E-Paper
Advertisement

Thandel: ‘తండేల్’ చూడడానికి వెళ్తున్నారా.? అయితే మీకు స్పెషల్ సర్‌ప్రైజ్.!

Thandel: ‘తండేల్’ చూడడానికి వెళ్తున్నారా.? అయితే మీకు స్పెషల్ సర్‌ప్రైజ్.!
Advertisement

Thandel: 2025లో సంక్రాంతి సినిమాల జోరు తగ్గిపోయిన తర్వాత ఫిబ్రవరి మొదటి వారంలో విడుదలయిన ఒకేఒక్క సినిమా ‘తండేల్’. ఈ సినిమాకు పోటీగా మరే ఇతర పెద్ద సినిమాలు విడుదల కాకపోవడంతో ‘తండేల్’కు వెళ్లే ప్రేక్షకుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. ముందు నుండే ఈ మూవీ ఆడియన్స్‌కు నచ్చేలా చేయడం కోసం మేకర్స్ చాలానే ప్రమోషన్స్ చేశారు. ముఖ్యంగా నాగచైతన్య అయితే ‘తండేల్’ను ప్రమోట్ చేయడం కోసం ఒక్క ఛాన్స్ కూడా వదల్లేదు. ఇంకొక రోజులో ఈ మూవీ విడుదలయ్యి వారం రోజులు దాటిపోతుంది. దీంతో మేకర్స్ అంతా కలిసి థియేటర్లలో ‘తండేల్’ చూసే ప్రేక్షకుల కోసం ఒక స్పెషల్ సర్‌ప్రైజ్‌లో ప్లాన్ చేయనున్నారని సమాచారం.

కచ్చితంగా నచ్చుతుంది

Advertisement

ఈరోజుల్లో ముందుగా ఒక సినిమా ప్రింట్‌ను థియేటర్లకు పంపించేసిన తర్వాత కొన్నిరోజులు ఆగి దాని ఎడిటెడ్ వర్షన్‌ను కూడా థియేటర్లలో విడుదల చేస్తున్నారు మేకర్స్. ‘తండేల్’ విషయంలో కూడా అదే జరగనుందట. సినిమా కథను బాగా చెప్పాలనే ఉద్దేశ్యంతో పలు ఇంట్రెస్టింగ్ సీన్స్‌ను ఎడిట్ చేశారట మేకర్స్. ఇక ఆ డిలీటెడ్ సీన్స్‌ను కూడా యాడ్ చేసి ‘తండేల్’ను థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ మూవీకి ప్రేక్షకుల దగ్గర నుండి పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది. ఇక ఈ డిలీటెడ్ సీన్స్ కూడా యాడ్ చేస్తే కచ్చితంగా ప్రేక్షకులకు ఇది మరింత నచ్చుతుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు.

వర్కవుట్ అవుతుందా

Advertisement

‘తండేల్’ డిలీటెడ్ సీన్స్‌ను థియేటర్లలో యాడ్ చేయలేకపోతే కనీసం ఓటీటీలో అయినా యాడ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇప్పటికే మూవీ టీమ్ మధ్య ఈ విషయంలో డిస్కషన్ కూడా జరిగినట్టు తెలుస్తోంది. ఈ సినిమా రైట్స్‌ను ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఈ మూవీ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది కాబట్టి ఓటీటీలో విడుదలకు టైమ్ పడుతుంది. అందుకే డిలీటెడ్ సీన్స్‌ను ప్రేక్షకులు థియేటర్లలో చూడగలరా లేదా నేరుగా ఓటీటీలోనే చూడాలా అనే సందేహాలు మొదలయ్యాయి. మొత్తానికి ‘తండేల్’లో ఎక్స్‌ట్రా సీన్స్ యాడ్ చేసినా కూడా దానిని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం మేకర్స్‌లో కనిపిస్తోంది.

Also Read: సినిమాలో ప్రియాంక చోప్రా క్యారెక్టర్ ఇలా ఉండబోతుందా.? ఇదేదో ఇంట్రెస్టింగ్‌గా ఉందే.!

నిజమైన సంఘటన ఆధారంగా

చందూ మోండేటి (Chandoo Mondeti) దర్శకత్వంలో నాగచైతన్య (Naga Chaitanya), సాయి పల్లవి (Sai Pallavi) నటించిన చిత్రమే ‘తండేల్’ (Thandel). శ్రీకాకుళానికి చెందిన కొందరు మత్స్యకారుల జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. వారి జీవితంలో జరిగిన మర్చిపోలేని సంఘటన గురించి ప్రేక్షకులకు చెప్పాలని దాదాపు ఆరు నెలల పాటు ప్రీ ప్రొడక్షన్‌కే సమయాన్ని కేటాయించింది టీమ్. నాగచైతన్య, చందూతో పాటు మరికొందరు మూవీ టీమ్ వెళ్లి ఆ మత్స్యకారులను నేరుగా కలిశారు. ఆ సంఘటన గురించి స్పష్టంగా తెలుసుకొని దానిని తెరపై చక్కగా చూపించారు. ముఖ్యంగా ‘తండేల్’లో నాగచైతన్య, సాయి పల్లవి యాక్టింగ్ హైలెట్‌గా నిలిచింది. ఎప్పటిలాగానే తన యాక్టింగ్‌తో అందరూ కంటతడి పెట్టేలా చేసింది సాయి పల్లవి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×