Chicken Causes Cancer: చికెన్‌ను ఇష్టపడని వారు చాలా అరుదుగా ఉంటారు. రుచిగా ఉండటం, సులభంగా వండుకోవడం, రెడ్ మీట్‌తో పోలిస్తే ఆరోగ్యకరమైనది కావడం దీన్ని తినడానికి చాలా మంది మొగ్గు చూపుతారు. చికెన్‌లో విటమిన్-బి12, కోలిన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి పిల్లల మెదడు అభివృద్ధికి, పెద్దవాళ్ల మానసిక ఆరోగ్యానికి మంచివి. కానీ, ఇటీవల ఒక అధ్యయనం చికెన్ ఎక్కువగా తినేవాళ్లకు షాకింగ్ న్యూస్ తెచ్చింది.
న్యూట్రియెంట్స్ అనే జర్నల్‌లో ప్రచురించిన ఈ స్టడీ ప్రకారం, వారానికి 300 గ్రాముల కంటే ఎక్కువ చికెన్ తినడం వల్ల క్యాన్సర్ రిస్క్ పెరిగింది. ముఖ్యంగా జీర్ణాశయ క్యాన్సర్ వల్ల ఇలా జరుగుతోంది.
అధ్యయనంలో ఏముంది?
అమెరికా డైటరీ గైడ్‌లైన్స్ (2020-2025) ప్రకారం, వారానికి 100 గ్రాముల చికెన్ లేదా టర్కీ, బాతు వంటి ఇతర పౌల్ట్రీ ఆహారాన్ని తినే వారిపై పలు పరిశోధనలు జరిగాయి. ఈ అధ్యయనం చికెన్ ఎక్కువ తినడం వల్ల ఆరోగ్యంపై ఏం ప్రభావం ఉంటుందో తెలుసుకోవడానికి జరిగింది. ముఖ్యంగా రెడ్ మీట్, ప్రాసెస్డ్ మీట్ ఇప్పటికే ప్రమాదకరమని తెలిసిన నేపథ్యంలో..
4,000 కంటే ఎక్కువ మందిపై పరిశోధనలు జరిగాయి. వీటి కోసం వయసు, ఆరోగ్యం, జీవనశైలి అలవాట్లు, వైద్య చరిత్ర వంటి వాటిని పరగణలోకి తీసుకున్నారు. ఈ అధ్యయనాల్లో ఆశ్చర్యానికి గురి చేసే విషయాలు బయట పడ్డాయని నిపుణులు చెబుతున్నారు. వారానికి 300 గ్రాముల కంటే ఎక్కువ చికెన్ తినేవాళ్లలో, 100 గ్రాముల కంటే తక్కువ తినేవాళ్లతో పోలిస్తే, మరణ రిస్క్ 27% ఎక్కువగా ఉన్నట్లు తేలిందట.
300 గ్రాముల కంటే ఎక్కువ తినే పురుషుల్లో జీర్ణాశయ క్యాన్సర్ రిస్క్ రెట్టింపుగా ఉందని పరిశోధకులు వెల్లడించారు. మరణించిన 1,028 మందిలో 59% మంది రెడ్ మీట్ అధికంగా తిన్నారట, మరో 41% మంది తెల్ల మాంసం(29% చికెన్) అధికంగా తిన్నవారు ఉన్నారు. వారానికి 100 గ్రాముల కంటే ఎక్కువ చికెన్ తినేవాళ్లలో కూడా మరణ రిస్క్ కనిపించిందని అధ్యయనాలు చెబుతున్నాయి.
చికెన్‌ను ఎక్కువగా తినడం, ముఖ్యంగా సిఫార్సు చేసిన లిమిట్ కంటే ఎక్కువ తినడం వల్ల ఆరోగ్య ప్రమాదాలు అధికంగా ఉన్నట్లు ఈ అధ్యయనాలు చెబుతున్నాయి. వారానికి 300 గ్రాముల కంటే ఎక్కువ తినడం వల్ల మరణ రిస్క్ బాగా పెరుగుతుందట. ముఖ్యంగా పురుషుల్లో జీర్ణాశయ క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు.
అయితే, ప్రాసెస్డ్ చికెన్, వ్యాయామం, ఇతర జీవనశైలి అంశాలపై మరింత పరిశోధన అవసరమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రస్తుతానికి, చికెన్‌ను మితంగా తినడం, బ్యాలెన్స్డ్ డైట్ ఫాలో అవ్వడం బెస్ట్ అని సూచిస్తున్నారు. అంటే, వారానికి 100-300 గ్రాముల మధ్యలో చికెన్ తినడం సేఫ్ అని సలహా ఇస్తున్నారు. కాబట్టి, చికెన్ లవర్స్.. రుచి కోసం ఎక్కువ తినకుండా, మితంగా ఎంజాయ్ చేయడం ఉత్తమం.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా డాక్టర్ లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.