BigTV English

Secret zoo movie : జూలో జంతువులుగా నటించే మనుషులు… కడుపుబ్బా నవ్విస్తూ కన్నీళ్లు పెట్టించే సినిమా

Secret zoo movie : జూలో జంతువులుగా నటించే మనుషులు… కడుపుబ్బా నవ్విస్తూ కన్నీళ్లు పెట్టించే సినిమా

Secret zoo movie : ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న కొరియన్ సినిమాలకు, వెబ్ సిరీస్ లకు మంచి ఫాలోయింగ్ ఉంది. వెబ్ సిరీస్ లను మన ప్రేక్షకులు తెలుగు సీరియల్స్ చూసినట్టు చూస్తున్నారు. సినిమాలను కూడా మంచి కథలతో తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ స్టోరీ ఒక జూ చుట్టూ తిరుగుతుంది. దివాలా తీసిన జూ ను, హీరో పాపులర్ అయ్యేటట్టు చేస్తాడు. ఈ కామెడీ కొరియన్ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ కొరియన్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ పేరు ‘సీక్రెట్ జూ’ (Secret zoo). 2020 లో వచ్చిన ఈ కొరియన్ కామెడీ మూవీకి సన్ జే-గోన్ దర్శకత్వం వహించారు. ఇందులో అహ్న్ జే-హాంగ్, కాంగ్ సో-రా, పార్క్ యోంగ్-గ్యు, కిమ్ సంగ్-ఓహ్, జియోన్ యో-బీన్ నటించారు. I Don’t Bully You by Hun అనే వెబ్‌టూన్ ఆధారంగా, ఇది జనవరి 15, 2020న దక్షిణ కొరియాలో, జనవరి 24న యునైటెడ్ స్టేట్స్‌లో విడుదలైంది. ప్రస్తుతం ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

హీరో ఒక పెద్ద లాయర్ దగ్గర జూనియర్ లాయర్ గా పనిచేస్తుంటాడు. హీరో పనిచేసే బాస్ కి ఒక పెద్ద కేసు వస్తుంది. ఆ కేసులో ఒక కార్పొరేట్ కంపెనీ సీఈఓ కొడుకు, మనీలాండరింగ్ కేసులో జైల్లో ఉంటాడు. అతన్ని కలిసి వివరాలు తెలుసుకునే పని హీరోకి అప్పచెప్తాడు అతని బాస్. ఒకసారి హీరో తన బాస్ కి చిన్న ప్రమాదం నుంచి తప్పిస్తాడు. అలా బాస్ కంట్లో పడతాడు హీరో. ఆ తరువాత హీరోకి ఒక పని అప్పచెప్తాడు అతని బాస్. అదేమంటే ఒక కార్పొరేట్ కంపెనీ ఒక జూన్ కొనుగోలు చేసి ఉంటుంది. అది ఇప్పుడు దివాలా తీసే పరిస్థితిలో ఉంటుంది. అయితే దానిని డెవలప్ చేసి, మళ్లీ ఎక్కువ రేటుకు అమ్మే ప్లాన్ ఉంటుంది. దీనిని సక్సెస్ చేస్తే ప్రమోషన్ తో పాటు జాబ్ ను కూడా పర్మినెంట్ చేస్తానని బాస్ చెప్తాడు. అలా హీరో జూ దగ్గరికి వెళ్తాడు. అందులో నాలుగైదు జంతువులు తప్ప ఏమీ ఉండవు. అందులో పనిచేసే వాళ్లు కూడా ఇక ఇక్కడ చేయడం అనవసరం అని అనుకుంటూ ఉంటారు.

హీరో వాళ్లకు మోటివేషన్ ఇచ్చి, వాళ్ళను అక్కడే ఉండేటట్లు చూస్తాడు. జూ లో జంతువులు లేకపోవడంతో, అక్కడ పనిచేసే వాళ్ళకి జంతువుల వేషం వేసి, జూకు వచ్చే వాళ్ళని అట్రాక్ట్ చేపిస్తాడు. అలా జంతువుల రూపంలో ఉండే మనుషులు ఆ జూని డెవలప్ చేస్తారు. హీరోకి కూడా బాస్ దగ్గర మంచి పేరు వస్తుంది. చివరికి ఆ జూని క్లోజ్ చేసి ఒక కార్పొరేట్ హోటల్ ని కట్టాలని చూస్తారు. ఈ విషయం తెలిసి హీరో చాలా బాధపడతాడు. ఈ విషయం తెలియని జూలో పనిచేసేవాళ్ళు, హీరోని అభినందిస్తూ ఒక పార్టీ ఏర్పాటు చేస్తారు. చివరికి ఈ విషయం జూలో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుందా? అక్కడ కార్పొరేట్ కంపెనీని ఏర్పాటు చేస్తారా? హీరోకి తన జాబ్ పర్మనెంట్ అవుతుందా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Big Stories

×