా కాదు. ఒకవైపు కొడుకు రూపంలో ఉన్న ఆ ప్రాణిపై ప్రేమ, మరోవైపు అది చేస్తున్న హత్యాకాండ చూసి హన్నా తట్టుకోలేకపోతుంది. క్లైమాక్స్ మరింత భయంకరంగా ఉంటుంది. హన్నా ఆ శక్తిని నియంత్రిస్తుందా ? దాని వల్ల ఇంకెంత వైలెన్స్ జరుగుతుంది ? అనే విషయాలను, ఈ హారర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : వెంటాడే ఆత్మ… ప్రతి నిమిషం వెన్నులో వణుకు పుట్టించే హాస్పిటల్ హారర్ మిస్టరీ

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×