E-Paper
Advertisement

ఇన్‌స్టాగ్రామ్‌లో హీరో, రియల్ లైఫ్ లో జీరో… ఈ డార్క్ కామెడీ మూవీ చూస్తే షాక్

ఇన్‌స్టాగ్రామ్‌లో హీరో, రియల్ లైఫ్ లో జీరో… ఈ డార్క్ కామెడీ మూవీ చూస్తే షాక్
Advertisement

Dark Comedy Movie on OTT: సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడం, యాక్టివిస్ట్‌లా మాట్లాడటం, వేల లైక్స్ సంపాదించుకోవడం… ఇవే నిజమైన సామాజిక బాధ్యతగా భావించే యువతను టార్గెట్ చేస్తూ వచ్చిన డార్క్ కామెడీ మూవీనే ‘అవర్ హీరో, బాల్తాజర్’(Our Hero, Balthazar 2025). బయట ప్రపంచంలో ఏమీ చేయకుండా సోషల్ మీడియాలో మాత్రం హీరోలా కనిపించాలనుకునే ఒక యువకుడి కథను చాలా విభిన్నంగా చూపించిన ఈ సినిమా, నేటి తరం సోషల్ మీడియా మైండ్‌సెట్‌పై సెటైరికల్‌గా తెరకెక్కింది. 2025లో ప్రతిష్టాత్మక ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయిన ఈ చిత్రం తాజాగా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులోకి వచ్చింది.

కథలోకి వెళ్తే…

న్యూయార్క్‌కు చెందిన బాల్తాజర్ మెలోన్ ఒక సంపన్న కుటుంబానికి చెందిన యువకుడు. చదువుకునే వయసులోనే సోషల్ మీడియాలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకోవాలని అతను ప్రయత్నిస్తుంటాడు. ముఖ్యంగా తన స్కూల్‌లో ఉండే ఒక యాక్టివిస్ట్ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి తుపాకుల నియంత్రణ వంటి సామాజిక అంశాలపై పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటాడు. సోషల్ మీడియాలో అతని వీడియోలు చూస్తే సమాజం కోసం పోరాడే గొప్ప యువకుడిలా కనిపిస్తాడు.

Advertisement

కానీ అసలు విషయం వేరే ఉంటుంది. నిజ జీవితంలో సామాజిక సమస్యలపై అతనికి పెద్దగా ఆసక్తి ఉండదు. తనకు కావాల్సింది మంచి పేరు, ఆన్‌లైన్ ఫేమ్, ఇతరుల ప్రశంసలు మాత్రమే. అంటే సోషల్ మీడియాలో హీరోగా కనిపించాలనే కోరిక తప్ప, నిజంగా ఏదైనా మార్పు తీసుకురావాలనే ఉద్దేశం అతనిలో ఉండదు. అలాంటి సమయంలో బాల్తాజర్ చేసే నకిలీ యాక్టివిజంపై సోలమన్ జాక్సన్ అనే ఆన్‌లైన్ ట్రోలర్ విరుచుకు పడతాడు. అతని పోస్టులు, కామెంట్లు బాల్తాజర్‌ను తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. అయితే ఒక దశలో సోలమన్ నుంచి వచ్చే కొన్ని సంకేతాలు పరిస్థితిని పూర్తిగా మార్చేస్తాయి. అతను పెద్ద హింసకు పాల్పడే ప్రమాదం ఉందని బాల్తాజర్‌కు అనిపిస్తుంది.

ఇక్కడే కథలో అసలు ట్విస్ట్ మొదలవుతుంది. సోషల్ మీడియాలో హీరోగా కనిపించడం మాత్రమే కాకుండా, నిజ జీవితంలో కూడా ఒకసారి నిజమైన హీరోగా మారాలని బాల్తాజర్ నిర్ణయించుకుంటాడు. ప్రమాదాన్ని ఆపి అందరి దృష్టిలో నిజమైన హీరోగా నిలవాలనే ఉద్దేశంతో అతను ఒంటరిగా టెక్సాస్‌కు బయలుదేరతాడు. అక్కడ సోలమన్‌ను కలిసిన తర్వాత బాల్తాజర్ ఊహించిన ప్రపంచం పూర్తిగా మారిపోతుంది. ఇద్దరి మధ్య జరిగే సంభాషణలు, వారి ఆలోచనలు, సోషల్ మీడియా ప్రభావం, యువతలో పెరుగుతున్న ఒంటరితనం, గుర్తింపు కోసం పడే ఆరాటం వంటి అంశాలు కథను మరో స్థాయికి తీసుకెళ్తాయి. బాల్తాజర్ నిజంగా హీరోగా మారతాడా ? లేక తనకు తానే సృష్టించుకున్న సోషల్ మీడియా ఇమేజ్‌లోనే చిక్కుకుపోతాడా ? అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది? అనేది సినిమాలో చూడాల్సిందే.

తెలుగులో మాత్రం లేదు

Advertisement

దర్శకుడిగా ఆస్కార్ బాయ్‌సన్‌కు ఇది తొలి సినిమా. జేడెన్ మార్టెల్, ఆసా బటర్‌ఫీల్డ్, నోహ్ సెంటినియో, జెన్నిఫర్ ఈల్ ప్రధాన పాత్రల్లో నటించారు. సుమారు గంటా 36 నిమిషాల నిడివితో సాగే ఈ మూవీ పెద్దలకు మాత్రమే. బోల్డ్ కంటెంట్, అసభ్యకర పదాలు, డ్రగ్స్‌కు సంబంధించిన అంశాలు ఉండటం వల్ల చిన్న పిల్లలతో చూడకపోవడమే బెటర్. ఈ మూవీ భారతదేశంలో అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో రెంటల్ విధానంలో అందుబాటులోకి వచ్చింది. సినిమాను చూడాలంటే రూ.119 పే చేసి చూడొచ్చు. ఇంటర్నెట్ ఫేమ్ కోసం యువత పడే ఆరాటం, నకిలీ యాక్టివిజం, ఆన్‌లైన్ క్లౌట్, టాక్సిక్ మస్కులినిటీ వంటి అంశాలను సీరియస్‌గా కాకుండా డార్క్ కామెడీ రూపంలో చూపించడం ఈ సినిమాకు ప్రత్యేకత. సోషల్ మీడియాలో కనిపించేది నిజమైన వ్యక్తిత్వమేనా, లేక మనం ప్రపంచానికి చూపించాలనుకునే ఒక నకిలీ ముఖమా అనే ప్రశ్నను ఈ సినిమా ప్రేక్షకుల మనసుల్లో లేవనెత్తుతుంది.

Read Also: రోడ్డు పేరుతో రైతుల భూములు కొట్టేయాలని ప్లాన్… మహిళ తిరుగుబాటుతో మొత్తం సిస్టమ్ షేక్

Related News

ఓటీటీలో రికార్డ్ సృష్టించిన ఇరుముడి.. ఎన్నో స్థానం అంటే?

పాడుబడిన భవంతిలో దెయ్యం… భయంతో పాటు కడుపుబ్బా నవ్వించే హారర్ కామెడీ

కొడుకు తల్లికంటే బేబీసిట్టర్ కే ఎక్కువ దగ్గరైతే… గుండెను పిండేసే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా

ఇంట్లో గది అద్దెకు ఇస్తే ఇదేం రచ్చ భయ్యా… మళ్లీ మొదలైన నవ్వుల హంగామా

గతాన్ని మర్చిపోయి దాక్కున్న గ్యాంగ్‌స్టర్‌… ప్రేమ కోసం మళ్లీ తుపాకీ పడితే… యాక్షన్ క్రైమ్ డ్రామా

సరదా ట్రిప్ కాస్తా దెయ్యాల టార్చర్‌గా మారితే… క్రేజీ హారర్ కామెడీ

పాట కోసం ప్రాణాలైనా ఇచ్చేంత పిచ్చి… కట్ చేస్తే పేరు తెచ్చిన పాటతోనే ఊహించని ట్విస్ట్… యూత్‌ఫుల్ మ్యూజికల్ డ్రామా

కూతురు కిడ్నాప్… పోలీసులు చేతులెత్తేయడంతో తండ్రి ఊచకోత…. హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×