E-Paper
Advertisement

దేవుడి బిడ్డ ప్రేమికుడిగా మారితే? చూడాల్సిన చూడచక్కని సినిమా

దేవుడి బిడ్డ ప్రేమికుడిగా మారితే? చూడాల్సిన చూడచక్కని సినిమా
Advertisement

Romantic movie OTT : కొన్ని సినిమాలు చూస్తున్నంత సేపు మంచి ఫీలింగ్ ను ఇస్తుంటాయి. అలాంటి సినిమాలు ఎప్పుడు వచ్చినా ప్రేక్షకులు అదరిస్తుంటారు కూడా. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా అలాంటిదే. ఈ సినిమా మొత్తం ఫిలిప్పీన్స్‌లోని అల్బే అనే ప్రాంతంలో షూట్ చేశారు. అక్కడి అందాలు, పచ్చని లొకేషన్లు సినిమాకి మెయిన్ హైలైట్. సినిమా చూస్తున్నంత సేపు ఒక టూర్ వెళ్లొచ్చిన ఫీలింగ్ వస్తుంది. ఈ కథ కూడా ఒక చర్చికి ఫాదర్ అవ్వబోయే కుర్రాడి చుట్టూ తిరుగుతుంది. అయితే అతను ప్రేమలో పడ్డాక అసలు కథ మొదలవుతుంది. ఈ సినిమాను ఫ్యామిలీతో కలసి ఎంచక్కా చూసేయచ్చు.

నెట్ ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్

2023లో RC డెలోస్ రేయ్స్ దర్శకత్వంలో వచ్చిన ఈ ఫిలిప్పీన్ రొమాంటిక్ సినిమా పేరు ‘ఐ లవ్ లిజ్జీ’ (I Love Lizzy). ఇందులో కార్లో అక్వినో, బార్బీ ఇంపీరియల్ లీడ్ రోల్స్ లో నటించారు. ఫిలిప్పీన్స్‌లో కార్లో అక్వినో పెద్ద స్టార్. అతను ఇలాంటి ఎమోషనల్ రోల్స్ చేయడంలో దిట్ట. ఇక బార్బీ ఇంపీరియల్ తన గ్లామర్‌తో, నటనతో లిజ్జీ క్యారెక్టర్‌కి ప్రాణం పోసింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అవ్వడం వల్లే సినిమాకి మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమా థియేటర్లలో కంటే Netflix లోకి వచ్చాక ఇండియాలో కూడా బాగా పాపులర్ అయ్యింది. ముఖ్యంగా ఎమోషనల్ లవ్ స్టోరీస్ ఇష్టపడే వాళ్లు దీన్ని తెగ చూశారు. కొన్ని వారాల పాటు టాప్ ట్రెండింగ్‌లో కూడా ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

జెఫ్ అనే కుర్రాడు చర్చిలో ఫాదర్ అవ్వాలని ట్రైనింగ్‌లో ఉంటాడు. కానీ లోపల ఏదో వెలితిగా అనిపించి, కొంచెం రిలాక్స్ అవ్వడానికి అల్బే అనే ఊరికి ట్రిప్ వెళ్తాడు. అక్కడ తనకి లిజ్జీ అనే అమ్మాయి పరిచయం అవుతుంది. ఆమె ఆ ఊర్లో టూర్ గైడ్‌గా పనిచేస్తూ, ఫుల్ బిజీగా, సందడిగా ఉండే టైపు. జెఫ్ పద్ధతిగా ఉంటే, లిజ్జీ మాత్రం లైఫ్‌ను ఎంజాయ్ చేసే రకం. మెల్లగా ఇద్దరి మధ్య పరిచయం పెరిగి, ఒకరినొకరు ఇష్టపడటం మొదలుపెడతారు. వీళ్లిద్దరి మధ్య ప్రేమ గట్టిగానే పుడుతుంది కానీ, జెఫ్‌కి ఒక పెద్ద చిక్కు వచ్చి పడుతుంది. అటు చూస్తే దేవుడికి ఇచ్చిన మాట, ఇటు చూస్తే ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించే లిజ్జీ. చివరికి పెళ్లి చేసుకుని సంసారంలో పడాలా? లేక అన్నీ వదిలేసి దేవుడి సేవలో కలిసిపోవాలా? అని జెఫ్ తెగ మదనపడిపోతాడు. ఈ గందరగోళంలో వాళ్ల ప్రేమ కథ ఎలాంటి మలుపులు తిరిగింది, చివరికి జెఫ్ ఏం నిర్ణయం తీసుకున్నాడు అనేదే అసలు సినిమా.

Read Also : ఇక్కడ దేవుడు లేడు… కేవలం దయ్యాల మనుషులే… మామూలు సినిమా కాదు క్లైమాక్స్ వరకు వణుకు

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×