BigTV English
Advertisement

OTT Movie : నడిరోడ్డుపై కట్టలుగా డబ్బు… ఈ కిలాడీ లేడీ వేసే మాస్టర్ ప్లాన్ లో ఊహించని ట్విస్టులు… క్లైమాక్స్ హైలెట్

OTT Movie : నడిరోడ్డుపై కట్టలుగా డబ్బు… ఈ కిలాడీ లేడీ వేసే మాస్టర్ ప్లాన్ లో ఊహించని ట్విస్టులు… క్లైమాక్స్ హైలెట్

OTT Movie : కిక్కెక్కించే క్రైమ్ థ్రిల్లర్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండవు చెప్పండి. ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే, గ్రిప్పింగ్ నరేషన్ ఉండాలే గానీ ఈ జానర్ కు మించిన సినిమాలు ఉంటాయా ? అన్పిస్తుంది. అలాంటి సినిమాలను ఇష్టపడే వారి కోసమే ట్విస్టులతో మెంటల్ మాస్ తెప్పించే ఓ అదిరిపోయే క్రైమ్ థ్రిల్లర్ ఈరోజు మన మూవీ సజెషన్. ఈ సినిమా రన్ లోలా రన్, కోయెన్ బ్రదర్స్ స్టైల్‌లో ఉండే బ్లాక్ కామెడీ, నాన్-లీనియర్ నరేషన్, ఒక అసాధారణమైన క్రైమ్ థ్రిల్లర్ అనుభవాన్ని అందిస్తుంది. ఆ మూవీ పేరేంటి? దాని కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


కథలోకి వెళ్తే…
కథ స్విస్ ఆల్ప్స్‌లోని ఒక చిన్న గ్రామంలో జరుగుతుంది, ఇక్కడ బార్బరా డగ్గెన్ (ఈవ్ కానలీ) అనే అమ్మాయి, తన తల్లి మరణం తర్వాత వారసత్వంగా వచ్చే ఫాబ్రిక్ షాప్‌ను కాపాడుకోవడానికి కష్టపడుతుంది. ఆమె “టాకింగ్ పోర్ట్రెయిట్స్” (బొమ్మలు గొంతుతో మాట్లాడే సీవింగ్ కళాకృతులు), మొబైల్ సీవింగ్ సర్వీస్‌ వంటి వ్యాపారాన్ని నడుపుతుంది. కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా షాప్ మూసివేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక రోజు ఒక ముసలావిడ మూడవ పెళ్లి కోసం, వివాహ దుస్తులకు బటన్ కుట్టే అపాయింట్‌మెంట్‌ తీసుకుంటుంది. కానీ అందులో పొరపాటు జరగడంతో, బార్బరా రీప్లేస్‌మెంట్ బటన్ కోసం బయలు దేరుతుంది.
ఆమె ప్రయాణంలో ఎవ్వరూ లేని ఓ రహదారిపై ఒక యాక్సిడెంట్ చూస్తుంది. రెండు బైకులు నడుపుతున్న ఇద్దరు వ్యక్తులు జోషువా ఆర్మిటేజ్ (కాలమ్ వర్తీ), బెక్ (థామస్ డగ్లస్) రోడ్డుపై గాయపడి కన్పిస్తారు. వారి దగ్గర తుపాకీలు, చెల్లాచెదురైన కొకైన్ బ్యాగ్‌లు, ఒక బ్రీఫ్‌కేస్ నిండా డబ్బు ఉంది. అయితే అక్కడి నుంచి డబ్బు తీసుకుని పారిపోవడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేసి, అడ్డంగా దొరికిపోతుంది హీరోయిన్. వెంటనే జోషువా తండ్రి, క్రూరమైన డ్రగ్ కింగ్‌పిన్ హడ్సన్ ఆర్మిటేజ్ (జాన్ లించ్) తన కొడుకు వైఫల్యానికి బదులు తీర్చుకోవడానికి వస్తాడు. ఈ టైమ్ లో బార్బరా ముందు మూడు ఆప్షన్స్ ఉంటాయి.

1. డబ్బు బ్రీఫ్‌కేస్‌ను తీసుకొని, గాయపడిన వ్యక్తులను చంపి, ఆమె షాప్‌ను కాపాడుకోవడానికి ప్రయత్నించడం.


2. పోలీసులకు కాల్ చేయడం: షెరీఫ్ మిస్ ఎంగెల్ (కె. కాలన్)కు సమాచారం ఇవ్వడం, కానీ డబ్బును దాచడానికి ప్రయత్నించడం.

3. ఏమీ తెలియనట్టు వెళ్లిపోయినా, క్రైమ్ సీన్ లో ఆమె ఆధారాలు ఉండడంతో కేసులో బుక్ అవ్వడం.

మరి ఈ 3 ఆప్షన్స్ లో ఆ అమ్మాయి ఏది సెలెక్ట్ చేసుకుంది ? క్లైమాక్స్ లో వచ్చే దిమ్మతిరిగే ట్విస్ట్ ఏంటి? అనేది తెరపై చూడాల్సిందే.

Read Also : లవర్స్ ను మార్చుకుని ఆ పాడు పనులు చేసే అన్నాతమ్ముడు… ఇదెక్కడి దిక్కుమాలిన మూవీరా అయ్యా

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ ?
ఫ్రెడ్డీ మాక్‌డొనాల్డ్ దర్శకత్వంలో తీసిన అమెరికన్-స్విస్ క్రైమ్ థ్రిల్లర్ ‘సో టార్న్’ (Sew Torn). ఈవ్ కానలీ, కాలమ్ వర్తీ , జాన్ లించ్, కె. కాలన్, థామస్ డగ్లస్, రాన్ కుక్, కరోలిన్ గుడ్ఆల్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీకి సెన్సార్ ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. 2024 మార్చి 11న సౌత్ బై సౌత్‌వెస్ట్ (SXSW) ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయి, 2025 మే 9న థియేటర్లలో విడుదలైంది ఈ మూవీ. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళం భాషలలొ స్ట్రీమింగ్ అవుతోంది. విజువల్ స్టైల్ ఈ సినిమాను ఒక యూనిక్ థ్రిల్లర్‌గా నిలబెట్టింది. .

Related News

OTT Movie : దొంగను దేవుడిగా మార్చే కోహినూర్ డైమండ్… బిచ్చగాళ్లతో కలిసి అరాచకం… కడుపుబ్బా నవ్వించే తమిళ కామెడీ మూవీ

OTT Movie : దెయ్యాలను తరిమికొట్టే సిస్టర్స్… కుర్రాడి ఎంట్రీతో కథలో ట్విస్ట్… తెలుగులోనూ హర్రర్ మూవీ స్ట్రీమింగ్

OTT Movie : నలుగురు కుర్రాళ్ళు ఒకే అమ్మాయితో… నెలలోపే ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ కామెడీ చిత్రం

OTT Movie : రాకుమారిని వెంటాడే నాగ బంధనం… ఆత్మను ప్రేమించే నరుడు… ఓటీటీలో సరికొత్త థ్రిల్లర్

OTT Movie : భర్త ఉండగా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో… మన తెలుగు సినిమానే కాపీ కొట్టారు మావా

OTT Movie : అమ్మాయిల డర్టీ స్కామ్… ఆటగాళ్లే వీళ్ళ టార్గెట్… అన్నీ అవే సీన్లు మావా

OTT Movie : పక్షవాతం వచ్చినోడితో ప్రేమాయణం… గుండెను పిండేసే ప్రేమకథ… లవర్స్ డోంట్ మిస్

OTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథOTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథ

Big Stories

×