OTT Movie : సైన్స్ ఫిక్షన్, సస్పెన్స్, డార్క్ కామెడీతో వచ్చిన ఒక సిరీస్ ఒటిటిలో అదరగొడుతోంది. IMDbలో 8.7/10 రేటింగ్ తో ఈ సిరీస్ దూసుకుపోతోంది. ఈ సిరీస్ లూమన్ ఇండస్ట్రీస్ అనే బయోటెక్ కంపెనీలో జరిగే “సెవెరెన్స్” ప్రక్రియ చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ ఒక చిప్ తో బ్రైన్ ను కంట్రోల్ చేస్తుంటారు. క్లైమాక్స్ వరకూ సస్పెన్స్ తోనే ఈ సిరీస్ నడుస్తుంది. దీని పేరు ఏమిటి ? ఏ ఒటిటిలో ఉంది ? అనే వివరాల్లోకి వెళితే …
ఆపిల్ టీవీ+లో స్ట్రీమింగ్
‘సెవెరెన్స్’ (Severance) 2022లో విడుదలైన అమెరికన్ సైన్స్ ఫిక్షన్ సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్. దీనిని డాన్ ఎరిక్సన్ సృష్టించగా, బెన్ స్టిల్లర్, ఆయిఫ్ మెక్‌ఆర్డ్ల్ దర్శకత్వం వహించారు. ఇందులో ఆడమ్ స్కాట్, బ్రిట్ లోవర్, జాక్ చెర్రీ, జాన్ టర్టురో, క్రిస్టోఫర్ వాకెన్, ప్యాట్రిసియా ఆర్క్వెట్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ లూమన్ ఇండస్ట్రీస్ అనే బయోటెక్ కంపెనీలో జరిగే “సెవెరెన్స్” ప్రక్రియ చుట్టూ తిరుగుతుంది. IMDbలో 8.7/10, రాటెన్ టొమాటోస్‌లో 97% రేటింగ్ ను ఈ సిరీస్ పొందింది. ఇది ఆపిల్ టీవీ+లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
మార్క్ స్కౌట్ అనే వ్యక్తి లూమన్ ఇండస్ట్రీస్ అనే కంపెనీలో మాక్రోడేటా రిఫైన్‌మెంట్ టీమ్‌కి లీడర్‌గా పని చేస్తుంటాడు. ఈ కంపెనీలో ఒక వింతైన “సెవెరెన్స్” ప్రక్రియ ఉంటుంది. ఉద్యోగుల మెదడులో ఒక చిప్ పెట్టి, వాళ్ల పని జ్ఞాపకాలను వ్యక్తిగత జీవిత జ్ఞాపకాల నుండి పూర్తిగా వేరు చేస్తారు. అంటే ఆఫీసులో ఉన్నప్పుడు వాళ్లకు బయటి జీవితం గురించి ఏమీ తెలియదు. ఇంటికి వెళ్లినప్పుడు ఆఫీసు గురించి ఏమీ గుర్తుండదు. ఈ ప్రక్రియ మార్క్‌కి సౌకర్యంగా ఉంటుంది. ఎందుకంటే అతని భార్య గెమ్మా మరణించిన బాధ నుండి ఆఫీసులో ఉన్నప్పుడు మరిచిపోగలుగుతుంటాడు. మార్క్ టీమ్‌లో ఇర్వింగ్, డిలాన్, కొత్తగా చేరిన హెల్లీ ఉంటారు. వీళ్లు ఆఫీసులో “మాక్రోడేటా రిఫైన్‌మెంట్” అనే పని చేస్తుంటారు. కంప్యూటర్ స్క్రీన్‌పై సంఖ్యలను సరిచేస్తుంటారు. కానీ దీని వెనుక ఉన్న రహస్యం వాళ్లకు కూడా తెలియదు. హెల్లీకి ఈ పని, ఆఫీసు రూల్స్ ఏమాత్రం నచ్చవు, ఆమె రాజీనామా చేయాలని ప్రయత్నిస్తుంది.
Read Also : పెయింటర్ తో ప్రేమ… చదువుకోమని పంపిస్తే ఇదేం పిచ్చి పని పాపా?… డైరెక్టర్ ను అనాలి